తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Washing Machine| ఫ్రంట్ లోడ్ - టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లలో ఏది ఉత్తమమైన ఎంపిక?

Washing Machine| ఫ్రంట్ లోడ్ - టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లలో ఏది ఉత్తమమైన ఎంపిక?

Manda Vikas HT Telugu

28 December 2021, 17:45 IST

    • వాషింగ్ మెషీన్ కొనాల్సి వచ్చినపుడు టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌ని కొనుక్కోవాలా? ఫ్రంట్ లోడ్ మంచిదా? రెంటిలో ఏది బెటర్ అనేది చాలా కష్టమైన నిర్ణయాలలో ఒకటి.
Washing Machine
Washing Machine (Stock Photo)

Washing Machine

మార్కెట్లో ఇప్పుడు ఎన్నోరకాల బ్రాండ్ల వాషింగ్ మిషీన్ లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏది బాగా పనిచేస్తుంది, ఏది తక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటుంది, ఏది ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌ని కొనుక్కోవాలా? ఫ్రంట్ లోడ్ కొనుక్కుంటే బెటరా? ఈ రెంటిలో ఏది ఎంచుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి, ఈ రెండింటికీ మధ్య తేడాలేంటి? ఏది ఉత్తమమైనది? అనేది ఒకసారి చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Monday Motivation: ఎవరి గొప్ప వారిదే, జీవితంలో ఎదురయ్యే ఎవరినీ చులకనగా చూడకండి

Acid Reflux At Night : రాత్రి గుండెల్లో మంట రావడానికి కారణాలు.. ఈ అసౌకర్యాన్ని ఎలా తొలగించాలి?

Relationship Tips : పెళ్లికి ముందే ఈ 5 విషయాలు చర్చించండి.. లేదంటే తర్వాత సమస్యలు

Cashew Tomato Gravy : టొమాటో జీడిపప్పు గ్రేవీ తయారు చేయండి.. ఎంజాయ్ చేస్తూ తింటారు

ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్:

ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్, టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ మధ్య ఉన్న అతి పెద్ద వ్యత్యాసం ఏమిటంటే మెషీన్ డోర్. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌లకు ముందు ప్యానెల్‌పై డోర్ ఉంటుంది, ఇది పక్కకి తెరుచుకుంటుంది, అదే టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌లలో బట్టలు ఎగువ నుండి లోడ్ అవుతాయి. టాప్ లోడ్ మిషీన్లలో బట్టలు వేయడానికి, లేదా తీయడానికి మీరు నడుమొంచుతూ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇవికాకుండా ఫ్రంట్, టాప్ లోడర్‌ల మధ్య గమనించదగ్గ ఇతర తేడాలు కూడా ఉన్నాయి.

డిజైన్: 

ఫ్రంట్ లోడ్ మెషీన్‌లలో దుస్తులను అటూఇటూ తిప్పే 'అజిటేటర్' ఉండదు, కాబట్టి ఫ్రంట్ లోడ్ మెషీన్‌లలో దుస్తులు చిరిగిపోవడం గానీ, చిక్కుపడే అవకాశం ఉండదు. ఈ రకం మెషీన్‌లలో దుస్తులకు నీరు, డిటర్జెంట్‌ను కలపడానికి టబ్ భ్రమణం గురుత్వాకర్షణకు లోబడి ఉంటుంది. ఈ రకమైన చర్య వస్త్రాలపై మరింత సమర్థవంతమైన, సున్నితమైన ఉతుకుని అందిస్తుంది.

సామర్థ్యం & స్పేస్: 

టాప్ లోడ్ మెషీన్లలోని డ్రమ్‌లలో మధ్య భాగాన ఒక అజిటేటర్ లేదా ఇంపెల్లర్ (చిన్నపాటి కోన్ ఆకారం) ఉంటుంది. ఇది అదనపు స్థలాన్ని ఆక్రమిస్తుంది, ఇది యూనిట్ల వారీగా ఉతికే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అయితే ఫ్రంట్ లోడర్‌లలో ఇలాంటి సమస్య ఉండదు. టాప్ లోడర్లతో పోలిస్తే ఫ్రంట్ లోడర్లలో ఒకేసారి ఎక్కువ దుస్తులను ఉతికే సామర్థ్యం కలిగి ఉంటాయి.

విద్యుత్, నీటి అవసరం: 

ఫ్రంట్ లోడర్లు ఎక్కువ దుస్తులను ఉతికే సామర్థ్యం కలిగి ఉంటాయి కాబట్టి కచ్చితంగా విద్యుత్ లేదా నీటి వినియోగం ఎక్కువ జరుగుతుంది. అయితే కొన్ని ఖరీదైన బ్రాండ్లు విద్యుత్.  నీటి వినియోగాన్ని తగ్గించడానికి అదనపు సెట్టింగ్స్ ను అందిస్తున్నాయి.

ధర: 

టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌ల కంటే ఫ్రంట్ లోడ్ మెషీన్‌లు ఖరీదైనవి.టాప్ లోడ్ వాషర్‌లతో పోలిస్తే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌లు అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. ఫ్రంట్ లోడర్‌లలో డ్రమ్, దొర్లే చర్య, థర్మల్ యాక్షన్ (నీటి ఉష్ణోగ్రత) డిటర్జెంట్‌ల వాడకం, బట్టలు శుభ్రపరచడంలో, బట్టల నుండి మురికిని తీసివేయడంలో బట్టలు చిరగకుండా సున్నితంగా, మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. 

పైనుంచి లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇంట్లో ఏ మూలలోనైనా దీనిని అమర్చవచ్చు. అయితే ఫ్రంట్ లోడర్లలో లేనిది టాప్ లోడర్లలో ఉండేటువంటి ఒక కీలకాంశం ఏమిటంటే, టాప్ లోడర్లలో వాషింగ్ ప్రక్రియ జరుగుతున్నపుడు మధ్యలో ఎప్పుడైనా బట్టలను వేయవచ్చు, కానీ ఫ్రంట్ లోడర్లలో మధ్యలో వాషింగ్ ఆపి బట్టలు వేసే వీలుండదు.

అలాగే టాప్ లోడర్స్ అందుబాటు ధరల్లో దొరుకుతాయి. అవసరాలకు బట్టి ఎంత కెపాసిటీ ఉన్నది కొనుక్కోవాలో తెలుసుకోవడం కూడా ముఖ్యమే కదా.

ఈ అంశాలను బట్టి మీకు టాప్ లోడర్ కావాలో, ఫ్రంట్ లోడర్ కావాలో మీరే డిసైడ్ చేసుకోండి.

 

తదుపరి వ్యాసం