తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Muggu: ముగ్గు అంటే ఏంటి? ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఏమవుతుంది?

Muggu: ముగ్గు అంటే ఏంటి? ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఏమవుతుంది?

28 February 2022, 17:41 IST

    • లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తుంటారు. ముగ్గుకున్న ప్రాధాన్యత ఏంటి ? ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి ? హిందూ ధర్మంలో ముగ్గుకున్న విశిష్టత ఏంటనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముగ్గు
ముగ్గు (pixabay)

ముగ్గు

ముగ్గును.. పలు చోట్ల పలు రకాల పేర్లతో పిలుస్లారు. రంగోలి(ఉత్తర దేశం), రంగవల్లి(కర్నాటక), పూకలం(కేరళ), చౌకుపురానా(మధ్య ప్రదేశ్), మదన (రాజస్థాన్), అరిపన (బీహార్), అల్పన (బెంగాల్), కోలం (తమిళనాడు) ఇలా ముగ్గుకు విభిన్నమైన పేర్లు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

ఇంట్లో దేవుడి మందిరం దగ్గర, తులసి కోట వద్ద, పసుపు రాచిన గుమ్మాల (ద్వారానికి ఉండే గడప) మీద బియ్యపు పిండితోనే ముగ్గు వేయటం సంప్రదాయంగా వస్తోంది. ఇంటి బయట , పెరట్లోను, ఇతర ప్రదేశాల లోనూ వేసే ముగ్గులు ముగ్గుతో వేయటం ఆనవాయితీగా వస్తోంది. దీనికి కూడా ఒక కారణం ఉంది. ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు.  గుల్ల ముగ్గుతోనూ, బియ్యపు పిండితోనూ లేదా రెండు కలిపిన మిశ్రమంతో కూడా రంగవల్లి వేస్తారు.

ముగ్గు వేయకపోతే..

ఏ ఇంటి ముందయినా ముగ్గు లేదంటే.. ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందని అర్థం. ఆ ఇంటి వాళ్లు మరణించినప్పుడు వాకిలి ఊడుస్తారు కానీ, ముగ్గు మాత్రం వెయ్యరు. అలా ముగ్గు లేని ఇంటికి బిక్షకులు, సాధుసన్యాసులు భిక్షకు వెళ్లరు.

పౌరాణిక గాథ..

అన్ని పురాణాల్లోనూ రంగ వల్లికల ప్రస్తావన కనిపిస్తుంది. ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది. అదేంటంటే.. కొన్ని యుగాలకు ముందు ఒక రాజుండేవాడు. ఆయనకు ఒక గురువున్నాడు. ఆ గురువు గారికి లేక లేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు. పుత్ర శోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. తన కుమారుని బతికించమని కోరతాడు.

అప్పుడు ఆ బ్రహ్మ దేవుడు.. గురువుతో నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిళ్లు ఊడ్చి, శుభ్రం చేసి, ఇంటి ముందు రంగ వల్లులు తీర్చిదిద్దమని చెబుతాడు. రాజాజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిళ్లు ఊడ్చి, వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు. ఆ గురువు తన ఇంటిముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు. బ్రహ్మ సంతోషించి, అతని కుమారుడిని బతికిస్తాడు. అప్పటినుంచి ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్లు ఊడ్చి, ముగ్గులు గీయడం అలవాటు చేసుకున్నారు.

అడ్డగీతలు గీయాలి..

ముగ్గువేసి దానికి రెండువైపులా రెండేసి అడ్డు గీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతోందని అర్థం. అలా గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని, లక్ష్మీదేవి ఆ ఇంటినుంచి బయటకెళ్లి పోతుందని పెద్దలు చెబుతారు. దేవతా పూజలు, నోములు, వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం ఆచారం. అలా వేసిన చిన్న ముగ్గుకు కూడా అడ్డు గీతలు తప్పనిసరి.

 

తదుపరి వ్యాసం