తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sony Xperia 5 Iv | ప్రీమియం రేంజ్ ఆడియో, వీడియో ఫీచర్లతో సోనీ స్మార్ట్‌ఫోన్!

Sony Xperia 5 IV | ప్రీమియం రేంజ్ ఆడియో, వీడియో ఫీచర్లతో సోనీ స్మార్ట్‌ఫోన్!

HT Telugu Desk HT Telugu

04 September 2022, 13:06 IST

    • సోనీ బ్రాండ్ మీద Sony Xperia 5 IV స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఇందులో ఆడియోకి సంబంధించి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. మిగతా ఫీచర్లు మామూలాగా ఉన్నాయి. ధర మాత్రం అదిరిపోయే రేంజులో ఉంది.
Sony Xperia 5 IV
Sony Xperia 5 IV

Sony Xperia 5 IV

ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ నుంచి Sony Xperia 5 IV అనే సరికొత్త స్మార్ట్‌ఫోన్ రీసెంట్ గా గ్లోబల్ మార్కెట్లో విడుదల అయింది. దీంతో సోనీ బ్రాండ్ కు సంబంధించి 2022 ఫోన్ లైనప్ పూర్తయిందని నివేదికలు తెలిపాయి. కాగా, ఈ సరికొత్త Sony Xperia 5 IV స్మార్ట్‌ఫోన్ తమ Xperia సిరీస్ నుంచి వచ్చిన ఫ్లాగ్‌షిప్ ఫోన్. ఇందులో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి, అలాగే దీని ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

డిజైన్ పరంగా Xperia 5 IV దాదాపు దాని పాత వెర్షన్ Xperia 5 III ఫోన్‌ను పోలి ఉంటుంది. డిస్‌ప్లే పాత ప్యానెల్ కంటే 50% ప్రకాశవంతంగా ఉంది. ఈ ఫోన్ వాటర్-రెసిస్టెంట్, డస్ట్ ప్రూఫ్ కోసం IP68 రేటింగ్స్ కలిగి ఉంది. అలాగే రెండు వైపులా గొరిల్లా గ్లాస్ విక్టస్‌ రక్షణ కవచంతో వస్తుంది. ఛార్జింగ్ విషయానికొస్తే, Xperia 5 IVలో 5,000mAh సామర్థ్యం కలిగిన నాణ్యమైన బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. ఇది 30W PD ఛార్జర్‌తో 30 నిమిషాలలో 50% ఛార్జ్‌ అవుతుందని సోనీ పేర్కొంది.

మ్యూజిక్ ప్రియులను ఈ ఫోన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో ఫుల్-స్టేజ్ స్టీరియో స్పీకర్‌లు, ఆడియో మ్యాజిక్‌లతో పాటు ఆడియోకి సంబంధించి Dolby Atmos, Hi-Res ఆడియో, DSEE అల్టిమేట్, 360 రియాలిటీ ఆడియో వంటి శక్తివంతమైన ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. వీటి ధరలు ఎంత మొదలగు అన్ని వివరాలు ఇక్కడ కింద పేర్కొన్నాం.

Sony Xperia 5 IV స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.1 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే

8GB RAM, 128/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం

Snapdragon 8 Gen 1 ప్రాసెసర్

వెనకవైపు 12MP+12MP ట్రిపుల్-కెమెరా సెటప్‌, 4K HDR వీడియో రికార్డింగ్‌

ముందు భాగంలో 12 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఛార్జర్

ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, ఎక్రూ వైట్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కనెక్టివిటీపరంగా Sony Xperia 5 IVలో బ్లూటూత్ 5.2, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, NFC, 5G ఉన్నాయి.

ఈ ఫోన్ 8GB/128GB కాన్ఫిగరేషన్ కోసం ధర $999. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 79,400/- ఈ ఫోన్ అక్టోబర్ నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం