తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Poco M5 Price Details : రూ. 12,499 నుంచే Poco M5 ధర ప్రారంభం.. ఫ్లిప్​కార్ట్​లో విక్రయం..

Poco M5 Price Details : రూ. 12,499 నుంచే Poco M5 ధర ప్రారంభం.. ఫ్లిప్​కార్ట్​లో విక్రయం..

06 September 2022, 13:12 IST

    • Poco తన M సిరీస్ నుంచి Poco M5, Poco M5sలను విడుదల చేసింది. Poco M5.. M5s కంటే కొంచెం పెద్ద డిస్‌ప్లేని కలిగి ఉంది. తక్కువ బడ్జెట్​లో.. ఎక్కువ ఫీచర్లు కావాలనుకునేవారికి ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఎంపిక అవుతుంది. 
Poco M5 ధర, ఫీచర్లు
Poco M5 ధర, ఫీచర్లు

Poco M5 ధర, ఫీచర్లు

Poco M5 : Poco తన సరికొత్త Poco M5 స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. Poco M5 మీడియాటెక్ చిప్‌సెట్, 90Hz డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరాలు, మరిన్ని ఫీచర్లతో మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటుంది. Poco M5 భారతదేశంలో బడ్జెట్ ఆఫర్‌ ఫోన్​గా చెప్పవచ్చు. ఇది ఫాక్స్ లెదర్ బ్యాక్ ప్యానెల్, రెండు-టోన్ కలర్ స్కీమ్‌తో వస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

Optical Illusion: కేవలం డిటెక్టివ్‌లు మాత్రమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో దాక్కుని ఉన్న టై ను కనిపెట్టగలరు, ప్రయత్నించండి

Bad Food Combinations: ఆయుర్వేదం ప్రకారం తినకూడని ఫుడ్ కాంబినేషన్లు ఇవే

POCO M5 ధర

Poco M5 బేస్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.12,499 కాగా.. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499. Poco M5ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తున్నారు. మొదటి సేల్ సెప్టెంబర్ 13న జరుగనుంది. స్మార్ట్‌ఫోన్ ఐసీ బ్లూ, పవర్ బ్లాక్, ఎల్లో కలర్స్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

POCO M5 స్పెసిఫికేషన్‌లు

Poco M5 భారతదేశంలో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ 6GB వరకు RAM, 128GB వరకు అంతర్గత నిల్వతో జత చేసిన MediaTek Helio G99 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో జత చేసిన 5,000mAh బ్యాటరీతో వచ్చింది.

Poco M5 కెమెరా సెటప్

Poco M5లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. Poco M5 ముందు కెమెరా 8-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌తో వస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.3, NFC, IR బ్లాస్టర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

తదుపరి వ్యాసం