తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  హోండా Cb350rsకి ప్రత్యర్థిగా Royal Enfield Hunter 350.. ధర, ఫీచర్లివే

హోండా CB350RSకి ప్రత్యర్థిగా Royal Enfield Hunter 350.. ధర, ఫీచర్లివే

22 July 2022, 7:23 IST

    • Royal Enfield Hunter 350 ఆగస్టు మొదటివారంలో ఇండియాలో లాంఛ్ అవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మాత్రం చెన్నైలోని డీలర్ యార్డ్‌లో కనిపించి.. అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సందర్భంగా Royal Enfield Hunter 350లోని ఫీచర్స్ ఏంటి? ధర ఎంత వంటి విషయాలు తెలుసుకుందాం. 
Royal Enfield Hunter 350
Royal Enfield Hunter 350

Royal Enfield Hunter 350

Royal Enfield Hunter 350 ఇండియాలో.. ఆగస్టు మొదటివారంలో లాంఛ్ అవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మోటార్‌సైకిల్ రెండు వేరియంట్‌లలో అందిస్తున్నారు. సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో రెట్రో-స్క్రాంబ్లర్ డిజైన్ లాంగ్వేజ్‌ను ప్రదర్శిస్తుంది. ఇది ఇప్పటి వరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి అత్యంత సరసమైన ఆఫర్‌గా దీనిని పరిగణిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్తగా అభివృద్ధి చేసిన J-సిరీస్ ఆర్కిటెక్చర్‌ని ఉపయోగించి దానిని రూపొందించారు. ఇది Meteor 350, క్లాసిక్ 350 NVH స్థాయిలను తగ్గించడంలో విజయవంతమైంది. రెండు మోటార్‌సైకిళ్లకు కస్టమర్‌లు, విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది.

హోండా CB350RSకి ప్రత్యర్థిగా

స్వదేశీ బైక్‌మేకర్ ఈ విజయాన్ని రాబోయే హంటర్ 350తో కూడా పునరావృతం చేయాలని ప్లాన్ చేస్తోంది ఆ సంస్థ. ఈ బైక్ ప్రధానంగా భారత మార్కెట్లో హోండా CB350RSకి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్‌లో సింగిల్-పీస్ సీటు, అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 డ్యూయల్-క్రెడిల్ ఫ్రేమ్‌పై కూర్చుంటుంది. మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, వెడల్పాటి హ్యాండిల్‌బార్, పెద్ద ఫెండర్‌లు, రౌండ్ హెడ్‌ల్యాంప్, టెయిల్లాంప్ యూనిట్లు, స్టెప్-అప్ సింగిల్-పీస్ సీటు, గ్రాబ్ రైల్స్, అప్‌స్వీప్ట్ ఎగ్జాస్ట్‌ను కలిగి ఉంటుంది.

ఇంజన్, సేఫ్టీ ఫీచర్స్

Royal Enfield Hunter 350 మోటార్‌సైకిల్ మెటోర్ 350 నుంచి ట్రిప్పర్ నావిగేషన్ యూనిట్‌తో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ప్యాక్ చేస్తుంది. రాబోయే హంటర్ 350కి J-సిరీస్ 349cc సింగిల్-సిలిండర్, మెటోర్ 350, క్లాసిక్ 350 నుంచి ఎయిర్-కూల్డ్ ఇంజన్ మద్దతునిస్తుంది. భద్రతా పరికరాల పరంగా.. Royal Enfield Hunter 350 ముందు చక్రంలో డిస్క్ బ్రేక్, వెనుక చక్రంలో ఒక డిస్క్/డ్రమ్ బ్రేక్‌తో పాటు సింగిల్-ఛానల్ లేదా డ్యూయల్-ఛానల్ ABSతో వస్తుంది. సస్పెన్షన్ డ్యూటీలను మోటార్‌సైకిల్ వెనుక భాగంలో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, ప్రీలోడ్-అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.

Royal Enfield Hunter 350 : ధర

భారతదేశంలో విడుదల కాబోయే హంటర్ 350 ధర, లభ్యతకు సంబంధించిన వివరాలను లాంచ్ ఈవెంట్ సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ వెల్లడిస్తుంది. అయితే రెట్రో స్క్రాంబ్లర్ ధర దాదాపు రూ. 1.3 లక్షలు (ఎక్స్-షోరూమ్).

టాపిక్

తదుపరి వ్యాసం