తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Superfood Combos: ఇవి కలిపితింటే.. పోషకాలు రెట్టింపవుతాయి..

Superfood combos: ఇవి కలిపితింటే.. పోషకాలు రెట్టింపవుతాయి..

Parmita Uniyal HT Telugu

20 July 2023, 9:00 IST

  • Superfood combos: కొన్ని ఆహార పదార్థాలు విడిగా తీసుకోవడం కన్నా, వేరే పదార్థాలతో కలిపి తీసుకుంటే లాభాలు రెట్టింపవుతాయి. అలా కలిపి తీసుకోవాల్సిన పదార్థాలేంటో తెలుసుకోండి. 

ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్ కాంబినేషన్లు
ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్ కాంబినేషన్లు (Freepik)

ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్ కాంబినేషన్లు

మంచి ఆరోగ్యానికి కావాల్సినవి పోషకాలు. ఉత్తమ ఆరోగ్యానికి దీనికన్నా మంచి మార్గం లేదు. కానీ రోజు పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలంటే కుదరకపోవచ్చు. ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాల్సిన సమయంలో కుకీస్ సాండ్విచ్లు తింటున్నాం.వీటి నుంచి మనకి పోషకాలు ఎలా అందుతాయి. అందుకే మళ్లీ మల్టీ విటమిన్ టాబ్లెట్ లు వాడాల్సి వస్తోంది. భోజనం సమయానికి చేయడం ముఖ్యమే కానీ ఏం తింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. దాంట్లో మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. తీసుకునే ఆహారం నుంచి మన శరీరం పోషకాలు శోషించుకునేలా ఉండాలి మనం తినే ఆహారం. అలా జరగాలంటే కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. కొన్ని ఆహారాన్ని కలిపి తీసుకుంటే ఇంకా మేలు జరుగుతుంది

ట్రెండింగ్ వార్తలు

ICMR On Weight Loss : వారంలో ఎంత బరువు తగ్గితే ఆరోగ్యానికి మంచిది.. తగ్గేందుకు టిప్స్

Mandaram Health Benefits : జుట్టుకే కాదు ఆరోగ్యానికి కూడా మందారం పువ్వుతో అనేక లాభాలు

Honey and Aloe Vera Gel : ముఖం, మెడపై ఒక వారంపాటు తేనె, కలబంద జెల్ రాస్తే మెరిసిపోతారు

Worst Egg Combination : గుడ్లతో కలిపి తినకూడని ఆహారాలు.. సైడ్‌కి ఆమ్లెట్ కూడా వద్దండి

ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే సూపర్ ఫుడ్ కాంబినేషన్ ఏంటో చూద్దాం:

1. గ్రీన్ టీ + నిమ్మరసం:

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అందుకే చాలామంది రోజును దీంతోనే మొదలుపెడతారు. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంతోపాటే, బరువు తగ్గించడంలో సాయపడుతుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. అయితే గ్రీన్ టీ తాగేటపుడు అందులో కొన్ని చుక్కలు నిమ్మరసం కలుపుకుంటే యాంటీ ఆక్సిడెంట్ల సామర్థ్యం పెరుగుతుంది.

గ్రీన్ టీ లో ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లవనాయిడ్లు ఉంటాయి. ఇవి యాంటీ ఆండిటెక్సెండ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిఉంటాయి. గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్య రక్షణ నిమ్మరసంతో కలిపి తీసుకున్నప్పుడు 5 నుంచి 10 రెట్లు పెరుగుతుందని తేలింది. ఉదయం లేదా సాయంత్రం పూట అయినా తప్పకుండా దీన్ని తాగడం మంచిది.

2. వాల్‌నట్స్ + బ్లూబెర్రీలు:

రోజు మొత్తం మెదడు ఏదో రకంగా పనిచేస్తూనే ఉండాలి. ఆలోచిస్తుంది, కొన్ని విషయాలు గుర్తుంచుకుంటుంది, కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటుంది.. ఇలా చాలా పనులు జరిగిపోతాయి. మరి దాని పనితీరు మెరుగుపడేలా చేయడం కోసం కొన్ని ఆహారాలు తీసుకోవడం మర్చిపోవద్దు. వాల్‌నట్స్, బ్లూ బెర్రీలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ తో పోరాడటంలో సాయపడతాయి.

వాల్‌నట్స్‌లో ఒమేటా 3 ఫ్యాటీ యాసిడ్లు, పాలీఫినాల్స్ ఉంటాయి. ఇవి ఆక్సెడేటివ్ స్ట్రెస్, వాపు లక్షణాల్ని తగ్గిస్తాయి. బ్లూ బెర్రీల వల్ల మెదడులోని ముఖ్యమైన ప్రాంతాలకు రక్త సరఫరా పెరుగుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. భోజనానికీ, మరో భోజనానికి మధ్య స్నాక్స్ లాగా వీటిని తీసుకుంటే మేలు. లేదా అల్పాహారంలో కూడా చేర్చుకోవచ్చు.

3. మిరియాలు + పసుపు:

కూరల్లో, ఇంకేవైనా వంటలు చేసేటపుడు కాస్త మిరియాల పొడి వేసుకుంటే మంచిది. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. అయితే మిరియాలతో పాటూ పసుపు కలిపి తీసుకోవడం వల్ల లాభాలు రెట్టింపవుతాయి. ఉదయం అల్పాహారంలో పోహా నుంచి రాత్రి కూరల్లో వేసుకోవచ్చు.

మిరియాల్లో పపెరిన్, పసుపులో కుర్క్యుమిన్ ఉంటాయి. మిరయాలను, పసుపును ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన శరీరం 2000% ఎక్కువగా కుర్క్యుమిన్ శోషించుకుంటుంది. ఇవి రెండూ కలిసి జీర్ణశక్తిని కూడా పెంచుతాయి.

టాపిక్

తదుపరి వ్యాసం