తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Thoughts : సక్సెస్ అంటే.. మీ సంతకం ఆటోగ్రాఫ్ గా మారడమే

Tuesday Thoughts : సక్సెస్ అంటే.. మీ సంతకం ఆటోగ్రాఫ్ గా మారడమే

HT Telugu Desk HT Telugu

07 March 2023, 4:30 IST

    • Tuesday Motivation : సక్సెస్ అంటే ఒక్కొక్కరు ఓ అర్థం చెబుతారు నిజమైన సక్సెస్ అంటే.. జస్ట్ ఇది మీ సంతకం కదా అన్నవాళ్లే.. మీ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అనేలా చేయడం.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అందరూ మనొళ్లే.. అనుకోవడంలో తప్పులేదు. కానీ అందరూ మిమ్మల్ని మన అనుకోవాలిగా కదా. కొందరు మనతో అన్ని ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు అనుకున్నప్పుడు మన దగ్గరికి వస్తారు. మరికొంతమంది మన సక్సెస్ అయిన తర్వాతే.. మావాడే అని చెప్పుకుంటారు. అప్పటివరకు మీరు అడుక్కుని తింటున్నా పట్టించుకోరు. కానీ కొందరు మాత్రం మనకు ఏంలేనప్పుడు.. ఏమి సాధించనప్పుడు.. మనతోనే ఉంటూ.. మన కష్టాలు పంచుకుంటూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే.. ఎవరి ఏది అనుకున్నా.. నీ గమ్యం వైపు నువ్ వెళ్లాలి. సక్సెస్ అయ్యేవరకూ ప్రయత్నించాలి. సక్సెస్ అంటే నీ సంతకం.. ఆటోగ్రాఫ్ గా మారడమే.

ట్రెండింగ్ వార్తలు

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

Parenting Tips : ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిది కాదు.. గుర్తుంచుకోండి

అందుకే ప్రతి అడుగు చూసి వేయాలి. ఎక్కడ పడితే అక్కడ అడుగు పడితే.. మీరే జీవితాంతం బాధపడతారు. మీ సక్సెస్ ఎలా ఉండాలంటే.. మిమ్మల్ని చూసి నవ్విన వాళ్లే.. మిమ్మల్ని కలిసేందుకు ప్రయత్నాలు చేసేలా ఉండాలి. నువ్వు యుద్ధం గెలిచేంతవరకు ఏ శబ్ధం చేయకు.. ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్ధమై వినిపిస్తోంది. శ్రమ నీ ఆయుధం అయితే.. విజయం నీ బానిస అవుతుంది.

అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా.. నేల మీదనే ఉండాలి. ప్రతి ఒక్కరూ గొప్పవారు అవ్వాలి అనుకుంటాం. దానికోసం కృషి చేస్తూ ఉంటాం. అయితే ఒక్కసారి సక్సెస్ అయ్యాక.. ఈ ప్రయాణంలో మనకి తోడున్న వారిని మరచిపోతూ ఉంటాము. ఒక్కోసారి వర్క్ బిజీలో ఉంటాం. అలా ఉండి.. కొంచెం గ్యాప్ తీసుకుంటే పర్లేదు. కానీ గర్వం తలకెక్కి.. అయినవారికి అందుబాటులో లేనంత బిజీగా మారిపోకూడదు.

జీవితంలో ఏం సాధించినా.. ఎక్కడ నుంచి వచ్చామో.. మరిచిపోవద్దు.. మనతో ఉన్న వారు ఎవరూ అన్నది కూడా మరిచిపోవద్దు. మన అనుకునే వాళ్లను దూరం పెడితే.. మిమ్మల్ని మీరు మరిచిపోయినట్టే. గెలవడం ముఖ్యం., మన అనుకున్నవాళ్లతో ఉండటం కూడా అంతే ముఖ్యం.

అడ్డంకులకు కుంగిపోతే అపజయం, వాటిని అనుభవాలుగా మలచుకోగలిగితే విజయం..

టాపిక్

తదుపరి వ్యాసం