తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vivo V25 5g: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో Vivo V25 5g.. లాంచింగ్ టైంలోనే డిస్కౌంట్స్!

Vivo V25 5G: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో Vivo V25 5G.. లాంచింగ్ టైంలోనే డిస్కౌంట్స్!

HT Telugu Desk HT Telugu

10 September 2022, 23:02 IST

  • Vivo V25 5G: చైనీస్ టెక్ కంపెనీ Vivo V25 5G సిరీస్ సెల్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. 5G సపోర్ట్‌, 50MP సెల్ఫీ కెమెరా గల Vivo V25 5G ఫోన్ Flipkart సేల్‌లో త్వరలో లాంచ్ కానుంది. Vivo V25 5Gపై కూడా ప్రత్యేక లాంచ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అయితే దీని ధర ఇంకా వెల్లడి కాలేదు.

Vivo V25 5G
Vivo V25 5G

Vivo V25 5G

ఇటీవలే చైనీస్ కంపెనీ వివో తన V25 సిరీస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ సిరీస్‌లో Vivo V25 5G, Vivo V25 Pro వంటి రెండు స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్ విడుదల చేసింది. ఈ మోడల్స్ అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తాయి. స్టాండర్డ్ 5G మోడల్ ఇంకా భారతదేశంలో ప్రారంభించబడలేదు. Vivo V25 5Gని ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇక లాంచింగ్ సమయంలోనే వినియోగదారులు ఈ ఫోన్‌పై అనేక ఆఫర్‌లు, డిస్కౌంట్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు.

Vivo V25 5G స్మార్ట్‌ఫోన్ త్వరలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌లో వెల్లడించారు. అయితే ఫోన్ అమ్మకానికి సంబంధించిన తేదీ ఇంకా వెల్లడించలేదు. ఫోన్ రంగు, డిజైన్, స్పెసిఫికేషన్‌లు వివరించారు. ఈ నెలాఖరులో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేల్‌లో ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు వివరాలు తెలియనున్నాయి.

కెమెరా

Vivo కొత్త స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్ద హైలైట్ పవర్ ఫుల్ కెమెరా సిస్టమ్. ఈ కొత్త ఫోన్ 50MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ కానుంది. ఈ సెల్ఫీ కెమెరాలో ఆటో ఫోకస్ వీడియో ఫీచర్‌ను కంపెనీ చేర్చింది. అదే సమయంలో, వెనుక ప్యానెల్‌లో 64MP + 8MP + 2MP ట్రిపుల్ కెమెరా ఫోన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.

Vivo V25

ఈ 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.44-అంగుళాల AMOLED డిస్‌ప్లే అమర్చారు. పూర్తి HD + రిజల్యూషన్‌తో పాటు 90Hz రిఫ్రెష్ రేట్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌తో ఉన్న ఈ ఫోన్ 6nm MediaTek Dimensity 900 ప్రాసెసర్‌తో 8GB RAM, 128GB బేస్ ఇంటర్నల్ స్టోరేజ్ పొందవచ్చు. అయితే స్టోరేజీని పెంచుకునే ఆప్షన్ మాత్రం ఈ ఫోన్‌లో ఇవ్వలేదు.

44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో బ్యాటరీ

ఈ న్యూ మెుబైల్స్‌లో కంపెనీ 4,500mAh బ్యాటరీని అందించనుంది. దీనితో పాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS అవుట్-ఆఫ్-ది-బాక్స్. అండర్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని ధర ఇంకా వెల్లడి కాలేదు.

తదుపరి వ్యాసం