తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vivo V25 Pro। రంగులు మారే బ్యాక్ ప్యానెల్‌తో వచ్చిన వివో ప్రీమియం స్మార్ట్‌ఫోన్!

Vivo V25 Pro। రంగులు మారే బ్యాక్ ప్యానెల్‌తో వచ్చిన వివో ప్రీమియం స్మార్ట్‌ఫోన్!

HT Telugu Desk HT Telugu

17 August 2022, 14:43 IST

    • వివో నుంచి సరికొత్త Vivo V25 Pro స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. ఎండ తగిలినపుడు ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ రంగు మారుతుంది. మరిన్ని ప్రత్యేకతలను తెలుసుకోండి.
Vivo V25 Pro
Vivo V25 Pro

Vivo V25 Pro

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో తమ బ్రాండ్ నుంచి సరికొత్త Vivo V25 Pro స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది మధ్య-శ్రేణి సెగ్మెంట్లో వచ్చిన స్మార్ట్‌ఫోన్‌. ఈ ఫోన్‌లో కొన్ని విభిన్నమైన ఫీచర్లు ఉన్నాయి. దీని బ్యాక్ ప్యానెల్ రంగుమారే గ్లాస్ డిజైన్‌తో వచ్చింది. Vivo V25 Proలోని 'సెయిలింగ్ బ్లూ' కలర్ ఆప్షన్ మోడల్ ఎక్కువసేపు సూర్యకాంతి లేదా కఠినమైన UV కాంతికి గురైనప్పుడు బ్లూ కలర్ నుంచి నల్లటి రంగులోకి మారుతుంది. దీని గ్లాస్ డిజైన్‌ ఫోన్‌కు ప్రీమియం రూపాన్ని ఇస్తుంది. మరొకటి బ్లాక్ కలర్ ఆప్షన్లో కూడా వచ్చింది. దీని ప్యానెల్ మాత్రం రంగును మార్చదు. ఇక ముందువైపు 3D కర్వ్డ్ స్క్రీన్‌ రావటం మరొక హైలైట్ అని చెప్పవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Mango Fruit Bobbatlu: మామిడిపండు బొబ్బట్లు చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి ఎందుకు తినకూడదో అసలైన కారణాలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

Vivo V25 Pro ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా రెండు కాన్ఫిగరేషన్లలో వచ్చింది. రూ. 36 వేల నుంచి ఈ ఫోన్ ధరలు ప్రారంభమవుతున్నాయి. అయితే ప్రీ-బుకింగ్ చేయాలని నిర్ణయించుకున్న కస్టమర్‌లకు రూ. 3,500 ఫ్లాట్ తగ్గింపును కంపెనీ అందిస్తోంది. దీనితో పాటు రూ. 3,000 వరకు అదనపు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను కూడా పొందగలరు.

ఇంకా ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. వీటి ధరలు ఎంత మొదలగు అన్ని వివరాలు ఇక్కడ కింద పరిశీలించండి.

Vivo V25 Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.53 అంగుళాల FHD+ AMOLED కర్వ్డ్ డిస్‌ప్లే
  • 8GB/12GB RAM, 128/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్
  • వెనకవైపు 64MP+8MP+2MP కెమెరా, ముందు భాగంలో 32 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4830 mAh బ్యాటరీ సామర్థ్యం, 66W ఛార్జర్

8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999/-

12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999/-

ఆగస్టు 25 నుంచి ఈఫోన్ విక్రయాలు ప్రారంభమవుతున్నాయి. ఇందుకోసం ఈరోజు నుంచే ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమైనాయి.

టాపిక్

తదుపరి వ్యాసం