తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pregnancy Discomforts: ప్రసవానికి ముందు ఆందోళన వద్దు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

pregnancy discomforts: ప్రసవానికి ముందు ఆందోళన వద్దు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

03 May 2023, 21:56 IST

  • pregnancy discomforts: గర్భంతో ఉన్న మహిళలు చివరి మూడు నెలల్లో కొన్ని అసౌకర్యాలకు గురవుతారు. వాటిని తగ్గించుకోడానికి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. 

     

ప్రెగ్నెన్సీలో అసౌకర్యాలు
ప్రెగ్నెన్సీలో అసౌకర్యాలు (Photo by Mauricio Gutiérrez on Unsplash)

ప్రెగ్నెన్సీలో అసౌకర్యాలు

ప్రెగ్నెన్సీ అని నిర్ధారణ అయిన రోజునుంచి డెలివరీ అయ్యేదాకా చాలా రకాల భావోద్వేగాలతో గడుస్తుంది మహిళ జీవితం. కొత్త జీవితం కోసం పరితపిస్తూ ఉంటారు. కొంతమందికి శారీరకంగా కొన్ని అసౌకర్యాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా చివరి మూడు నెలల్లో పడుకోవడంలో ఇబ్బంది, వెన్ను నొప్పి లాంటి సమస్యలుంటాయి. కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే ఆ రోజులన్నీ ఆనందంగా గడిపేయొచ్చు. అంతేకానీ ఆనందించాల్సిన సమయంలో ఆందోళనతో ఉండొద్దు.

ట్రెండింగ్ వార్తలు

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

చాతీలో మంట:

ఇది మొదటి మూడు నెలల్లో, చివరి మూడు నెలల్లో కొంతమందికి ఎదురయ్యే సమస్య. దాన్ని తగ్గించుకోడానికి కారం తక్కువ తినాలి, ఎక్కువగా కొవ్వులు, పులుపు ఉన్న ఆహారం తీసుకోవడం మానేయాలి. అలాగే తిన్న వెంటనే కాసేపు నిటారుగా కూర్చోవాలి. అలాగే సాయంత్రం పూట వీలైనంత తొందరగా తినడం, తిన్న తరువాత కాస్త అటూ ఇటూ నడవటం వల్ల ఈ సమస్య రాదు.

తరచూ ముత్రానికి వెళ్లడం:

ఇది సర్వ సాధారణమైన లక్షణం. మొదటి రెండు మూడు నెలల్లో, తొమ్మిదో నెలలో ఈ సమస్య ఇంకాస్త ఎక్కువనిపిస్తుంటుంది. కానీ మరీ ఎక్కువ ఇబ్బందిగా అనిపిస్తే మూత్రం ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో ఒకసారి డాక్టర్ ని కలిస్తే మంచిది. కొన్ని సార్లు అది కూడా తరచూ ముత్రం రావడానికి కారణం కావచ్చు

వెన్ను నొప్పి:

కూర్చునేటపుడు నిటారుగా ఉండేలా వెన్నుకు మద్దతుగా ఉండే కుర్చీలు ఎంచుకోవాలి. అలాగే మంచి పట్టు ఇచ్చే చెప్పులు వేసుకోవాలి. దాని వల్ల శరీరం బరువు ఒకచోట పడదు. వెన్నెముకపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. అలాగే డాక్టర్లు సూచించిన వ్యాయామం చేస్తుండటం ద్వారా శరీరానికి సాగే గుణం వస్తుంది. దీనివల్ల ఈ నొప్పి రాకుండా ఉంటుంది.

ఆందోళన :

డెలివరీ తేదా దగ్గరికి రాగానే ఆందోళన మొదలవుతుంటుంది. అలాంటపుడు డాక్టర్ తో, ఈ అనుభవం ఉన్న వాళ్లతో మాట్లాడండి. మీకున్న సందేహాలు తీర్చుకోండి. క్రమం తప్పకుండా చెకప్ లు, అల్ట్రాసౌండ్ చేయించుకోవడం వల్ల ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ ని ఆస్వాదించొచ్చు.

ఇంకొన్ని జాగ్రత్తలు:

హైడ్రేషన్:

మూత్రం తరచూ వస్తోందని చాలా మంది నీళ్లు తాగడం తగ్గించేస్తారు. అది సరైంది కాదు. అందుకే తప్పకుండా రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలని గుర్తుంచుకోండి.

చురుగ్గా ఉండడం:

తిన్న వెంటనే, సాయంత్రం పూట కొంచెం దూరం నడవండి. వీలైతే మెట్లు ఎక్కడం దిగడం చేయండి. ఇది మీకు ఆరోగ్యకరం.

ఆహారం:

చాతీలో మంట ఎక్కువగా ఉన్నపుడు ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తినండి. కారం తగ్గించండి. ఉడికించని ఆహారం.. అంటే పండ్లూ, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.

బిడ్డ కదలికలు:

రోజుకు కనీసం పదిసార్లయినా కడుపులో బిడ్డ కదలికలుండాలి. మీకేమైనా సందేహాలుంటే వైద్యుల్ని వెంటనే సంప్రదించండి.

చివరగా ఒక్క విషయం.. మీరు ప్రశాంతంగా ఉండండి. మీ ప్రెగ్నెన్సీ రోజుల్ని ఆస్వాదించండి. ప్రసవం చేయడం కొత్తకాదు.. ఇది నిరంతరంగా జరుగుతున్నదే. ప్రతి దానికీ ఆధునిక వైద్యంలో మందులున్నాయి. ఈ విషయం గుర్తుంచుకుని నిశ్చింతగా ఉండండి. మీ కడుపులో ఉన్న బిడ్డతో ఈ సమయాన్ని ఆనందంగా గడపండి.

టాపిక్

తదుపరి వ్యాసం