తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oppo Reno8 Series | ఒప్పో నుంచి మరో సరికొత్త సిరీస్, విడుదలకు ముందే వివరాలు లీక్

Oppo Reno8 Series | ఒప్పో నుంచి మరో సరికొత్త సిరీస్, విడుదలకు ముందే వివరాలు లీక్

HT Telugu Desk HT Telugu

18 July 2022, 14:52 IST

    • ఒప్పో సరికొత్త Reno8 సిరీస్ ను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లో విడుదల చేయనుంది. వీటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
OPPO Reno 8 series
OPPO Reno 8 series

OPPO Reno 8 series

చైనీస్ మొబైల్ దిగ్గజం Oppo ఒక పెద్ద ఆన్‌లైన్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఒప్పో తమ బ్రాండ్ నుంచి నాలుగు కొత్త టెక్ ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. ఇందులో కొత్త Oppo Reno8, Reno8 Pro అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లు, అలాగే Oppo ప్యాడ్ ఎయిర్ అనే ఒక టాబ్లెట్, ఇంకా Enco X2 పేరుతో వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. Oppo లాంచ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

ఒప్పో ఈవెంట్‌లో Reno8 స్మార్ట్‌ఫోన్‌ సిరీస్ ప్రధాన అంశంగా చెప్పవచ్చు. తమ Reno7 సిరీస్ కు సక్సెసర్ గా ఈ Reno8 సిరీస్ ను ఒప్పో తీసుకువస్తుంది. ఇందులో మిడ్-రేంజ్, ఫ్లాగ్ షిప్ ఫీచర్లతో Reno8 స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ లాంచ్ చేస్తుంది.

ఏడాది ఫిబ్రవరిలో రెనో7 సిరీస్‌లో వచ్చిన రెనో7 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 28,999 ఉండహా, ప్రో వేరియంట్‌ రూ.39,999 నుంచి ప్రారంభమయింది. అయితే సరికొత్త. రెనో8 అంతకు మించిన ధరల శ్రేణిని కలిగి ఉంటుంది. Oppo Reno8 Pro ఫోన్ ధర లాంచ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయింది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ 12GB+256GB RAM వేరియంట్ ధర రూ.46,999 అని చూపించే చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఇది ఈ సిరీస్‌లో అత్యంత ఖరీదైన, హై-ఎండ్ వేరియంట్ ధర. అయితే అధికారికంగా ఒప్పో అసలు ధరను ప్రకటించాల్సి ఉంది.

Oppo Reno8 సిరీస్ Mediatek ప్రాసెసర్‌లతో వస్తోంది. Reno8 Proలో Mediatek డైమెన్సిటీ 8100-Max ప్రాసెసర్ ఇస్తుండగా, Reno8లో MediaTek డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ అందిస్తోంది. Oppo కొత్త ఫోన్‌లలో బ్యాటరీ ఛార్జింగ్‌ను ప్రధానంగా హైలైట్ చేస్తుంది. ఇవి 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

ధరలు, స్పెసిఫికేషన్‌ల దృష్ట్యా ఈ కొత్త ఫోన్‌లు Redmi K50i , నథింగ్ ఫోన్ (1), వన్ ప్లస్ Nord 2T, పోకోF4 5G, శాంసంగ్ గెలాక్సీ A53 (5G) వంటి హ్యాండ్ సెట్లకు పోటీగా ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం