తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Whatsapp యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. డిలిట్ చేసిన మెసేజ్ తిరిగి పొందే ఆఫ్ష్షన్!

WhatsApp యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. డిలిట్ చేసిన మెసేజ్ తిరిగి పొందే ఆఫ్ష్షన్!

HT Telugu Desk HT Telugu

19 August 2022, 21:18 IST

    • వాట్సాప్ యుజర్స్‌కు మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌ని తిరిగి పొందే ఆప్షన్‌ను  అందించనున్నారు.
whats app
whats app (Pixabay)

whats app

ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ యూజర్ సౌలభ్యానికి అనుగుణంగా ఆకర్షణీయమైన ఫీచర్స్‌ను అందిస్తోంది. గత కొన్ని నెలలుగా ఒకదాని తర్వాత మరొక వినూత్నమైన అప్‌డేట్‌లను ప్రవేశపెడుతోంది . తాజాగా ఆల్ డిలీట్ ఫర్ ఎవరీ వన్ (delete for everyone) ఆప్షన్‌లో టైమ్ లిమిట్‌ను పెంచారు. వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌ని తిరిగి పొందే ఆప్షన్‌ను అందించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

Optical Illusion: కేవలం డిటెక్టివ్‌లు మాత్రమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో దాక్కుని ఉన్న టై ను కనిపెట్టగలరు, ప్రయత్నించండి

Bad Food Combinations: ఆయుర్వేదం ప్రకారం తినకూడని ఫుడ్ కాంబినేషన్లు ఇవే

WhatsApp Beta Infoలో ఈ ఆప్షన్ గురించి పూర్తిగా వివరించారు. ఇది Android బీటా వెర్షన్‌లో ప్రయోగాత్మక దశలో ఉంది. ఇప్పుడు ఎవరికైనా సందేశాన్ని పంపి, పొరపాటున దానిని తొలగించినట్లయితే, ఆ సందేశాన్ని తిరిగి పొందేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆప్షన్ అమల్లోకి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు . త్వరలో ఆండ్రాయిడ్ , ఐఓఎస్ యూజర్లకు ఈ ఆప్షన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది .

అలాగే వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలో అవతార్ అనే ఆప్షన్‌ను డెవలప్ చేస్తున్నట్లు WhatsApp Betainfo నివేదించింది . ఈ అవతార్ ఫీచర్‌ని ఉపయోగించడం ద్వారా మీరు మీ ప్రొఫైల్ ఫోటోను మరింత అందంగా మార్చుకోవచ్చు . అంటే , ఇక్కడ మీరు బ్యాక్ గ్రౌండ్ కలర్ ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది . ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ మరికొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్ , iOS, డెస్క్‌టాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది .

దీనికి అదనంగా, కొత్త లాగిన్ ఫీచర్‌ను తీసుకురావాలని ప్రతిపాదించింది . ఇది ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్‌లోని లాగిన్ అప్రూవల్ ఫీచర్‌ను పోలి ఉంటుంది. న్యూ డివైజ్‌లో మీ WhatsApp ఖాతాకు లాగిన్ చేస్తే , మీకు వాట్సప్ నుండి నోటిఫికేషన్ వస్తుంది . మీరు లాగిన్ చేస్తున్నారా లేదా అని నిర్ధారించమని ఈ నోటిఫికేషన్ మిమ్మల్ని అడుగుతుంది . మీరు ఓకే చేస్తేనే వాట్సాప్ లాగిన్ అవుతుంది . అలాగే, మీరు 6 -అంకెల వెరిఫికేషన్ కోడ్‌ను తప్పుగా షేర్ చేస్తే, మీ లాగిన్ ప్రయత్నం విఫలమవుతుంది.

తదుపరి వ్యాసం