తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lava Blaze । మేడ్-ఇన్- ఇండియా స్మార్ట్‌ఫోన్‌.. ధర కేవలం రూ. 8 వేలు మాత్రమే!

Lava Blaze । మేడ్-ఇన్- ఇండియా స్మార్ట్‌ఫోన్‌.. ధర కేవలం రూ. 8 వేలు మాత్రమే!

HT Telugu Desk HT Telugu

07 July 2022, 15:56 IST

    • లావా మొబైల్స్ నుంచి ఆకర్షణీయమైన లావా బ్లేజ్ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. జూలై 14 నుంచి సేల్స్ ప్రారంభమవుతున్నాయి. ప్రీ-బుకింగ్ చేసుకున్న వారికి లావా ఇయర్ బడ్స్ ను కంపెనీ నుంచి ఉచితంగా అందిస్తున్నారు.
Lava Blaze
Lava Blaze

Lava Blaze

దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా మొబైల్స్ తాజాగా లావా బ్లేజ్ (Lava Blaze) పేరుతో ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది పూర్తిగా మేడ్- ఇన్- ఇండియా ప్రొడక్ట్. అంతేకాకుండా బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంటుంది. Lava Blaze ఒక ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్‌ అయినప్పటికీ డిజైన్ పరంగా ఈ ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఫీచర్లు కూడా మెరుగ్గానే ఉన్నాయి. దీని వెనక ప్యానెల్ గ్లాస్ బ్యాక్‌తో వచ్చింది. వెనకవైపున మౌంటెడ్ కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ట్రిపుల్-కెమెరా ఇమేజింగ్ సిస్టమ్ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

అలాగే ఇందులో మెరుగైన బ్యాటరీ, సరికొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, MediaTek Helio A22 ప్రాసెసర్ ఇచ్చారు. ఈ ప్రాసెసర్ పాతదే అయినప్పటికీ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లలో మంచి ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీ-బుకింగ్ జూలై 7 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 14, 2022 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. ప్రీ-బుకింగ్ కస్టమర్‌లకు Lava Probuds 21TWలను కంపెనీ ఉచితంగా అందిస్తుంది.

ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు అన్ని వివరాలు ఇక్కడ కింద పేర్కొన్నాం.

Lava Blaze స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 6.5 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే
  • 3 GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • MediaTek Helio A22 ప్రాసెసర్
  • వెనకవైపు 13 MP + 2x 0.2 MP AI కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్
  • ధర రూ. 8,699/-

కనెక్టివిటీ పరంగా Lava Blazeలో 4G, USB-C పోర్ట్‌, 3.5mm పోర్ట్‌, డ్యూయల్ సిమ్‌ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం