తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Promise Day 2024 : ప్రామిస్ డేను ఇలా జరుపుకోండి.. ఈ గిఫ్ట్స్ ఇవ్వండి

Promise Day 2024 : ప్రామిస్ డేను ఇలా జరుపుకోండి.. ఈ గిఫ్ట్స్ ఇవ్వండి

Anand Sai HT Telugu

11 February 2024, 7:00 IST

    • Promise Day 2024 : ప్రేమ నెల అయిన ఫిబ్రవరిలో 11వ తేదీ వచ్చింది. అంటే ఈరోజున ప్రామిస్ డే. మీ ప్రియమైన వారికి ఇచ్చే వాగ్దానాలు జీవితాంతం గుర్తుండేలా ప్లాన్ చేయాలి.
ప్రామిస్ డే
ప్రామిస్ డే (Unsplash)

ప్రామిస్ డే

ప్రామిస్ డే అనేది మీ భాగస్వామికి మీ అంతులేని ప్రేమ, సంరక్షణను వాగ్దానం చేయడానికి సరైన సందర్భం. ఫిబ్రవరి 11న మీరు ప్రేమించే వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని ప్రామిస్ చేసే రోజు. జీవితంలోని కష్టసుఖాలు, సంతోషం, దుఃఖం, బాధలు సమానంగా పంచుకుంటామని ఈ రోజున చెప్పాలి. మీ ప్రియమైన వారితో ప్రామిస్ డేను మరింత ఆనందంగా జరుపుకొనేందుకు కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

ఇలా వాగ్దానం చేయండి

నీ సుఖ దుఃఖాలలో ఎప్పుడూ నీ వెంటే ఉంటానని వాగ్దానం చేసే రోజు ఇది. మీ ప్రియమైన వారికి మీరు భరోసా ఇవ్వాలి. మీతో జీవితాంతం ఉంటానని చెప్పాలి. అప్పుడే వారు సంతోషంగా ఉంటారు. మీరు ప్రేమించే వ్యక్తికి నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లి ఈ విషయం చెప్పండి.

లవ్ ప్రపోజల్ రొమాంటిక్ గా ఉంటే బాగుంటుంది. ఈ రోజున మీరు మీ ప్రేమికుడికి ఏదైనా వాగ్దానం చేయాలనుకుంటే, ఆ వాగ్దానాన్ని రొమాంటిక్‌గా చెప్పండి.

నేను ఎప్పటికీ నీతోనే ఉన్నాను.. ఉంటాను.. మనం కలిసి తీసుకున్న ఫోటోలో నువ్వే.. నా ఊపిరిలో నువ్వే.. నేనెప్పుడూ నీతోనే ఉంటాను అనే టెక్స్ట్‌తో కూడిన ఫోటో ఫ్రేమ్‌ను ఇవ్వండి.

మీరు ప్రేమించిన వ్యక్తి కళ్లలోకి చూసి ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి నువ్వేనని, నువ్వు తప్ప నా జీవితంలో వేరేవారికి చోటు లేదని చెప్పండి. ఆ క్షణాన్ని వాళ్లు ఎప్పటికీ మరచిపోలేరు. నీ నీడలా నీతో ఉంటాను అని మాట ఇవ్వండి.

మన మధ్య గొడవలు జరగడం సాధారణమే అని మీ భాగస్వామికి చెప్పండి. ప్రాణం పోయినా నిన్ను వదలను అని మాట ఇవ్వండి. గొడవ పడితే అక్కడితో ముగిస్తాను అని, అదే విషయాన్ని లాగను అని చెప్పండి.

నేను నిన్ను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను అని ఇలా ఒకరికొకరు వాగ్దానం చేసుకుంటే పరస్పర అనుకూలత పెరుగుతుంది. ఇలా వాగ్దానం చేస్తున్నప్పుడు వారిని సంతోషపెట్టండి, రొమాంటిక్ సినిమా చూడటానికి వెళ్లండి లేదా రొమాంటిక్ డిన్నర్‌కి వెళ్లండి. వారికి ట్రిప్ నచ్చితే తీసుకెళ్లండి. మీరు ప్రేమించే వ్యక్తి చేతిని మీ చేతుల్లోకి తీసుకుని ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తానని వాగ్దానం చేయండి.. వారు మీ మాటలతో చాలా సంతోషిస్తారు.

నీ లక్ష్యాన్ని సాధించడానికి నేను ఎల్లప్పుడూ నీకు మద్దతు ఇస్తానని వాగ్దానం చేయండి. ఇది చాలా సంతోషాన్ని ఇస్తుంది. . మీలాంటి భాగస్వామి ఉన్నందుకు వారు గర్వపడతారు. ప్రామిస్ డేని ఇలా ప్రత్యేకంగా చేయండి.

ప్రామిస్ డే గిఫ్ట్ ఐడియాలు ఇవే

మీ ప్రియమైన వారికి కొవ్వొత్తిని బహుమతిగా ఇవ్వడం ద్వారా నీ జీవితానికి ఎప్పటికీ వెలుగుగా ఉంటానని వాగ్దానం చేయండి. నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను అంటూ సువాసనగల కొవ్వొత్తిని అందించండి. ఇది కచ్చితంగా మీ భాగస్వామి ముఖంలో చిరునవ్వును నింపుతుంది.

ప్రతి సంబంధానికి పువ్వులు ఉత్తమ బహుమతులుగా పరిగణిస్తారు. మీ భాగస్వామికి ప్రేమ, అందం, ఆనందంతో నిండిన జీవితాన్ని వాగ్దానం చేయడానికి బొకేలను ఇవ్వండి. ఒక పూల బొకే ఇచ్చి వాగ్దానం చేయండి. పువ్వుల అందం మీ భాగస్వామి కళ్లను ఆకర్షిస్తుంది. మీ మాటలు వారి ముఖంపై చిరునవ్వును తెస్తుంది.

మీరు మీ భాగస్వామి పట్ల ప్రేమను చూపించాలి. వారి సంతోషకరమైన జీవితం కోసం వాగ్దానం చేయాలి. ప్రామిస్ చేస్తూ ఉంగరం బహుమతిగా ఇవ్వండి. మీ భాగస్వామికి ప్రామిస్ ఉంగరాన్ని ఇవ్వడం వారి పట్ల మీ శాశ్వతమైన ప్రేమను సూచిస్తుంది.

తదుపరి వ్యాసం