తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  సెప్టెంబర్ 25 నుండి Neet Ug కౌన్సెలింగ్.. అవసరమైన డాక్యుమెంట్లు ఇవే..!

సెప్టెంబర్ 25 నుండి NEET UG కౌన్సెలింగ్.. అవసరమైన డాక్యుమెంట్లు ఇవే..!

HT Telugu Desk HT Telugu

19 September 2022, 15:06 IST

    • NEET UG Counselling 2022: మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, NEET UG కౌన్సెలింగ్ 2022 షెడ్యూల్‌ను అతి త్వరలో విడుదల చేయనుంది. 
NEET UG Counselling 2022
NEET UG Counselling 2022

NEET UG Counselling 2022

మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, NEET UG కౌన్సెలింగ్ 2022 షెడ్యూల్‌ను అతి త్వరలో విడుదల చేయనుంది. తాజా అప్‌డేట్ ప్రకారం, MCC NEET UG కౌన్సెలింగ్ సెప్టెంబర్ 25, 2022 నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారిక వెబ్‌సైట్ - mcc.nic.inలో విడుదల చేయబడతాయి.

ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన NEET UG కౌన్సెలింగ్ 2022, AIQ అడ్మిషన్ త్వరలో ప్రారంభం కానున్నాయి. NEET 2022లో మెరిట్ సాధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వైద్య కళాశాలల్లో అడ్మిషన్ పొందేందుకు వివిధ రౌండ్‌లలో నిర్వహించే MCC NEET కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అర్హులు. NEET UG కౌన్సెలింగ్ 2022 ప్రారంభానికి ముందు, అడ్మిషన్‌కు సంబందించిన దరఖాస్తులు ఆలస్యం జరగకుండా ఉండేందుకు అభ్యర్థులు తమ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. ప్రతి రౌండ్ తర్వాత, సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల చేయబడతాయి.

NEET UG కౌన్సెలింగ్ 2022 తేదీల కోసం దేశవ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. , జూలై 17, 2022న జరిగిన నీట్ UG పరీక్షకు 17 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

అవసరమైన డాక్యుమెంట్స్

- నీట్ హాల్ టికెట్

- నీట్ ర్యాంక్ కార్డ్

- పుట్టిన తేదీ సర్టిఫికేట్

- కుల ధృవీకరణ సర్టిఫికేట్

- 10, 12వ తరగతి మార్క్‌షీట్

- ఆడ్రస్ ఫ్రూప్

- క్యారెక్టర్ సర్టిఫికేట్

- మైగ్రేషన్ సర్టిఫికేట్

- మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్

తదుపరి వ్యాసం