తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Milk Day 2022 | మీ చర్మ సమస్యలను దూరం చేసుకోవడానికి.. పాలు పూయండి..

World Milk Day 2022 | మీ చర్మ సమస్యలను దూరం చేసుకోవడానికి.. పాలు పూయండి..

HT Telugu Desk HT Telugu

01 June 2022, 11:18 IST

    • రోజూ పాలు తాగితే ఎంత మంచిదో అందరికీ తెలుసు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆరోగ్యం కోసం ఉపయోగించే వాటిలో పాలు ముందు ఉంటాయి. అయితే మీ చర్మం మృదువుగా, మొటిమలు లేకుండా ఉండాలంటే.. పాలను ఉపయోగించవచ్చు అంటున్నారు చర్మ వ్యాధి నిపుణులు. అంతేకాక వీటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు.
ప్రపంచ పాల దినోత్సవం
ప్రపంచ పాల దినోత్సవం

ప్రపంచ పాల దినోత్సవం

World Milk Day 2022 | పాలపై దృష్టి పెట్టడానికి, పాల పరిశ్రమ కార్యకలాపాలను ప్రచారం చేయడానికి ప్రతి సంవత్సరం జూన్​ 1వ తేదీన ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే పాలు తాగితే వచ్చే లాభాలు అందరికీ తెలిసిందే. అయితే పాల దినోత్సవం సందర్భంగా మనం మరో కొత్త విషయాన్ని తెలుసుకుందాం. పాలు చర్మానికి ఎలా ఉపయోగపడతాయో.. ఏవిధంగా స్కిన్​కేర్​ రోటీన్​లో పాలను వాడుకోవచ్చు ఈ రోజు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

మొటిమల చికిత్స కోసం..

విటమిన్ డి లేకపోవడం, పొల్యుషన్, జిడ్డు చర్మం వల్ల మొటిమలు వస్తాయి. కాబట్టి వాటికి పాలను అప్లై చేయడం వల్ల మొటిమలు తొలగిపోతాయి. ఎందుకంటే ఫోర్టిఫైడ్ పాలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. బాధాకరమైన, ఎర్రని మొటిమలపై పాలను పూయవచ్చు. వాటి రూపాన్ని తగ్గించడానికి పాలు సహాయపడతాయి. కానీ కొందరికి ఇది హానికరమైనదని చెప్పే అధ్యాయనాలు ఉన్నాయి. కాబట్టి పాలను మీ రెగ్యూలర్ స్కిన్ కేర్​లో ఉపయోగించే ముందు... మీ దగ్గర్లోని చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.

సన్​బర్న్ కోసం

వేసవిలో సన్​బర్న్​ చాలా కామన్. ఆ సమయంలో చర్మంపై చల్లని పాలు మంచి ప్రభావాన్ని ఇస్తాయి. కూల్ కంప్రెస్ చేయడానికి షెల్ఫ్-స్టేబుల్ క్యాన్డ్ మిల్క్ లేదా కూల్ డైరీ మిల్క్‌ని వాష్‌క్లాత్‌తో అప్లై చేయాలి. దీనిని చాలా కాలంగా ప్రజలు వడదెబ్బకు హోం రెమెడీగా ఉపయోగిస్తున్నారు. ఈ ఇంటి నివారణలను ఉపయోగించడం వల్ల మీరు సూర్యరశ్మిని నివారించడానికి పెద్దగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరీ సెన్సిటివిటీ ఉన్నవారు మాత్రం.. ఈ హోం రెమెడీని ఉపయోగించే ముందు జాగ్రత్తగా ఉండాలి.

ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్

సహజ ఆమ్లత స్థాయిలు, లాక్టిక్ యాసిడ్ కంటెంట్ కారణంగా పాలను సహజ ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్‌గా ఉపయోగించవచ్చు. పాలను ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్‌గా ఉపయోగించిన తర్వాత చాలా మంది దాని ప్రయోజనాలను పొందారని అధ్యాయనాలు పేర్కొన్నాయి. ఇది అధిక సాంద్రత కలిగిన లాక్టిక్ యాసిడ్ కణాల టర్నోవర్‌ను ప్రోత్సహిస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. అయినప్పటికీ.. పాల కంటే మెరుగైన, మరింత ప్రభావవంతమైన అనేక ఇతర ఎక్స్‌ఫోలియెంట్‌లు మార్కెట్లో ఉన్నాయి.

మాయిశ్చరైజింగ్ లక్షణాలు

పాలు మాయిశ్చరైజింగ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. అందుకే చర్మంలోని తేమను లాక్ చేయడానికి ప్రజలు దీనిని ఉపయోగించవచ్చు. మార్కెట్‌లో విక్రయించే ఎక్స్‌ఫోలియేటింగ్ ఉత్పత్తులలో కూడా పాలను ఉపయోగిస్తారు. పాలలో బయోటిన్, ఇతర మాయిశ్చరైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి పొడి, పగుళ్లు, వాడిపోయిన చర్మానికి పోషణ అందిస్తాయి. ఇది చర్మం లోతైన పొరలలోకి వెళ్లి లోపల నుంచి అవసరమైన కండిషనింగ్, మాయిశ్చరైజేషన్‌ను అందిస్తుంది.

మరిన్ని ఉపయోగాలు..

మృదువైన, మెరిసే చర్మం కోసం మీరు పాలను ఫేస్ మాస్క్‌గా లేదా క్లెన్సర్‌గా కూడా ఉపయోగించవచ్చు. పాలలో ఉండే విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతాయి. అంతేకాకుండా యాంటీ ఏజింగ్ లక్షణాలు త్వరగా రాకుండా చేస్తుంది. పచ్చి పాలు మెగ్నీషియం ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. అంతేకాకుండా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. పాలల్లోని ప్రొటీన్ కణజాల మరమ్మత్తు, పెరుగుదలలో సహాయపడుతుంది. తద్వారా చర్మాన్ని బిగుతుగా, దృఢంగా చేస్తుంది.

 

టాపిక్

తదుపరి వ్యాసం