తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dementia Risk Factors: ఒంటరితనం వల్ల డిమెన్షియా ముప్పు.. ఆ అలవాట్లతో ఇంకా డేంజర్

Dementia risk factors: ఒంటరితనం వల్ల డిమెన్షియా ముప్పు.. ఆ అలవాట్లతో ఇంకా డేంజర్

HT Telugu Desk HT Telugu

02 February 2023, 15:02 IST

  • Dementia risk factors: అల్జీమర్స్ వ్యాధి, సంబంధిత డిమెన్షియా (ఏడీఆర్‌డీ) ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెరుగుతున్న సమస్య. 

ఒంటరి తనం వల్ల డిమెన్షియా ముప్పు
ఒంటరి తనం వల్ల డిమెన్షియా ముప్పు (Unsplash)

ఒంటరి తనం వల్ల డిమెన్షియా ముప్పు

ఒంటరి తనం సహా సామాజిక జీవనశైలి విధానాలు న్యూరోడీజెనరేషన్ ముప్పు తెచ్చిపెడతాయని ప్లస్ ఒన్ జర్నల్‌లో ప్రచురితమైన మెక్‌గిల్ యూనివర్శిటీ అధ్యయనం ఒకటి తాజాగా తేల్చింది.

ట్రెండింగ్ వార్తలు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

అల్జీమర్స్, సంబంధిత డిమెన్షియా వ్యాధులు(ఏడీఆర్‌డీ) ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతోంది. ఈ వ్యాధుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 1 ట్రిలియన్ యూఎస్ డాలర్ల వ్యయమవుతోంది. ఈ ఏడీఆర్‌డీ పెరగడానికి సామాజికంగా ఒంటరితనం కారణమవుతోందని అధ్యయనం తెలిపింది. అయితే సామాజిక జీవనశైలి కూడా ఇందుకు కారణమవుతుందనడానికి మరింత అధ్యయనం జరగాల్సి ఉందని సూచించింది.

ఒంటరితనం, సామాజిక చర్చాగోష్టి, సామాజిక మద్దతు వంటి అంశాలపై ఈ అధ్యయనంలో ప్రశ్నలు సంధించారు. ఒంటరితనం, సామాజిక మద్దతు లేకపోవడం వంటివి ఏడీఆర్‌డీకి ప్రధాన ముప్పు కారకాలు అని అధ్యయనం తెలిపింది. కాగా స్మోకింగ్ అలవాటు ఉన్నవారు, మితిమీరిన మద్యపానం చేసేవారు, నిద్రలేమి గల వారు, శారీరకంగా చురుగ్గా లేని వారు ఒంటరి తనం, సామాజిక మద్దతు లేకపోవడం వల్ల వీరికి ఏడీఆ‌డీ ముప్పు ఎక్కువ ఉటుందని అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం కోసం జరిపిన రెండు సర్వేల్లో ఈ అంశాలు స్పష్టమయ్యాయి. శారీరక వ్యాయామం ఉన్న వారిలో ముప్పు తక్కువగా ఉందని తేలింది.

శారీరక, మానసిక ఆరోగ్య కారకాలు అల్జీమర్స్ వ్యాధి, సంబంధిత డిమెన్షియా వ్యాధుల(ఏడీఆర్‌డీ)కు లింక్ ఉందని గతంలో కొన్ని అధ్యయనాలు సూచించాయి. గుండె జబ్బులు, అంధత్వం, వినికిడి లోపం, డయాబెటిస్, న్యూరోటిక్, డిప్రెసివ్ ప్రవర్తనల కారణంగా ఈ ముప్పు ఉందని గతంలో అధ్యయనాలు చెప్పాయి. అయితే ఈ కారకాలు కూడా సామాజిక ఒంటరితనంతో ముడివడి ఉన్నాయని తాజా అధ్యయనం తేల్చింది.

అయితే సామాజిక ఒంటరితనాన్ని మార్చుకోవచ్చని, జన్యు సమస్యలు, లేదా ఇతర అనారోగ్య సమస్యల కంటే త్వరగా దీనిని పరిష్కరించుకోవచ్చని వివరించింది.

కోవిడ్-19 సందర్భంలో అనుభవించిన సామాజిక దూరం నేపథ్యంలో ఈ సామాజిక ఒంటరితనం ప్రభావంపై అధ్యయనం జరిపినట్టు రచయితలు తెలిపారు.

తదుపరి వ్యాసం