తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Save Electricity Bill: ఈ చిట్కాలు పాటిస్తే మీ కరెంటు బిల్లు సగం అయిపోతుంది!

Save Electricity Bill: ఈ చిట్కాలు పాటిస్తే మీ కరెంటు బిల్లు సగం అయిపోతుంది!

HT Telugu Desk HT Telugu

04 September 2023, 18:33 IST

  • Save Electricity Bill: కరెంట్ బిల్లు పేలిపోతుందా? అయితే దాన్ని తగ్గించుకునే మార్గాలు కొన్ని ఉన్నాయి. దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన చిట్కాలేంటో తెలుసుకోండి.

కరెంట్ బిల్లు తగ్గించే చిట్కాలు
కరెంట్ బిల్లు తగ్గించే చిట్కాలు (pexels)

కరెంట్ బిల్లు తగ్గించే చిట్కాలు

కరెంటు ఛార్జీలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇంట్లో కరెంటు బిల్లు ఎప్పుడొచ్చినా ఎంత వచ్చిందో చూసుకునే వరకూ ఆతృత. చూసుకున్నాక ఇంత వచ్చేసిందేంటి అనే బాధ. ప్రతి ఇంట్లోనూ దాదాపుగా ఇదే సీన్‌ ప్రతి నెలా కనిపిస్తుంటుంది. అయితే చిన్న చిన్న చిట్కాలను పక్కాగా పాటించడం వల్ల మీ కరెంటు బిల్లును కొంత వరకు తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలేంటో చదివేసి పాటించేయండి.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

లైట్లను మార్చండి:

చాలా మంది ఇళ్లల్లో ట్యూబ్‌ లైట్లు, సాధారణ ఫిలమెంటు బల్బులను వాడుతుంటారు. మీరు కూడా ఆ పని చేస్తుంటే గనుక, ముందు వాటి స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను పెట్టండి. ఇంట్లో బాగా పాత ఫ్యాన్‌లు ఉంటే అవి దాదాపుగా 100 నుంచి 140 వాట్ల కెపాసిటీతో ఉంటాయి. వాటి స్థానంలో కొత్త వెరైటీ ఫ్యాన్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వ్చాయి. అవి కేవలం 40 వాట్ల కెపాసిటీతోనే పని చేస్తాయి. కనుక ముందు ఈ లైట్లు, ఫ్యాన్లు మార్చడం వల్ల కరెంటు బిల్లును భారీగా తగ్గించుకోవచ్చు.

ఇన్వర్టర్‌ ఏసీలతో ఆదా :

ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్‌లు.. తదితర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను వాడుతున్నారు. వీటిని కొనుక్కునేప్పుడే ఇన్వర్టర్‌ ఏసీలు, ఫ్రిజ్‌ల్లాంటివి కొనుక్కునేందుకు ప్రయత్నించండి. ఇన్వర్టర్‌ ఫ్రిజ్‌ల్లాంటివి సాధారణ ఉత్పత్తులతో పోలిస్తే తక్కువ విద్యుత్తును వాడుకుంటాయి. అలాగే ఫ్రిజ్‌ ఖాళీగా ఉంటే కరెంటు ఊరికే ఖర్చవుతుంది. మీ అవసరానికి తగినంత సైజులోనే ఫ్రిజ్‌ని కొనుక్కోండి. అది నిండుగా ఉండేలా చూసుకోండి. తగిన ఉష్ణోగ్రతను మాత్రమే అందులో సెట్‌ చేసుకోండి తప్ప మరీ బాగా తక్కువ ఉష్ణోగ్రతలో పెట్టినా కూడా ఫ్రిజ్‌ ఎక్కువ కరెంటును వాడుకుంటుంది.

అవసరం లేకపోతే స్విచ్చాఫ్‌ :

అవసరం లేనప్పుడు లైటు, ఫ్యాను, టీవీ.. ఏదైనా సరే కచ్చితంగా స్విచ్చాఫ్‌ చేయండి. కొందరు నిద్రపోయే ముందు మొబైల్‌ని ఛార్జ్‌ పెట్టి వెళ్లి నిద్రపోతుంటారు. లేకపోతే ఎప్పుడు చూసినా అలా ఛార్జింగ్‌లో పెట్టి వదిలేస్తుంటారు. అలా చేయడం వల్ల కరెంటూ వృధా అవుతుంది. ఫోన్‌ బ్యాటరీ కూడా తొందరగా పాడైపోతుంది. ఫోన్‌ 20 పర్సంట్‌ కిందికి వచ్చినప్పుడే దాన్ని ఛార్జ్‌ పెట్టాలి. 100 శాతం ఛార్జ్‌ అయ్యాక వెంటనే తీయాలి. వెంటనే ప్లగ్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయాలి.

షట్‌ డౌన్‌ చేయండి :

కంప్యూటలర్లపై పని చేసుకునే వారు పని అయిపోయాక కూడా వాటిని అలాగే వదిలేస్తుంటారు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబుల లాంటి వాటిని వాడకపోతే వెంటనే షట్‌డౌన్‌ చేయండి.

సహజ కాంతి, గాలిని రానీయండి :

పగలు అస్తమాను తలుపులు, కర్టెన్లు తీసి పెట్టుకోండి. సహజమైన గాలి, కాంతి ఇంటి గదుల్లోకి వచ్చేలా చూసుకుంటే విద్యుత్‌ వాడకం తగ్గుతుంది.

తదుపరి వ్యాసం