తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Car Resale Value | ఇండియాలో బెస్ట్‌ రీసేల్‌ వాల్యూ ఉన్న కార్లు ఇవే!

Car Resale Value | ఇండియాలో బెస్ట్‌ రీసేల్‌ వాల్యూ ఉన్న కార్లు ఇవే!

Hari Prasad S HT Telugu

13 February 2022, 6:03 IST

    • Car Resale Value.. ఎలక్ట్రానిక్స్‌ అయినా, ఆటోమొబైల్స్‌ అయినా ప్రతి రోజూ అప్‌డేట్‌ అవుతూనే ఉంటాయి. రోజుకో కొత్త మోడల్‌ మార్కెట్‌లోకి వస్తుంది. ఈ రోజు కొన్న కారు కొన్నాళ్లకే పాతబడినట్లు అనిపిస్తుంది. దీంతో ఉన్న కారు అమ్మి కొత్త కారు కొనేవాళ్ల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది.
ఇండియాలో బెస్ట్ రీసేల్ వాల్యూ కార్లలో ఒకటి మారుతి సుజుకి ఆల్టో 800
ఇండియాలో బెస్ట్ రీసేల్ వాల్యూ కార్లలో ఒకటి మారుతి సుజుకి ఆల్టో 800 (www.marutisuzuki.com)

ఇండియాలో బెస్ట్ రీసేల్ వాల్యూ కార్లలో ఒకటి మారుతి సుజుకి ఆల్టో 800

కారు ఒక లయబిలిటీ అన్న సంగతి తెలుసు కదా. దాని విలువ తగ్గిపోతూ ఉంటుంది. కొత్త కారు షోరూమ్‌ నుంచి బయటకు రాగానే దాని విలువ సుమారు 20 శాతం వరకూ పడిపోతుందన్న విషయం మీకు తెలుసా? ఈ నేపథ్యంలో మంచి రీసేల్‌ వచ్చే కార్ల వైపు చాలా మంది చూస్తున్నారు. అలాంటి వాళ్లు ఇప్పుడు చెప్పబోయే కార్లను కొనొచ్చు. మిగతా కార్లతో పోలిస్తే.. ఈ కార్ల విలువ కాస్త మెల్లగా తగ్గుతుంది.

Alto 800

దేశంలోని మధ్యతరగతి ఫేవరెట్‌, ఎవర్‌గ్రీన్‌ కారు మారుతి ఆల్టో 800. తక్కువ ధర, మంచి మైలేజ్‌ (సీఎన్జీ అయితే కేజీకి 31.59 కి.మీ.) ఈ కారు సొంతం. మెయింటెనెన్స్‌ కూడా తక్కువే. మిడిల్‌ క్లాస్‌ వాళ్లు తొలిసారి కారు కొనాలంటే ముందుగా చూసేది ఈ కారువైపే. ఈ ఆల్టో 800 కారును మూడు, నాలుగేళ్లు వాడిన తర్వాత కూడా దాని విలువలో 80 శాతానికి అమ్ముకోవచ్చంటే నమ్మగలరా? బెస్ట్‌ రీసేల్‌ వాల్యూ కార్లలో అందుకే ఆల్టో అన్నింటి కంటే ముందు ఉంది.

Wagon R

341 లీటర్ల భారీ బూట్‌స్పేస్‌, 20 కి.మీ. వరకూ మైలేజ్‌తో ఇండియన్‌ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఈ వేగర్‌ ఆర్‌ కూడా ఒకటి. రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల్లోపు ధరలో మంచి హాచ్‌బ్యాక్‌ కారు ఈ వేగన్‌ ఆర్‌. దీనికి కూడా మంచి రీసేల్ వాల్యూ ఉంది. కొత్త కారు కొన్న తొలి మూడేళ్లలో కేవలం 20 శాతం మాత్రమే తరుగుదల ఉంటుంది. అంటే 80 శాతం విలువకు కారును అమ్ముకోవచ్చు.

Swift

స్టైలిష్‌ లుక్‌తోపాటు మైలేజ్‌ పరంగా, బూట్‌ స్పేస్‌ పరంగా మారుతి సుజుకి స్విఫ్ట్‌కు కూడా మంచి రీసేల్‌ వాల్యూ ఉంది. ఈ కారు కొన్న రెండేళ్లలో 80 శాతం విలువకు తిరిగి అమ్ముకోవచ్చు.

Dzire

మారుతి సుజుకి డిజైర్‌ చీప్‌ అండ్‌ బెస్ట్‌ సెడాన్ మోడల్‌. 378 లీటర్ల బూట్‌ స్పేస్‌తోపాటు లీటర్‌కు 23 కి.మీ. వరకూ మైలేజ్‌ డిజైర్‌ సొంతం. దీంతో ఏడాది వాడిన తర్వాత కూడా ఈ కారు విలువలో 85 శాతానికి అమ్ముకునే వీలుంది.

Honda City

సెడాన్‌ సెగ్మెంట్‌లో మంచి రీసేల్‌ వాల్యూ ఉన్న కారు హోండా సిటీ. 506 లీటర్ల బూట్‌స్పేస్‌ ఈ కారు ప్రధాన ఆకర్షణ. పైగా ఆకట్టుకునే డిజైన్‌ దీని సొంతం. ఈ కారును తొలి మూడేళ్లు వాడిన తర్వాత కూడా 75 శాతం విలువతో తిరిగి అమ్మవచ్చు.

Vitara Brezza

ఎస్‌యూవీల్లో ఇండియాలో బెస్ట్‌ సెల్లింగ్‌ కారు ఈ విటారా బ్రెజా. స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ అయినా కూడా 17 కి.మీ. మైలేజ్‌తో.. ఎస్‌యూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ కారు మూడేళ్ల తర్వాత కూడా తన విలువలో 90 శాతం కలిగి ఉంటుందంటే దీనికున్న డిమాండ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Ford Ecosport

స్టైలిష్‌ లుక్‌తోపాటు ఆరు ఎయిర్‌బ్యాగులతో మంచి సేఫ్టీ ఫీచర్స్‌ కలిగిన కారు ఈ ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్. మారుతి కాకుండా మంచి రీసేల్‌ వాల్యూ ఉన్న ఎస్‌యూవీల్లో ఈ ఎకోస్పోర్టే టాప్‌లో ఉంటుంది. మూడేళ్ల తర్వాత కూడా 80 శాతం విలువకు కారు అమ్ముడుపోతోంది.

Toyota Innova Crysta

ఎంయూవీల్లో అత్యధిక రీసేల్‌ వాల్యూ ఈ ఇన్నోవా క్రిస్టా సొంతం. మెయింటెనెన్స్‌ కూడా తక్కువే. ఈ కారు కొన్న మూడేళ్ల తర్వాత కూడా 90 శాతం విలువతో ఈ కారును రీసేల్‌ చేసే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం