తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Republic Day Recipe : కివీ ఆరెంజ్ లస్సీ.. ట్రై కలర్ రెసిపీ ఈజీగా చేసేయెుచ్చు

Republic Day Recipe : కివీ ఆరెంజ్ లస్సీ.. ట్రై కలర్ రెసిపీ ఈజీగా చేసేయెుచ్చు

Anand Sai HT Telugu

26 January 2024, 8:30 IST

    • Kiwi Orange Lassi : గణతంత్ర దినోత్సవం రోజున మూడు రంగులు వచ్చేలా కివి ఆరెంజ్ లస్సీ తయారు చేయండి. ఇది చేయడం కూడా చాలా ఈజీ.
కివీ ఆరెంజ్ లస్సీ
కివీ ఆరెంజ్ లస్సీ

కివీ ఆరెంజ్ లస్సీ

భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా చేసుకుంటారు. ఈ సందర్భంగా చాలా మంది తమ దేశభక్తిని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు రెసిపీల రూపంలో ట్రై కలర్ వచ్చేలా వంటకాలు చేస్తారు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ ఇంట్లో మీ కుటుంబం, అతిథుల కోసం చేసేందుకు ట్రై కలర్ రెసిపీ ఉంది. అదేంటంటే.. కివీ ఆరెంజ్ లస్సీ. కొన్ని నిమిషాల్లోనే దీనిని చేసేయెుచ్చు. ప్లాట్ ఫామ్ 65 చెఫ్ వీహెచ్ సురేశ్ ఈ రెసిపీ తయారీ విధానం గురించి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

కావలసిన పదార్థాలు:

A.పెరుగు: 300ml

B. చక్కెర పొడి: 80గ్రా

C. ఆరెంజ్ క్రష్ : 15ml

D. కివీ క్రష్ : 15ml

తయారు చేసే విధానం

1. పెరుగును మూడు సమాన భాగాలుగా తీసి పక్కన పెట్టుకోండి. అంటే 100ml లాగా మూడు భాగాలు చేసుకోవాలి.

2. పెరుగు ఒక 100ml తీసుకోండి. ఇప్పుడు పెరుగులో చక్కెర పొడిని బాగా రుచికి సరిపడా కలుపుకోవాలి.

3. ఇప్పుడు ఆరెంజ్ క్రష్ (15ml) ఇందులో కలుపుకోవాలి. తర్వాత మిశ్రమాన్ని కలపండి.

4. పెరుగులో ఒక 100ml తీసుకోండి. ఇప్పుడు పెరుగులో చక్కెర పొడిని బాగా కలుపుకోవాలి

5. ఇప్పుడు కివి క్రష్ (15ml) ఇందులో కలుపుకోవాలి. తర్వాత మిశ్రమాన్ని కలపండి.

6. పెరుగు ఒక 100ml తీసుకోండి. ఇప్పుడు పెరుగులో చక్కెర పొడిని రుచికి సరిపడా కలుపుకోవాలి. తర్వాత మిశ్రమాన్ని కలపండి.

7. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ముందుగా రెడీ చేసుకున్నా మూడు లస్సీలను లేయర్ గా పోయాలి.

10. ముందుగా కివీ లస్సీని బేస్ గా వేసుకోవాలి.

11. తర్వాత కివీ లస్సీ పైన రెగ్యులర్ లస్సీని వేసుకోవాలి.

12. చివరగా, పైనా ఆరెంజ్ లస్సీని పోయాలి.

13. ఇప్పుడు గ్లాస్ లో కివీ ఆరెంజ్ లస్సీ రెడీ ఉంది. మూడు రంగులు కనిపిస్తాయి. మంచి రుచిగా ఉంటుంది.

తదుపరి వ్యాసం