తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Samsung Galaxy M13 |ఆకర్షణీయమైన లుక్‌తో శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌

Samsung Galaxy M13 |ఆకర్షణీయమైన లుక్‌తో శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌

HT Telugu Desk HT Telugu

29 May 2022, 12:23 IST

    • శాంసంగ్ గెలాక్సీ ఎం13 స్మార్ట్‌ఫోన్‌ తాజాగా విడుదలయింది. ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌. మరి ఇందులో ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఇతర వివరాలు చూడండి.. 
Samsung Galaxy M13
Samsung Galaxy M13

Samsung Galaxy M13

సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు Samsung ఎలాంటి ప్రకటన చేయకుండా, ఎలాంటి హడావిడి లేకుండా Galaxy M13 పేరుతో మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ఒక ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్‌, 4Gకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. అయితే ఫీచర్ల విషయంలో ఎలాంటి తగ్గుదల లేదు. ఈ Galaxy M13లో ట్రిపుల్ రియర్ డిజికామ్ సెటప్ ఉంటుంది. దీనిలో భాగంగా f.18 ఎపర్చరుతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్ ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో 6.6-అంగుళాల పూర్తి-HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Men Skin Care Drinks : మెరిసే చర్మం కావాలంటే రోజూ ఉదయం వీటిలో ఏదో ఒకటి తాగండి

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Galaxy M13 డీప్ గ్రీన్, లైట్ బ్లూ మరియు ఆరెంజ్ కాపర్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభ్యమవనుంది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి. ధర ఎంత, ఎప్పట్నించి అందుబాటులో ఉంటుంది తదితర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Samsung Galaxy M13 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

6.6-అంగుళాల ఫుల్ HD+ ఇన్ఫినిటీ-V డిస్‌ప్లే

4 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్

ఆక్టా-కోర్ ఎగ్జినోస్ 850 ప్రాసెసర్

వెనకవైపు 50+5+2 మెగా పిక్సెల్స్ కెమెరా,  ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 15W ఫాస్ట్ ఛార్జర్

శాంసంగ్ ఇంకా దీని ధరను నిర్ణయించలేదు. రూ.10,999/- ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు.

Galaxy M13లో ఇంకా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ , కనెక్టివిటీ కోసం 4G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi (2.5Ghz/ 5GHz) , బ్లూటూత్ v5.0,  USB టైప్-C పోర్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం