తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Redmi Note 11 Se | బడ్జెట్ ధరలోనే ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్!

Redmi Note 11 SE | బడ్జెట్ ధరలోనే ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్!

HT Telugu Desk HT Telugu

25 May 2022, 22:20 IST

    • Redmi తాజాగా Redmi Note 11 SE అనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ Redmi Note 11 SE డిజైన్ గత సంవత్సరం భారత మార్కెట్లో లాంచ్ చేసిన Poco M3 ప్రో 5Gని పోలి ఉంది.
Redmi Note 11 SE
Redmi Note 11 SE

Redmi Note 11 SE

మొబైల్ ఉత్పత్తిదారు Redmi తాజాగా Note 11T సిరీస్‌లో లాంచ్ ఈవెంట్‌లో భాగంగా Redmi Note 11 SE అనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ Redmi Note 11 SE డిజైన్ గత సంవత్సరం భారత మార్కెట్లో లాంచ్ చేసిన Poco M3 ప్రో 5Gని పోలి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

Weight Loss Tips : బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనం ఎంత ముఖ్యమో తెలుసుకోండి..

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Redmi Note 11 SE స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల IPS LCDని కలిగి ఉంది. ఇది 1080 x 2400 పిక్సెల్స్ తో పూర్తి HD+ రిజల్యూషన్ అలాగే 90Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఆన్-స్క్రీన్ కంటెంట్ ఆధారంగా స్క్రీన్ 30Hz ఇంకా 90Hz మధ్య డైనమిక్‌గా రిఫ్రెష్ అవుతుంది. ఇది LCDని కలిగి ఉన్నందున, ఈ హ్యాండ్ సెట్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందించదు. బదులుగా, వినియోగదారులు సైడ్-మౌంటెడ్ స్కానర్‌ను పొందుతారు.

ఇంకా ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Redmi Note 11 SE స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5-అంగుళాల IPS LCD పూర్తి HD+ డిస్‌ప్లే

4GB RAM/8GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యం

క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్

వెనకవైపు 48 మెగా పిక్సెల్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్; ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఫాస్ట్ ఛార్జర్

Redmi Note 11 SE స్మార్ట్‌ఫోన్ షాడో బ్లాక్, డీప్ స్పేస్ బ్లూ రెండు కలర్ ఛాయిస్ లలో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో మాత్రమే విడుదలయింది. గ్లోబల్ మార్కెట్లో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ మనదేశంలో విడుదలైతే భారతీయ కరెన్సీ ప్రకారం ధరలు రూ. 12,800 - 16,200/- వరకు ఉండవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం