తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Plants For Blacony: వందేళ్లు బతికే మొక్కలు ఇవి, ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు

Plants for Blacony: వందేళ్లు బతికే మొక్కలు ఇవి, ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు

Haritha Chappa HT Telugu

06 January 2024, 13:00 IST

    • Plants for Blacony: ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్స్‌గా కొన్ని మొక్కలు ఉన్నాయి.
బాల్కనీ గార్డెన్
బాల్కనీ గార్డెన్ (Pixabay)

బాల్కనీ గార్డెన్

Plants for Blacony: ఇంట్లో మొక్కలు పెంచుకునే అలవాటు ఎంతో మందికి ఉంది. ఇంటి చుట్టూ పచ్చదనం ఉంటే ఆ ఇల్లు కళకళలాడిపోతుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ల సంస్కృతి పెరగడంతో బాల్కనీలోని చిన్నచిన్న కుండీల్లో మొక్కలు పెంచుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రెండు మూడు రోజులకు ఒక్కసారి నీళ్లు పోసినా బతికే కొన్ని మొండి మొక్కలు ఉన్నాయి. అలాంటివి పెంచుకుంటే సమయానికి నీళ్లు పోయలేదనే టెన్షన్ ఉండదు. అలాగే వీటిలో కొన్కని మొక్కలు వందేళ్లపాటు జీవించే అవకాశం ఉంది. ఎక్కువకాలం జీవించే ఇలాంటి మొక్కల్ని ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిది. ఈ మొక్కలన్నీ కూడా నర్సరీల్లో దొరికేవే. వీటి పేర్లు వెరైటీగా ఉన్నా... ప్రస్తుతం ఎన్నో నర్సరీలలో ఈ మొక్కలు కనిపిస్తున్నాయి.

జేడ్ ప్లాంట్

జేడ్ ప్లాంట్

ఇప్పుడు ఎంతోమంది ఇళ్లల్లో ఈ జేడ్ ప్లాంట్ (Jade Plants) ఉంది. మోజాంబిక్, దక్షిణాఫ్రికాకు చెందిన మొక్క ఇది. వీటికి వారంలో రెండు సార్లు నీళ్లు వేసినా చాలు చక్కగా ఆరోగ్యంగా పెరుగుతాయి. వీటిని లక్కీ ప్లాంట్స్, మనీ ట్రీస్ అని కూడా అంటారు. ఇవి వందేళ్ల వరకు సులువుగా జీవించగలవు. దీనికి పుష్కలంగా వెలుతురు తగిలితే చాలు. ఇది ఇంట్లో ఉంటే ఇంటికి శక్తి, శ్రేయస్సు రెండూ అందుతాయి. ఈ మొక్కలు అదృష్టాన్ని సూచిస్తాయి. కాబట్టి ఇంట్లో ఉంటే ఎంతో మంచిది.

స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్స్

ఇప్పుడు ఎన్నో అపార్ట్మెంట్లలో నిటారుగా పెరుగుతున్న స్నేక్ ప్లాంట్స్‌ని చూడొచ్చు. వీటికి నీళ్లు చాలా తక్కువగా అవసరం పడతాయి. ఇవి పాతకేళ్ల వరకు ఆరోగ్యంగా జీవిస్తాయి. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే గాలి కూడా పరిశుభ్రంగా ఉంటుంది. గాలిలోని విష కారకాలను పీల్చుకొని గాలిని శుభ్రపరిచే లక్షణం ఈ మొక్కలకి ఉంది. వారానికి ఒక్కసారి నీళ్ళు వేసినా చాలు ఇవి జీవించేస్తాయి.

క్రిస్టమస్ కాక్టస్

క్రిస్మస్ కాక్టస్

ఈ మొక్కలు ఒక్కసారి ఇంట్లో పెంచితే... ఆ ఇంట్లోని రెండో తరం వారు కూడా ఈ మొక్కల్ని చూడగలరు. వందేళ్ల వరకు ఇవి జీవించే అవకాశం ఉంది. ఈ మొక్కలు 6 నుండి 8 వారాలలో ప్రకాశవంతంగా పువ్వులను పూస్తాయి. పది రోజులకు ఒకసారి నీళ్లు వేసినా కూడా ప్రాణం నిలబెట్టుకుంటుంది. ఇది బాల్కనీకి చక్కని అందాన్ని ఇస్తుంది.

ఫికాస్ ఎలాస్టికా

ఫికాస్ ఎలాస్టికా

వీటినే రబ్బరు మొక్కలు అని పిలుస్తారు. ఇవి వందేళ్లకు పైగా జీవిస్తాయి. వీటిలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక పది రకాల మొక్కలు మాత్రం ఇంటి బాల్కనీలో పెంచుకోవచ్చు. దీనికి కాంతి తగిలినా, కాంతి తక్కువగా తగిలినా కూడా జీవిస్తాయి. వారానికి ఒక్కసారి నీరు పోస్తే చాలు. ఉష్ణమండల ప్రాంతానికి చెందిన మొక్క... కనుక ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు.

కాస్ట్ ఐరన్ ప్లాంట్

కాస్ట్ ఐరన్ ప్లాంట్

ఇవి ఎంత కఠినమైన పరిస్థితులనైనా తట్టుకొని జీవించే మొక్కలు. వెలుతురు తక్కువగా ఉన్నా, గాలి నాణ్యత పేలవంగా ఉన్నా, చల్లని ఉష్ణోగ్రత, వేడి ఉష్ణోగ్రత... ఇలా ఏదైనా కూడా ఈ మొక్కలు జీవిస్తాయి. ఇవి యాభై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతుకుతాయి. వీటిని ప్రత్యేకంగా పెంచాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నాటుకుందంటే అప్పుడప్పుడు నీరు పోసినా చాలు అలా జీవిస్తూనే ఉంటాయి. ఇలాంటి మొక్కలను పెంచుకోవడం వల్ల మీరు ప్రత్యేకంగా గార్డెనింగ్ కు సమయం కేటాయించాల్సిన అవసరం ఉండదు.

టాపిక్

తదుపరి వ్యాసం