తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Menstrual Health: ఈ 5 తప్పులు చేస్తే పీరియడ్స్ ఆలస్యం అవుతాయి

Menstrual health: ఈ 5 తప్పులు చేస్తే పీరియడ్స్ ఆలస్యం అవుతాయి

24 February 2023, 17:04 IST

    • Menstrual health: పీరియడ్స్ ఆలస్యంగా గానీ, త్వరగా గానీ వస్తున్నాయా? అయితే మీరు చేసే ఈ 5 తప్పులు గుర్తించాలని న్యూట్రీషనిస్ట్ చెబుతున్నారు.
పీరియడ్స్ ఆలస్యమవుతున్నాయా?
పీరియడ్స్ ఆలస్యమవుతున్నాయా? (Pexels)

పీరియడ్స్ ఆలస్యమవుతున్నాయా?

మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించి పీరియడ్స్ చాలా ముఖ్యమైన సూచిక. క్రమం తప్పకుండా పీరియడ్స్ రావడం ఆరోగ్య సంకేతం. అయితే విభిన్న వ్యక్తుల్లో ఈ రుతుచక్రం విభిన్నంగా ఉంటుంది. 25 రోజుల నుంచి 35 రోజుల మధ్య పీరియడ్స్ రావడం సాధారణ పరిధిగానే పరిగణిస్తారు. హార్మోన్ల విడుదల సక్రమంగానే ఉన్నట్టు భావిస్తారు. పీరియడ్స్ చాలా త్వరగా రావడం, లేదా బాగా ఆలస్యం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన, ఔషధాలు, తినే ఆహారం ప్రధానంగా ప్రభావం చూపిస్తాయి. మీరు తినే ఆహారం మీ రుతుచక్రంపై ఏవిధమైన ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

ట్రెండింగ్ వార్తలు

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

న్యూట్రీషనిస్ట్, సర్టిఫైడ్ డయాబెటిస్ ఎడ్యుకేటర్ మేవిష్ ఖాన్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంబంధిత అంశాలను వివరించారు. ముఖ్యంగా డైట్‌లో మనం చేసే ఏయే తప్పుల కారణంగా పీరియడ్స్ ఆలస్యమవుతాయో వివరించారు.

1. Wrong combination of foods: తప్పుడు కాంబినేషన్ గల ఆహారం

కొన్ని రకాల ఆహారాలను కలిపి తినడం వల్ల అది అనారోగ్యానికి దారితీస్తుంది. మనం తినే ఆహారం మన జీర్ణ క్రియకు తోడ్పడేలా, పోషకాల శోషణకు తోడ్పడేలా ఉండాలి. కానీ కొన్ని తప్పుడు కాంబినేషన్లలో ఆహారం ఈ ప్రక్రియను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా లంచ్ తరువాత పండ్లు తినడం, బ్రేక్‌ఫాస్ట్‌తో టీ తాగడం వల్ల అవసరమైన పోషకాల శోషణ నిలిచిపోతుంది. క్రమం తప్పకుండా పీరియడ్స్ రావడానికి పోషకాలు అవసరమని గుర్తించండి.

2. Eating too much-processed food: మితిమీరిన ప్రాసెస్డ్ ఫుడ్

పోటీ తత్వం, మారిన జీవన శైలి కారణంగా ఇటీవలి కాలంలో ప్రాసెస్డ్ ఫుడ్ అమితంగా తినడం సాధారణమై పోయింది. అధిక క్యాలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరస్థాయి అధికంగా ఉండడం వల్ల ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అధిక బరువుకు కారణమవుతుంది. అంతేకాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అమాంతం పెంచేస్తుంది. ఈ కారణంగా రుతు చక్రంలో అవసరమైన హార్మోన్లు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ విడుదలపై ప్రభావం చూపుతాయి.

3. Skipping meals: భోజనం చేయకపోవడం

తీరిక లేని జీవనశైలి, జంక్‌ ఫుడ్‌తో సరిపెట్టడం, భోజనం చేయకపోవడం వల్ల జీవక్రియ దెబ్బతింటుంది. ఇది తరువాత అమితమైన ఆహారం తీసుకోవడానికి దారితీస్తుంది. దీర్గకాలంలో ఇది విటమిన్ల లోపానికి దారితీస్తుంది. ముఖ్యంగా బీ12, డీ3 విటమిన్లు, జింక్ ఆరోగ్యకరమైన రుతు చక్రానికి అత్యంత అవసరం.

4. Not working on nutrient deficiencies: పోషకాల లోపంపై దృష్టి పెట్టకపోవడం

విటమిన్ల లోపం ఉన్నప్పుడు కేవలం సప్లిమెంట్లు, మందులపై ఆధారపడడం సరికాదు. పోషకాల లోపాన్ని సమతుల ఆహారం ద్వారా నివారించాలి. అంటే పోషకాలు దండిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. విటమిన్ల లోపం ఉందని మీకు అనిపిస్తే మీ వైద్యుడిని సంప్రదించి కారణాలు తెలుసుకోండి. అవసరమైన సలహాలు తీసుకోండి. తగిన విధంగా డైట్ మార్చుకోండి.

5. Not eating enough fruits and vegetables: పండ్లు, కూరగాయల వినియోగం తగ్గడం

పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోకపోవడం కూడా తప్పే అవుతుంది. పోషకాలు దండిగా ఉండే వీటిని తీసుకుంటే హార్మోనల్ సమస్యలు తగ్గుతాయి. పేగులో ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్ మీ సంపూర్ణ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది రుతు చక్రం సవ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. ఫైబర్‌తో సహా పోషకాలు కలిగి ఉన్న సమతుల ఆహారం తీసుకోవడం మరిచిపోవద్దు. యోగర్ట్, ఉసిరి చట్నీ వంటి ప్రొబయోటిక్ గల ఆహారం కూడా ప్రయోజనకరమే.

తదుపరి వ్యాసం