తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Low Sodium Diet : ఉప్పు తినడం తగ్గించారా? అయితే పెద్ద సమస్యే

Low Sodium Diet : ఉప్పు తినడం తగ్గించారా? అయితే పెద్ద సమస్యే

Anand Sai HT Telugu

12 October 2023, 15:30 IST

    • Low Sodium Diet : శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన వివిధ అంశాలలో సోడియం ఒకటి. ఇది ప్రతిరోజూ సాధారణ ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఉప్పులో అత్యధికంగా సోడియం ఉంటుంది. ఉప్పు లేదా సోడియం ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరం. శరీరంలో సోడియం తక్కువగా అయినా సమస్యలే వస్తాయి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

సోడియం అనేది రక్తపోటు, ద్రవ సమతుల్యత, నరాల పనితీరును నియంత్రించే ఒక ముఖ్యమైన ఎలక్ట్రోలైట్. రక్తంలో సోడియం వంటి అవసరమైన మూలకాల లోపం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. మరణం సంభవించే అవకాశం కూడా ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

శరీరంలో సోడియం తక్కువగా ఉండటం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది కండరాల నొప్పి, శారీరక బలహీనత, సక్రమంగా గుండె కొట్టుకోకపోవడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఉప్పులో సోడియం ఉంటుంది. శరీరంలో సరైన మొత్తంలో సోడియం అవసరం, ఇది రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది.

అయినప్పటికీ, శరీరంలో సోడియం లేకపోవడం వల్ల రక్తపోటు చాలా తక్కువగా పడిపోతుంది. దీనిని హైపోటెన్షన్ అంటారు. తక్కువగా ఉంటే కళ్లు తిరగడం, మూర్ఛపోవడం, చూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయి. హైపోటెన్షన్ చాలా కాలం పాటు కొనసాగితే, శరీరంలోని ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రసరణ సరిగా ఉండదు. ఇది భారీ నష్టాన్ని కలిగిస్తుంది.

రక్తంలో సోడియం స్థాయి పూర్తిగా పడిపోతే, శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అంటే శరీరంలోని ద్రవ సమతుల్యత పోతుంది. కోమా, మరణం వంటి సమస్యలు సంభవించవచ్చు. వైద్య పరిభాషలో దీనిని హైపోనట్రేమియా అంటారు. హైపోనట్రేమియా అజీర్ణం, తలనొప్పి, వికారం, గందరగోళం, మూర్ఛ, బద్ధకం లేదా పనులు చేసేందుకు ఇంట్రస్ట్ లేకుండా ఉండొచ్చు.

మూత్రపిండాలు సక్రమంగా పనిచేయాలంటే శరీరానికి సరైన మోతాదులో సోడియం అవసరం. కానీ సోడియం లోపిస్తే కిడ్నీ పనితీరు తగ్గుతుంది, కిడ్నీలో రాళ్లు కూడా వస్తాయి. చాలా తక్కువ ఉప్పు తినడం లేదా అస్సలు తినకపోవడం రక్తంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

సోడియం శరీరంలోకి అస్సలు వెళ్లకపోతే గుండెపై చెడు ప్రభావం చూపుతుంది. తక్కువ సోడియం తీసుకోవడం రక్తపోటును తగ్గిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. సోడియం లేకపోవడం నరాల సంకేతాలకు అంతరాయం కలిగిస్తుంది. కండరాల సంకోచాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది కండరాల బలహీనత, మూర్ఛ, పక్షవాతానికి కూడా దారితీస్తుంది.

చాలా కాలంగా మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తుల రక్తంలో సోడియం స్థాయిలు తక్కువగా ఉండే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ రోగులు ఒకే ప్రభావాన్ని కలిగి ఉంటారు.

తదుపరి వ్యాసం