తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Love At First Sight : కళ్లు కళ్లు ప్లస్.. తొలిచూపులోనే ప్రేమలో పడిపోయారని చెప్పే సంకేతాలివే

Love At First Sight : కళ్లు కళ్లు ప్లస్.. తొలిచూపులోనే ప్రేమలో పడిపోయారని చెప్పే సంకేతాలివే

HT Telugu Desk HT Telugu

02 October 2023, 14:00 IST

    • Love At First Sight : తొలి చూపులోనే ప్రేమలో పడిపోతారా? చాలా మందికి అనుమానమే కదా. కాని కొన్నిసార్లు మెుదటిచూపులోనే మనసులు మార్చేసుకునేవారు ఉన్నారు. కొందరు వన్ సైడ్ ప్రేమలో పడిపోయేవారూ ఉన్నారు. దీనికి కొన్ని సంకేతాలు ఉన్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

సినిమాల్లో హీరో పరిగెడుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఆగిపోతాడు. హీరోయిన్‍ను చూసిన క్షణంలో హీరో తన మనసును పారేసుకుంటాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆ క్షణంలోనే నిర్ణయించుకుంటాడు. ఇలానే చాలా సినిమాల కథ కొనసాగుతుంది. అయితే నిజ జీవితంలో ఇది సాధ్యమేనా? మొదటి చూపులో ప్రేమ నిజ జీవితంలోనూ జరుగుతుంది. తొలి చూపులో ప్రేమలో పడినప్పుడు మనసు వీణలు వాయిస్తుంది. ఏదో తెలియని మైకం నిజంగానే మిమ్మల్ని కమ్మేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Tired After Sleeping : రాత్రి బాగా నిద్రపోయినా.. ఉదయం అలసిపోవడానికి కారణాలు

Foxtail Millet Benefits : మీకు ఉన్న అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు కొర్రలు చాలు

Egg potato Fry: పిల్లలకు నచ్చేలా కోడిగుడ్డు ఆలూ ఫ్రై రెసిపీ, చిటికెలో వండేయచ్చు

Mango eating: ఆయుర్వేదం ప్రకారం మామిడిపండ్లను తినాల్సిన పద్ధతి ఇది, ఇలా అయితేనే ఆరోగ్యానికి ఎంతో మంచిది

మీకు ఎదురుగా ఉన్న వ్యక్తి గురించి మీకు ఏమీ తెలియనప్పుడు, వారి ప్రవర్తన మిమ్మల్ని పిచ్చొళ్లను చేస్తుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద సైన్స్, సైకాలజీలో చర్చ కొనసాగుతోంది. మొదటి చూపులో ప్రేమ కుదరదని, ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియనప్పుడు మనం ప్రేమలో ఎలా పడతామని చాలా మంది ప్రశ్నిస్తారు. కానీ మెుదటి చూపులోనే ప్రేమ పుట్టి.. పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. తొలి చూపులో ప్రేమ అనేది కూడా నిజం, అది పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

తొలి చూపులోనే ప్రేమకు సంకేతాలు ఇవే..

తొలి చూపులోనే ప్రేమలో పడినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. మనసులో అలజడి నెలకొంటుంది. ఇది మీ ఆకర్షణ కూడా కావచ్చు. దీన్నే ఈ మధ్య క్రష్ అని కూడా అంటున్నారు. కానీ కొందరు తొలి చూపులోనే నిజంగానే ప్రేమిస్తారు. సినిమాల్లో చూపించినట్టుగా చుట్టుపక్కల అంతా మాయం అవ్వదు.. కానీ పక్కన ఉన్న వారిని పట్టించుకోం.

మెుదటి చూపులో నచ్చిన వ్యక్తి గురించే చాలా సేపు మీ ఆలోచన ఉంటుంది. మీ మనసులో ఆ వ్యక్తి మాత్రమే ఉంటారు. మొదటి చూపులోనే మీరు ప్రేమలో పడితే, ఆ వ్యక్తి మీ మనసులో ఎల్లకాలం నిలిచిపోతారు. మీ ప్రతి ఆలోచనలో అది మాత్రమే కనిపిస్తుంది. మీరు వారి గురించి ఆలోచించడానికి ఇష్టపడతారు. మీ సన్నిహితుల దగ్గర కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తారు.

మీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మనిషి మీ ఆలోచనల్లోకి వస్తే నవ్వుతారు. వారి గురించి ఆలోచించినప్పుడల్లా ముసిముసి నవ్వులు వస్తాయి. వారి గురించి మాత్రమే ఆలోచించడానికి ఇష్టపడతారు. ఆ ఆలోచనలతో ఓ ప్రపంచాన్ని సృష్టించుకుంటారు.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆ వ్యక్తి గురించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలని ఆరాటపడతారు. ఆందోళన కూడా చెందుతారు. వారి గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటుంది మీ మనసు. వీలైనంత త్వరగా వారిని కలవాలనుకుంటున్నారు. ఎవరు, ఎక్కడ నివసిస్తున్నారు, ఏం చేస్తారు.. ఇలా ప్రతిదీ తెలుసుకునేందుకు ఎంక్వైరీ చేస్తారు.

తొలి చూపులో నచ్చిన వ్యక్తి దగ్గరలోకి వెళ్లి.. ఏదో ఒక పని చేసి దృష్టిని ఆకర్శించాలనుకుంటారు. పక్కనే మీ ప్రెండ్స్ ఉంటే వారిని వాడుకుంటారు. మీ వైపు తిరిగి చూసేందుకు జోకులు వేస్తారు. ఒకవేళ వెళ్లిపోతుంటే ఫాలో అవుతూ కూడా ఉంటారు.

తదుపరి వ్యాసం