తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Low-carb Vegetables । పిండిపదార్థం తక్కువ ఉండే కూరగాయలు ఇవే, వీటిని ఎందుకు తినాలంటే?!

Low-Carb Vegetables । పిండిపదార్థం తక్కువ ఉండే కూరగాయలు ఇవే, వీటిని ఎందుకు తినాలంటే?!

HT Telugu Desk HT Telugu

29 June 2023, 10:03 IST

    • Low-Carb Vegetables: పిండిపదార్థం లేని కూరగాయలు లేదా తక్కువ పిండిపదార్థం కలిగిన కూరగాయలను తినడం ద్వారా, ఫైటోకెమికల్స్‌ను పెంచవచ్చు. పిండిపదార్థాలు లేని కూరగాయల జాబితా ఇక్కడ తెలుసుకోండి.
Low-Carb Vegetables
Low-Carb Vegetables (istock)

Low-Carb Vegetables

Low-Carb Vegetablesఆరోగ్యంగా జీవించాలంటే తాజా పండ్లు, కూరగాయలు తింటూ ఉండాలి అని చెప్తుంటారు. అయితే ఈ సూత్రం అందరికీ వర్తించకపోవచ్చు, ఎందుకంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలను కలిగి ఉన్నప్పుడు తినే ఆహారం ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ కొన్ని పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు మధుమేహం నిర్వహణ విషయానికి వస్తే, వివిధ పోషకాలు, పిండి పదార్థాలు కలిగిన కూరగాయల కంటే, అసలు పిండిపదార్థాలే లేని కూరగాయలు ఆరోగ్యకరమైనవి.

ట్రెండింగ్ వార్తలు

New Broom Tips : కొత్త చీపురుతో ఇంట్లోకి దుమ్ము రావొచ్చు.. అందుకోసం సింపుల్ టిప్స్

Parenting Tips : కుమార్తెలు భయపడకుండా జీవించేందుకు తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు

Turmeric Water Benefits : వేడి నీటిలో పసుపు కలిపి తాగితే ఈ 7 సమస్యలు రాకుండా ఉంటాయి

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో 8 అంకెల మధ్య 3 అంకె దాక్కొని ఉంది, అదెక్కడుందో 10 సెకన్లలో కనిపెట్టండి

ప్రతి కూరగాయలో విభిన్న పోషకాలు, ఫైబర్ ఉంటాయి. అందులో కొన్ని ఇన్సులిన్ నిరోధకతకు మరింత ప్రభావవంతంగా ఉంటాయి తద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తక్కువగా ఉంచుతుంది. ఇలాంటి కూరగాయలను మధుమేహులు ఎంచుకోవాలి. పోషకాలు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగానే ఉన్నప్పటికీ ఆ కూరగాయలో పిండిపదార్థం ఎక్కువ ఉంటే గనక అది మధుమేహులకు చేటు మాత్రమే చేస్తుంది.

ఇదే విషయమై పోషకాహార నిపుణురాలు భక్తి అరోరా కపూర్ వివరించారు. డయాబెటీస్ సమస్య ఉన్నవారు పిండిపదార్థం లేని కూరగాయలు లేదా తక్కువ పిండిపదార్థం కలిగిన కూరగాయలను తినడం ద్వారా, ఫైటోకెమికల్స్‌ను పెంచవచ్చు. తద్వారా భోజనం తర్వాత తక్కువ రక్తంలో గ్లూకోజ్ , ఇన్సులిన్ ప్రతిస్పందన సాధారణంగా ఉంటుంది.

స్టార్చ్ లేని కూరగాయలు ఎలా మేలు చేస్తాయి

పిండిపదార్థాలు లేని కూరగాయలు పీచుపదార్థాన్ని నిండుగా కలిగి ఉంటాయి, పీచులో చక్కెర ఉండదు, అలాగే అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇటువంటి కూరగాయలు కేవలం 5 గ్రాములు లేదా అంతకంటే తక్కువ నికర కార్బోహైడ్రేట్‌లను కలిగి ఉంటాయి, మధుమేహులకు ఇవి ఇన్సులిన్ స్థాయిలను అదుపులో ఉంచడానికి ఉత్తమంగా పనిచేస్తాయని భక్తి ఆరోరా చెప్పారు.

ఎవరైనా సరే పిండి పదార్థాలు లేని లేదా తక్కువ ఉండే కూరగాయలనే ఎక్కువ తినాలి. ఎందుకంటే ఈ రకమైన కూరగాయల్లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి హృదయ సంబంధ వ్యాధులు, టైప్ 2 మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్‌లు, ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

పిండిపదార్థాలు లేని కూరగాయల జాబితా

పాలకూర, బచ్చలికూర, కాలే, రంగురంగుల క్యాప్సికమ్, కరకరలాడే సెలెరీ, ఉల్లిపాయలు, క్యాబేజీ, పొట్లకాయ జాతి కూరగాయలు, బ్రోకలీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ , బ్లాక్ సోయాబీన్స్, గ్రీన్ బీన్స్, ఆర్టిచోక్‌లు, క్యారెట్లు, ఆస్పరాగస్, వంకాయ, స్పఘెట్టి, బీన్ మొలకలు, దోసకాయలు, టర్నిప్‌లు, పుట్టగొడుగులు, అవకాడోలు వంటి కూరగాయల్లో పిండిపదార్థం తక్కువ ఉంటాయి. ఇన్సులిన్ నిరోధకతకు మేలైనవి. ఇవి వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

పిండిపదార్థం- చక్కెర ఎక్కువ ఉండే కూరగాయల జాబితా:

మొక్కజొన్న, చిలగడదుంపలు, ఆకుపచ్చ బటానీలు, పార్స్నిప్స్, గుమ్మడికాయ, కాసావా, బంగాళాదుంపలు ఎక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. అయితే వీటిని తినకూడదు అని చెప్పటం లేదు కానీ, మితంగా తినటానికి ప్రయత్నించాలి.

తదుపరి వ్యాసం