తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Recipe Of The Day : తక్షణమే శక్తినిచ్చే ప్రోటీన్ బాల్స్.. ట్రై ఎట్ హోమ్..

Recipe of the Day : తక్షణమే శక్తినిచ్చే ప్రోటీన్ బాల్స్.. ట్రై ఎట్ హోమ్..

09 July 2022, 7:48 IST

    • ఉదయాన్నే హెల్తీ ఫుడ్ తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎనర్జీకోసం రకరకాల ఫుడ్ ట్రై చేస్తూ ఉంటారు. మీరు కూడా అలా వెతుకుతుంటే.. ఈ ప్రోటీన్ బాల్స్ మీకోసమే. జిమ్ నుంచి వచ్చిన వెంటనే ఈ ప్రోటీన్ బాల్స్ తీసుకుంటే మీకు ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. అంతేకాకుండా పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు.
ప్రోటీన్ బాల్స్
ప్రోటీన్ బాల్స్

ప్రోటీన్ బాల్స్

Recipe of the Day : వీకెండ్ వచ్చేసింది. ఈ సమయంలో ఏదైనా కొత్తగా తినాలని.. ట్రై చేయాలనుకునే వారికి ప్రోటీన్ బాల్స్ మంచి ఎంపిక. వారాంతాల్లో లేట్​గా నిద్రలేచి.. ఇప్పుడేం వండుకుంటాంలే అనుకునేవారికైనా.. జిమ్​లో చెమటలు చిందించి వచ్చిన వారైనా.. లేకుంటే టిఫెన్స్ తినమని మారం చేసే చిన్నారులకైనా ఈ ప్రోటీన్ బాల్స్ మంచి ఎంపిక. వీటిని చాలా సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. పైగా వీటి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. తక్షణమే ఎనర్జీ కావాలనుకునే వారు వీటిని తీసుకోవచ్చు. మరి ఈ ప్రోటీన్ బాల్స్​ను ఎలా తయారు చేయాలి? వాటికి కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

Parenting Tips : ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిది కాదు.. గుర్తుంచుకోండి

సాల్ట్ సత్యాగ్రహ.. రక్తపోటు నివారణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన మైక్రో ల్యాబ్స్

ప్రోటీన్ బాల్స్ తయారికి కావాల్సిన పదార్థాలు

* బాదం - 290 గ్రాములు

* ఆప్రికాట్లు - 290 గ్రాములు (ఎండినవి)

* జీడిపప్పు - 290 గ్రాములు

* కొబ్బరి నూనె - 50 గ్రాములు

* ఖర్జూరాలు - 200 గ్రాములు (సీడ్ లెస్)

* తేనె - 100 గ్రాములు

* ఆరెంజ్ తొక్క తురుము - 1 స్పూన్

* వెనిలా బీన్స్ - 1

* కొబ్బరి తురము - 200 గ్రాములు

ప్రోటీన్ బాల్స్ తయారీ విధానం

బాదంపప్పులను, జీడిపప్పను, ఖర్జూరం, ఆప్రికాట్లను చాలా చిన్నగా తురుముకోవాలి. తేనె, కొబ్బరి నూనె, వెనిలా బీన్స్, నారింజ తురుముతో.. పిండి స్థిరత్వం వచ్చే వరకు పప్పుల మిశ్రమాన్ని జోడించండి. ఇది మొత్తం పిండిలాగా మారిన తర్వాత.. కొంచెం పిండిని తీసుకుని చిన్న బాల్‌గా రోల్ చేయండి. ఆపై బంతిని కొబ్బరి తురుము మీద రోల్ చేసి పక్కన పెట్టండి. ఇలా పిండి మొత్తం అయిపోయే వరకు రిపీట్ చేయండి. ఈ ఎనర్జీ బాల్స్‌ని గాలి చొరబడని కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇవి వారం వరకు నిల్వచేయవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం