తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మన భాగ్యనగరం హైదరాబాద్ బిర్యానీకే కాదు.. ఈ బిర్యానీలకు కూడా ఫేమస్!

మన భాగ్యనగరం హైదరాబాద్ బిర్యానీకే కాదు.. ఈ బిర్యానీలకు కూడా ఫేమస్!

20 December 2021, 23:20 IST

    • హైదరాబాదీలకు బిర్యానీ అంటే అంతా ఇష్టం మరీ. పారడైస్,బావార్చీ ఇలా గల్లీకి,గల్లీకి బిర్యానీ సెంటర్స్ వెలిశాయి. అయితే బిర్యానీని ఇష్టపడే వారికి హైదరాబాద్‌ బిర్యానీనే కాకుండా చాలా రెసిపీలు అందుబాటులో ఉన్నాయి. వాటీ టెస్టీ కూడా భాగ్యనగరీ బిర్యానీ కంటే తక్కవేమి కాదు
మండీ బిర్యానీ
మండీ బిర్యానీ

మండీ బిర్యానీ

బిర్యానీ ఆహార ప్రియులు అమితంగా ఇష్టపడే స్పైసీ ఫుడ్. ఇక హైదరాబాద్ బిర్యానీ అంటే నచ్చనివారు ఎవరూ ఉండరు. కనీసం వారంలో ఒక్కసారైనా బిర్యానీ రుచి చూడాల్సిందే. హైదరాబాదీలకు బిర్యానీ అంటే అంతా ఇష్టం మరీ. పారడైస్,బావార్చీ ఇలా గల్లీకి,గల్లీకి బిర్యానీ సెంటర్స్ వెలిశాయి. అయితే బిర్యానీని ఇష్టపడే వారికి హైదరాబాద్‌ బిర్యానీనే కాకుండా చాలా రెసిపీలు అందుబాటులో ఉన్నాయి. వాటీ టెస్టీ కూడా భాగ్యనగరీ బిర్యానీ కంటే తక్కవేమి కాదు. మీరు వాటి టెస్టీని చూడాలనుకుంటున్నారా.. అవి ఎక్కడ దొరుకుతాయే తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే పదండి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

మండీ బిర్యానీ

మండీ బిర్యానీ చూడగానే నోరూరుతుంది. అరబిక్‌ భాషలో మండీ అంటే బిర్యానీ అని అర్ధం. అరబ్‌ వంటకమైన మండీ బిర్యానీని తినడానికి నగర వాసులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. యువత అయితే తెగ తినేస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్,మెహదీపట్నం,మలక్‌పేట్,షెక్‌పేట్‌లోని రెస్టారెంట్‌లో పెద్ద ఎత్తున మండీ బిర్యానీ గిరాకీ ఉంది. వీటి ధరలు సాధారణ బిర్యానీలకు కాస్త అటూ ఇటు గానే ఉన్నాయి. ఒక్క పెద్ద ప్లేట్‌లో నలుగురు వ్యక్తులు కూర్చొని సంపూర్ణంగా తినవచ్చు.

ప్రైడ్ పీస్ బిర్యానీ

ప్రైడ్ చేసిన చికెన్‌‌తో బిర్యానీని అస్వాదించే వంటకం ప్రైడ్ పీస్ బిర్యానీ. చాటా రుచిగా,మంచి వాసనతో ఆహార ప్రియులను ఈ వంటకం ఆకట్టుకుంటుంది. సాధరణంగా బిర్యానీలో ఒకటి,రెండు పీస్‌లు మాత్రమే వస్తాయి. కానీ ప్రైడ్ పీస్ బిర్యానీలో ఎక్కువ చికెన్ ముక్కలను తినవచ్చు.

జాయింట్ లెగ్ పీస్ బిర్యానీ

బిర్యానీలో కాస్త డిఫరెంట్ రుచిని అస్వాదించాలనుకునేవారికి జాయింట్ లెగ్ పీస్ బిర్యానీ బాగా నచ్చుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ బిర్యానీని ఇష్టపడుతున్నారు. మసాలలతో చేసిన ఈ బిర్యానీతో ఫ్రై చేసిన పెద్ద జాయింట్ లెగ్ పీస్‌ను వడ్డిస్తారు. ఒక బంబో ప్యాక్‌ను ఆర్డర్ చేస్తే ఐదుగురి వరకు తీనవచ్చు. మూసాపేట్,బాలనగర్,కూకట్‌పల్లిలో ఈ బిర్యానికి మంచి డిమాండ్ ఉంది.

తలస్సేరి బిర్యానీ

తీపి మరియు కారంగా ఉండే ఈ బిర్యానీ మలబార్ ప్రాంతం అంటే ప్రత్యేకంగా కేరళకు చెందినది. ఈ బిర్యానీ అక్కడి ఆహార సంస్కృతులకు తగ్గట్టుగా వైవిధ్యంగా ఉంటుంది. తలస్సేరి బిర్యానీలో బాస్మతి బియ్యానికి బదులుగా - ఖైమా లేదా జీరకసలా అనే స్వదేశీ రకం బియ్యాన్ని ఉపయోగిస్తారు.  ఈ బిర్యానీలో ఉపయోగించే ఇతర పదార్థాలు మలబార్ మసాలాలు, చికెన్, వేయించిన ఉల్లిపాయలు, సోపు గింజలు, వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్షను ఉపయోగిస్తారు. ఈ బిర్యానీ హైదరాబాద్‌లోని  కొన్ని హోటల్స్,రెస్ట్రారెంట్‌టో మాత్రమే లభిస్తోంది.

తదుపరి వ్యాసం