తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  నాణ్యమైన బ్యాటరీ, బడ్జెట్ ధరలో Oppo A16e స్మార్ట్‌ఫోన్‌!

నాణ్యమైన బ్యాటరీ, బడ్జెట్ ధరలో OPPO A16e స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu

21 March 2022, 13:25 IST

    • Oppo తాజాగా ఇండియాలో ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ధరలు రూ. 10 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి.
Oppo A16e smartphone
Oppo A16e smartphone (Oppo India)

Oppo A16e smartphone

ప్రీమియం మొబైల్ బ్రాండ్ Oppo తాజాగా ఇండియాలో ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Oppo A16e పేరుతో సరసమైన ధరలో, మేలైన ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు లభించనుంది. Oppo A16e స్మార్ట్‌ఫోన్‌ ధరలు రూ. 10 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

Raw Mango vs Ripe Mango: పచ్చి మామిడి vs పండిన మామిడి… ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యంకానుంది. అలాగే మిడ్‌నైట్ బ్లాక్, బ్లూ ఇంకా వైట్ కలర్ ఛాయిస్ ఆప్షన్లు ఉన్నాయి.

ఈ ఫోన్‌లోని బ్యాటరీలో రోజంతా ఛార్జింగ్ నిలిచే ఉంటుందని కంపెనీ పేర్కొంది. మరి ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయి? ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇప్పుడు తెలుసుకుందాం.

Oppo A16e స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

60Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.52 అంగుళాల IPS LCD HD డిస్‌ప్లే

3/4GB RAM, 32/64GB స్టోరేజ్ సామర్థ్యం (మైక్రో ఎస్డీ కార్డుతో 1TB వరకు స్టోరేజ్ విస్తరించుకోవచ్చు)

మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్

వెనకవైపు 13 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్

4,230 mAh బ్యాటరీ సామర్థ్యం

ధర రూ 9,990 నుంచి రూ. 11,990 వరకు.

3GB ర్యామ్, 32GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,990/- గా ఉంటుంది. 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 11,990కి లభిస్తుంది.

అయితే ఒప్పో A16eలో ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు. బదులుగా ఫేస్ అన్‌లాక్‌ సపోర్ట్ ఇచ్చారు. ఇది మినహాయిస్తే అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఉన్నట్లుగానే డ్యూయల్ 4G VoLTE, WiFi 802.11b/g/n, బ్లూటూత్ 5, GPS, మైక్రో SD కార్డ్ స్లాట్, 3.5mm ఆడియో జాక్ లాంటి ఫీచర్లు A16eలోనూ ఉన్నాయి.

తదుపరి వ్యాసం