తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nabard Jobs: నాబార్డ్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

NABARD jobs: నాబార్డ్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

HT Telugu Desk HT Telugu

21 July 2022, 15:27 IST

    • NABARD Recruitment 2022: నాబార్డ్ వివిధ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు 7 ఆగస్టు 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
NABARD Recruitment 2022
NABARD Recruitment 2022

NABARD Recruitment 2022

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) వివిధ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం ఖాళీల సంఖ్య 170. ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 7 ఆగస్టు 2022 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు NABARD వెబ్‌సైట్‌ nabard.orgను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నాబార్డ్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మొదటి దశ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్షను 7 సెప్టెంబర్ 2022న నిర్వహించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ -18-07-2022

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ -07-08-2022

NABARD రిక్రూట్‌మెంట్ ఖాళీల వివరాలు - NABARD ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 170 ఖాళీలకు ఎంపిక చేయనున్నారు. ఇందులో 161 పోస్ట్‌లు అసిస్టెంట్ మేనేజర్ (RDBS), 7 పోస్ట్‌లు AM (రాజ్‌భాష) కోసం కెటాయించారు. ఇది కాకుండా అసిస్టెంట్ మేనేజర్ (P&SS) కోసం రెండు ఖాళీలు ఉన్నాయి.

వయోపరిమితి - NABARD రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.కానీ అసిస్టెంట్ మేనేజర్ (P&SS) వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము: NABARD AM రిక్రూట్‌మెంట్‌ అభ్యర్థులకు దరఖాస్తు రుసుముగా రూ.800 డిపాజిట్ చేయాలి. రాజభాషకు రూ. 750 అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి

NABARD AM ఖాళీల అధికారిక నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి-

తదుపరి వ్యాసం