తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  నెలకు రూ. 1,000 పెట్టుబడితో మిలియనీర్‌గా మారే ఛాన్స్.. వివరాలివే!

నెలకు రూ. 1,000 పెట్టుబడితో మిలియనీర్‌గా మారే ఛాన్స్.. వివరాలివే!

HT Telugu Desk HT Telugu

11 April 2022, 21:45 IST

    • డబ్బు ఆదా చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆదా చేసిన డబ్బును పెట్టుబడి మలిచి వాటి నుండి ఎక్కువ ఆదాయాన్ని పొందాలని చూస్తారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చుల కారణంగా డబ్బును ఆదా చేయడం అంతా సులువైన విషయం కాదు.
investment plan
investment plan

investment plan

డబ్బు ఆదా చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆదా చేసిన డబ్బును పెట్టుబడి మలిచి వాటి నుండి ఎక్కువ ఆదాయాన్ని పొందాలని చూస్తారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చుల కారణంగా డబ్బును ఆదా చేయడం అంతా సులువైన విషయం కాదు. అయితే వారి కోసం మ్యూచువల్ ఫండ్ పథకాలు మంచి ఆప్షన్‌గా ఉన్నాయి. కనీసం నెలకు రూ. 1,000 వరకు పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. మంచి రిటర్న్స్ వస్తే లక్షాధికారిగా మారవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ఎలా ఆదా చేయాలో తెలుసుకోండి మరీ.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్‌లో పొదుపు చేయవచ్చు. అంటే ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా మంచి రిటర్న్స్ పొందవచ్చు. ఏదైనా మ్యూచువల్ ఫండ్ పథకంలో నెలకు రూ. 1,000 చొప్పున దీర్ఘకాలిక పొదుపు మంచి రాబడిని తెస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ ఏడాదికి సగటున 15 శాతం ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్ల పాటు నెలకు రూ.1,000 పొదుపు చేస్తే రూ.70 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందవచ్చు.

Mutual Fund Step Up SIP

మ్యూచువల్ ఫండ్ కంపెనీలు స్టెప్ అప్ ఎస్ఐపి( Step Up SIP ) అనే ప్రత్యేక ఫీచర్‌ను అందిస్తున్నాయి. స్టెప్ అప్ అంటే ఏడాది తర్వాత మీ పొదుపును కొంత శాతానికి పెంచుకోవాలి. ఉదాహరణకు మీరు మొదటి సంవత్సరం నెలకు రూ. 1,000 ఆదా చేయాలనుకుంటే ప్రతి సంవత్సరం 5 శాతం స్టెప్-అప్‌ని ఎంచుకోవచ్చు.

5% స్టెప్ అప్ ఆప్షన్‌తో, రెండవ సంవత్సరంలో మీ పొదుపు దాదాపు రూ. 1,050 అవుతుంది. మీరు 10 శాతం స్టెప్-అప్ ఎంపికను ఎంచుకుంటే, మీరు రెండవ సంవత్సరానికి నెలకు రూ. 1,100 చెల్లించాల్సి ఉంటుంది.

గమనిక: ఇది డబ్బు ఆదా, పెట్టుబడి సలహా మాత్రమే.. మీరు పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల నుండి సలహా తీసుకోవాలి.

టాపిక్

తదుపరి వ్యాసం