తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nature Break: ఒత్తిడిని అధిగమించాలా? రోజూ 20 నిమిషాలు ఇలా చేయండి చాలు..

Nature Break: ఒత్తిడిని అధిగమించాలా? రోజూ 20 నిమిషాలు ఇలా చేయండి చాలు..

HT Telugu Desk HT Telugu

03 September 2023, 17:59 IST

  • Nature Break: ప్రకృతిలో గడపడం వల్ల రోజూవారీ లైఫ్ స్టైల్ వచ్చే ఒత్తిడి అధిగమించొచ్చట. ఆ వివరాలేంటో తెలుసుకోండి.

ప్రకృతిలో నడక
ప్రకృతిలో నడక (pexels)

ప్రకృతిలో నడక

బిజీ బిజీ జీవితాల్లో మనం ప్రకృతికి దూరమైపోతున్నాం. కాంక్రీటు జంగిల్లలో మనం పచ్చదనానికి చేరువ కాలేకపోతున్నాం. ఆ కారణం వల్లే మనలో చెప్పలేనంత ఒత్తిడి. దాని వల్ల వచ్చే ఎన్నో అనారోగ్యాలు. రోజూ ప్రకృతిలో ఓ 20 నిమిషాల పాటు ప్రశాంతంగా గడిపి చూడమంటున్నాయి అధ్యయనాలు. అందువల్ల శరీరంలో స్ట్రెస్‌ హార్మోన్‌ స్థాయిలు తగ్గుతాయంటున్నాయి. ఫలితంగా మనమంతా ఒత్తిడి నుంచి బయటపడగలమని చెబుతున్నాయి. శాస్త్రవేత్తలు, సైకాలజీ నిపుణులు కలిసి చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

National Dengue day 2024: డెంగ్యూను ‘ఎముకలు విరిచే జ్వరం’ అని ఎందుకు పిలుస్తారు? డెంగ్యూ వస్తే వెంటనే ఏం చేయాలి?

Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

ముందుగా శాస్త్రవేత్తలు 36 మందిని వారంలో మూడు రోజుల పాటు కచ్చితంగా ఓ పది నిమిషాలు పార్కులు, పచ్చని ప్రదేశాల్లో అలా గాలిని ఆస్వాదిస్తూ గడిపి రమ్మని చెప్పారు. ప్రకృతిని పరిశీలిస్తూ దానిలోని చిన్న చిన్న అద్భుతాలను చూసి ఆనందించమని సూచించారు. ఇష్టమైతే వాకింగ్‌ చేయమన్నారు. లేదంటే జస్ట్‌ అలా పచ్చదనాన్ని ఆస్వాదించి రమ్మని చెప్పారు. అలా ఎనిమిది వారాల పాటు వారిని ఈ పని చేయమన్నారు. తర్వాత వారిలోని ఉమ్ము నుంచి శాంపుల్స్‌ తీసుకున్నారు. కోర్టిసోల్‌ అనే స్ట్రెస్‌ హార్మోన్‌ ఏ స్థాయిలో ఉందో పరిశీలించారు. అంతకు ముందుతో పోలిస్తే ఆ తర్వాత అందరిలోనూ దీని స్థాయి తగ్గినట్లుగా గుర్తించారు.

మళ్లీ కొన్ని రోజుల తర్వాత ఈ సారి ఒక్కొక్కరినీ 20 నుంచి 30 నిమిషాల పాటు ఇలా ప్రకృతిలో గడిపి రమ్మన్నారు. వారంలో మూడు రోజుల పాటు కచ్చితంగా ఈ పని చేయమన్నారు. ఓ ఎనిమిది వారాల తర్వాత మళ్లీ వారి కోర్టిసోల్‌ లెవెల్స్‌ని పరీక్ష చేశారు. ఈ సారి ఇంతకు ముందు కంటే భారీగా ఆ స్ట్రెస్‌ హార్మోన్‌ స్థాయిలు వారిలో తగ్గడాన్ని గుర్తించారు.

రోజూ ఉండే ఒత్తిడే కదా అని తేలిగ్గా తీసుకుంటే అది ఆ తర్వాత పెద్ద పెద్ద మానసిక, శారీరక సమస్యలకు దారి తీస్తుంది. అందుకనే చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా రోజులో కనీసం 20 నిమిషాలపాటు ప్రకృతితో మమేకమై గడిపి రమ్మని వారు సలహా ఇస్తున్నారు. ఏ మాత్రం ఖర్చు లేని ఈ చిన్న పని వల్ల మన ఆరోగ్యంపై ఎంతో సానుకూల ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. సమయం లేదు అనుకోకుండా మన కోసం మనం ఈ సమయాన్ని కేటాయించుకోవాలని సూచిస్తున్నారు. పెద్ద కష్టం ఏం లేదు కదా. పాటిస్తే మంచే తప్ప పోయేదేముంది చెప్పండి.

తదుపరి వ్యాసం