తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Onion Juice Benefits : జుట్టు సమస్యలన్నింటికీ ఒక్కటే పరిష్కారం..

Onion Juice Benefits : జుట్టు సమస్యలన్నింటికీ ఒక్కటే పరిష్కారం..

09 June 2022, 15:16 IST

    • ఉల్లిపాయ అనేది తాజా స్టార్ హెయిర్ కేర్ పదార్ధం. జుట్టు సమస్యలను ఎదుర్కోవటానికి నిపుణులు దీనిని వాడమని సూచిస్తున్నారు. అయితే జుట్టులోని ఏ సమస్యలకు ఉల్లిపాయను వాడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లోనే ఉల్లిపాయతో DIY హెయిర్ ఆయిల్‌ను తయారు చేసుకుని మీరు కూడా వాడేయండి.
హెయిర్ కేర్
హెయిర్ కేర్

హెయిర్ కేర్

Onion Juice Benefits : జుట్టు వివిధ సమస్యల వల్ల రాలిపోతుంది. ఎన్ని షాంపూలు మార్చినా.. ఎన్ని కొత్త ప్రొడక్ట్స్ ట్రై చేసినా.. ఒక్కోసారి జుట్టు రాలడం ఆగదు. అలాంటి సమయంలో ఉల్లి చేసే మేలు మీరు మరచిపోలేరు అంటున్నారు నిపుణులు. అందుకే మీ హెయిర్​ సంరక్షణలో భాగంగా ఉల్లిపాయను చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Night Shift Effect : ఎక్కువగా నైట్ షిఫ్ట్‌లో పని చేస్తే ఈ సమస్య.. పాటించాల్సిన చిట్కాలు

Chia Seeds Benefits : చియా విత్తనాల ప్రయోజనాలు తెలుసుకోండి.. ఒక్క రోజులో ఎన్ని తివవచ్చు?

Pregnancy Tips : గర్భధారణలో సమస్యలను సూచించే సంకేతాలు, లక్షణాలు ఇవే

Baby First Bath : శిశువుకు మెుదటిసారి స్నానం చేయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

చుండ్రు తగ్గడానికి..

చుండ్రు అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా సంభవించే సాధారణ జుట్టు సమస్య. ఇది స్కాల్ప్​కు దురద, చికాకు కలిగిస్తుంది. హెయిర్ ఫోలికల్స్‌ను అడ్డుకోవడం ద్వారా జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది. ఉల్లిపాయలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు, ఇతర స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌లను నియంత్రించడంలో సహాయం చేస్తాయి. అంతేకాకుండా ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

జుట్టు రాలడాన్ని నివారిస్తుంది

ఉల్లిపాయలు అధిక పరిమాణంలో సల్ఫర్‌తో నిండి ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని, జుట్టు పల్చబడడాన్ని నిరోధిస్తాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఉల్లిపాయలలోని సల్ఫర్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. ఉల్లిపాయలో ఉండే క్యాటలేస్ అనే ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్ జుట్టు పెరుగుదలను పెంచడంలో సహాయం చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి.. జుట్టు మీద ఉల్లిపాయ రసంతో మసాజ్ చేయాలి.

జుట్టు నెరసిపోవడాన్ని నివారిస్తుంది..

మీ జుట్టు అకారణంగా తెలుపు రంగులో మారిపోవడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ కారణం. ఉల్లిపాయలలో ఉత్ప్రేరకము సమృద్ధిగా ఉండుట వలన.. జుట్టు మూలాలలోని హైడ్రోజన్ పెరాక్సైడ్ స్థాయిని తగ్గించి జుట్టు నెరిసిపోకుండా చేస్తుంది. ఇది మీ జుట్టును సహజంగా నల్లగా చేస్తుంది. అంతేకాకుండా దానికి మెరుపును ఇస్తుంది. నిమ్మరసంలో ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేస్తే అద్భుతం ఫలితాలు కనిపిస్తాయి.

జుట్టుకు పోషణకోసం..

మీకు పొడి, పెళుసైన జుట్టు ఉంటే.. ఉల్లిపాయలు మీ మంచి రక్షణగా పనిచేస్తాయి. ఎందుకంటే వాటిలోని సూక్ష్మపోషకాలు, అవసరమైన సమ్మేళనాలు మీ జుట్టును పోషించి.. తేమను ఇస్తాయి. ఉల్లిపాయలు క్వెర్సెటిన్, కెంప్ఫెరోల్ వంటి ఫ్లేవనాయిడ్లతో నిండి ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, వాసోడైలేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జుట్టు మూలాలకు రక్త సరఫరాను పెంచుతాయి. ఇది హెయిర్ ఫోలికల్స్ పెరగడానికి అవసరమైన ఆర్ద్రీకరణను అందిస్తుంది. మెరుగైన ఫలితాల కోసం ఉల్లిపాయలను వాడడం తప్పులేదు కానీ.. వాటిని ఉపయోగించే ముందు మీ డాక్టర్​ని సంప్రదించడం మరిచిపోకండి.

టాపిక్

తదుపరి వ్యాసం