తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sex Life: సెక్స్ సమయంలో ఇలాంటి ఆలోచనలు వద్దు! ఎంజాయ్ చేయలేరు

Sex life: సెక్స్ సమయంలో ఇలాంటి ఆలోచనలు వద్దు! ఎంజాయ్ చేయలేరు

HT Telugu Desk HT Telugu

09 August 2023, 21:01 IST

    • Sex life: సెక్స్ కోసం సిద్ధమైన సమయంలో కొన్ని రకాల ఆలోచనలు చేయకూడదు. అలా, చేస్తే ఆందోళన పెరుగుతుంది. మీ శృంగార జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ప్రతీకాత్మక చిత్రం (HT Photos)
ప్రతీకాత్మక చిత్రం (HT Photos)

ప్రతీకాత్మక చిత్రం (HT Photos)

Sex life: జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొనేందుకు చాలా మంది ఆత్రుతగా ఉంటారు. లైట్స్ కావాల్సినట్టు డిమ్ చేసుకొని, బెడ్ రూమ్‍ను తమకు నచ్చినట్టు సర్దుకొని సెక్స్‌కు సిద్ధమవుతారు. బెడ్‍పై ఎంజాయ్ చేసేందుకు అంతా రెడీ చేసుకుంటారు. అయితే, శృంగారం సమయానికి వచ్చేసరికి కొందరికి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. కొన్ని అనవసర ఆలోచనలు, భయాలతో బిగుసుకుపోతారు. మనసులో సెక్స్‌పై కోరిక ఉన్నా సరైన పర్ఫార్మెన్స్ చేయలేరు. ఎంజాయ్ చేయలేరు. దీంతో శారీరక, మానసిక, ఎమోషనల్ హెల్త్‌పై ప్రభావం పడుతుంది. కొన్ని రకాల ఆలోచనలతో మనసులో ఆందోళన పెరిగితే మీ సెక్స్ లైఫ్‍పై అది ఎక్కువ ప్రభావాన్ని చూపవచ్చు. అలా, శృంగార సమయంలో చేయకూడని ఆలోచనలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

డౌట్లు వద్దు

శృంగారంలో పాల్గొనే ముందు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. సరిగా పర్ఫార్మ్ చేస్తామా లేదా అనే సందేహం పెట్టుకోకూడదు. శరీరం, లుక్స్ గురించి పార్ట్‌నర్ ఏమనుకుంటారో అని బిడియం చెందకూడదు. సంతృప్తి పరుస్తామా అని అతిగా ఆలోచించకూడదు. ఇవి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. అందుకే సెక్స్‌కు సిద్దమైనప్పుడు ఎలాంటి డౌట్లు పెట్టుకోకూడదు. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండాలి.

దగ్గరికొస్తే టెన్షన్ వద్దు

కొందరు శృంగారం గురించి చాలా ఊహించుకుంటుంటారు. తొందరపడుతుంటారు. అయితే, పడక గదిలో పార్ట్‌నర్ దగ్గరికి వచ్చే సరికి కంగారు పడుతుంటారు. వారితో గతంలో జరిగిన చెడు శృంగారం అనుభవాలనో, ఏదైనా కారణాలనో గుర్తు చేసుకొని భయపడతారు. సెక్స్‌కు సిద్ధమైన సమయంలో నెగెటివ్‍గా ఉండే పాత విషయాలను గుర్తు తెచ్చుకోకపోతేనే మంచిది. ఏదైనా ఇబ్బంది ఉంటే భాగస్వామితో వివరించి సందేహాలను తీర్చుకోవాలి.

ముభావంగా వద్దు

ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన, బలమైన బంధానికి మాట్లాడుకోవడం అనేది చాలా ముఖ్యం. అందుకే జీవిత భాగస్వాములు అన్ని విషయాల గురించి స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి. శృంగారం విషయంలోనూ ఇది చాలా ముఖ్యం. సెక్స్ విషయంలో మీ భాగస్వామి ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి. ఒకవేళ ఆందోళన చెందినట్టు మీకు అనిపిస్తే వారితో మాట్లాడడం ఇంకా ముఖ్యం.

సెక్స్ సమయంలో ఆందోళన వస్తే ఈ లక్షణాలు

శృంగారం సమయంలో రకరకాల ఆలోచనలతో ఆందోళన రేగితే ఎంజాయ్ చేయలేరు. అంగస్తంభన జరగదు. ఉద్వేగం ఆలస్యమవుతుంది. అకాల స్ఖలనం సమస్య తలెత్తుతుంది. లైంగిక కోరిక తగ్గుతుంది. పార్ట్‌నర్‌ను సంతృప్తి పరచలేరు. కంగారు పడతారు. వీటి వల్ల మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. సెక్స్ లైఫ్‍ దెబ్బతింటుంది.

శృంగారం పట్ల ఆందోళన ఉంటే తక్షణమే సంబంధిత నిపుణుల దగ్గరికి వెళ్లాలి. సమస్యను వివరించి పరిష్కారాన్ని తెలుసుకోవాలి. ఆందోళనను తగ్గించేలా కొన్ని థెరపీలు కూడా ఉన్నాయి. అయితే, సెక్స్ విషయంలో ఇబ్బందులు ఉంటే పార్ట్‌నర్‌తో మాట్లాడడం మాత్రం తప్పనిసరిగా చేయాలి.

తదుపరి వ్యాసం