తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Samsung Galaxy Xcover Pro । వాటర్- డస్ట్ రెసిస్టెంట్‌తో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌!

Samsung Galaxy XCover Pro । వాటర్- డస్ట్ రెసిస్టెంట్‌తో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu

30 June 2022, 14:46 IST

    • శాంసంగ్ నుంచి Galaxy XCover Pro అనే స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ ఫోన్ రగ్గ్‌డ్ నిర్మాణాన్ని కలిగి ఉంది. తొలగించగల బ్యాటరీతో వస్తుంది. దీని ధర, ఇతర వివరాలు తెలుసుకోండి..
Samsung Galaxy XCover Pro
Samsung Galaxy XCover Pro

Samsung Galaxy XCover Pro

సౌత్ కొరియా టెక్ దిగ్గజం Samsung నాణ్యమైన స్మార్ట్‌ఫోన్‌లను అందించడంలో నమ్మదగిన బ్రాండ్. శాంసంగ్ కంపెనీ ప్రీమియం ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు, ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే కాకుండా ఇప్పుడు దృఢత్వంపైనా దృష్టిపెట్టింది. తాజాగా శాంసంగ్ కంపెనీ Galaxy XCover Pro అనే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది కఠినమైన నిర్మాణంతో కూడిన ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ వాటర్ రెసిస్టెంట్, డస్ట్ రెసిస్టెంట్ కలిగి IP68 రేటింగ్‌తో వస్తుంది. అదనంగా, ఇది MIL-810H పారిశ్రామిక ప్రమాణాలను కలిగి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

ఈ స్మార్ట్‌ఫోన్‌ టచ్ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణతో వస్తుంది. అయినప్పటికీ Samsung Galaxy XCover Proని మీరు గ్లోవ్స్ ధరించి ఉన్నా లేదా మీ చేతులు తడిగా ఉన్నా కూడా ఉపయోగించవచ్చు.

అలాగే ఇప్పుడు వస్తున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకప్పటిలా బ్యాటరీని బయటకు తీసే అవకాశం ఉండటం లేదు. అయితే ఈ సరికొత్త Samsung Galaxy XCover Pro స్మార్ట్‌ఫోన్‌ రిమూవేబుల్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఇందులో మిడ్- రేంజ్ చిప్‌సెట్‌ను అమర్చారు.

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి. ధర ఎంత తదితర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Samsung Galaxy XCover Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6-అంగుళాల ఫుల్ HD+ PLS LCD డిస్‌ప్లే
  • 6 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్
  • క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 778G ప్రాసెసర్
  • వెనకవైపు 50 MP +8MP డ్యుఎల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 13 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4050 mAh బ్యాటరీ సామర్థ్యం, 15W ఫాస్ట్ ఛార్జర్

Samsung Galaxy XCover Proలో ఇంకా 5G , Wi-Fi 6E, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB-C పోర్ట్ , 3.5mm ఆడియో జాక్, మెరుగైన స్పీకర్ సిస్టమ్, Samsung Dex వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఫోన్ జూలై 13 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అయితే దీని ధరపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కొన్ని లీకుల ప్రకారం Galaxy XCover Pro ధర సుమారు. రూ, 49,999/- ఉండవచ్చునని అంచనా.

టాపిక్

తదుపరి వ్యాసం