తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sri Rama Navami 2023 : ఈ శ్రీరామ నవమికి సీతారాములు ఉన్న కుటీరం చూసి రండి

Sri Rama Navami 2023 : ఈ శ్రీరామ నవమికి సీతారాములు ఉన్న కుటీరం చూసి రండి

HT Telugu Desk HT Telugu

28 March 2023, 16:15 IST

  • Parnashala History : భద్రాచలం రాముడిని దర్శించుకునే వాళ్లు కచ్చితంగా పర్ణశాలను దర్శించుకోవాల్సిందే. సీతారాములు నడిచిన నేల అది. అక్కడకు వెళితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

పర్ణశాల(ఫైల్ ఫొటో)
పర్ణశాల(ఫైల్ ఫొటో)

పర్ణశాల(ఫైల్ ఫొటో)

శ్రీరామ నవమి వస్తోంది. భద్రాచలం రామనామస్మరణతో మారుమోగిపోతుంది. సీతారాముల కల్యాణం చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తారు. అక్కడ నుంచి రామాయణం(Ramayanam)లో కీలక ఘట్టం జరిగిన ప్రదేశమైన పర్ణశాలకు వెళ్తారు. భద్రాచలం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో పర్ణశాల ఉంది. ప్రకృతి ఒడిలో ఉండే.. ఈ ప్రాంతానికి వెళ్తే.. మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుంది.

రామాయణంలో కీలక ఘట్టం ఇక్కడ జరిగింది. రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసానికి వచ్చి.. గోదావరి(Godavari) ఒడ్డున కుటీరం ఏర్పరచుకుంటారు. అదే పర్ణశాల. ఇక్కడ ప్రతీదానికి ఓ చరిత్ర ఉంటుంది. ఇక్కడ నుంచే రావణసురుడు సీతమ్మను అపహరించాడని చరిత్ర చెబుతోంది. సీతారాముల వనవాసం దాదాపుగా ఇక్కడే గడిపారు. సీతమ్మ గోదావరిలో స్నానం చేసి.. పర్ణశాల(Parnashala) పక్కనున్న గుట్టపై చీర ఆరేసుకునేదట. ఇప్పుడు ఆ చోటుని నార చీర గుర్తుల స్థలం అంటారు. అక్కడ చూస్తే.. ఏదో నిజంగానే ఆరేసినట్టుగానే అనిపిస్తుంది. సీతా దేవి స్నానం చేసిన నదిని.. సీత వాగు అని పిలుస్తారు.

సీతారాములు నివసించిన కుటీరమే పర్ణశాల. వనవాసం మెుత్తం ఇక్కడే గడిచిందని చరిత్ర చెబుతోంది. రాధగుట్టపై సీతమ్మ చీర ఆరేసుకునేది. ఆ పక్కనే లక్ష్మణుడు, శూర్పణఖల మధ్య సంఘర్షణ జరిగిన ఓ చిన్నగుట్టు ఉంది. చరిత్ర ప్రకారం.. రావణసురుడు తన పుష్పకవిమానంలో ఈ ప్రదేశానికి వచ్చాడు. గోదావరి ఒడ్డున తన వాహనాన్ని ఆపేసి, సన్యాసి అవతారం ధరించి పర్ణశాలకు వస్తాడు. అక్కడే సీతమ్మవారిని అపహరించాడని కథలు ఉన్నాయి. ఇక్కడే సీతమ్మ బంగారు జింకను చూసి.. తనకు కావాలని శ్రీరాముడిని అడిగిందట.

భద్రాచలం(Bhadrachalam) నుంచి షేర్ ఆటో లేదా టాక్సీల ద్వారా పర్ణశాలకు వెళ్లొచ్చు. ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి. హైదరాబాద్ కు సుమారు 310 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి.

మార్చి 30న శ్రీరామనవమి జరగనుంది. సీతారాముల కల్యాణంలో తలంబ్రాలకు ప్రత్యేకత ఉంది. అవి ఎంతో పవిత్రంగా తయారు చేస్తారు. ఆ తర్వాత భద్రాచలం చేరుకుంటాయి. జానకి దోసిట కెంపుల బ్రోవై, రాముని దోసిట నీలపు రాశై, ఆణిముత్యలే తలంబ్రాలుగా అని శ్రీరామనవమి(Sri Rama Navami) నాడు రాములోరి కళ్యాణంలో తలంబ్రాల గురించి ప్రత్యేకంగా వివరిస్తారు. రాములోరి కల్యాణం కోసం.. కోటి తలంబ్రాలను గోటితో ఒలుస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం నుంచి ఈ తలంబ్రాలు వస్తాయి.

తదుపరి వ్యాసం