తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diet Trends In 2023: డైటింగ్‌ నామ సంవత్సరం.. ఈ ఏడాది ట్రెండ్‌లో ఉన్న 4 డైట్లు

Diet Trends in 2023: డైటింగ్‌ నామ సంవత్సరం.. ఈ ఏడాది ట్రెండ్‌లో ఉన్న 4 డైట్లు

20 December 2023, 10:00 IST

  • Diet Trends in 2023: ఈ ఏడాది ట్రెండింగ్‌లోకి కొన్ని రకాల డైటింగ్‌లు వచ్చాయి. వాటిలో బాగా ప్రాచుర్యం పొందినవాటి వివరాలు తెల్సుకుందాం. 

2023 డైటింగ్ ట్రెండ్స్
2023 డైటింగ్ ట్రెండ్స్ (freepik)

2023 డైటింగ్ ట్రెండ్స్

బరువు తగ్గడం అనేది అందరికీ పెద్ద పనే. వ్యాయామాలు.. తినే ఆహారంలో మార్పులు.. లాంటివి సర్వ సాధారణంగా ఈ ప్రయత్నంలో ఉన్నవారు చేస్తుంటారు. ఈ సందర్భంలో డైటింగ్‌ అనేది ఎప్పుడూ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. అయితే మునపటి రోజులతో పోలిస్తే ఈ ఏడాది డైటింగ్‌లో కొన్ని డైట్ల పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఈ ఏడాది ట్రెండింగ్‌ డైటింగ్‌ మోడళ్లుగా నిలిచాయి. అవేంటంటే..

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Men Skin Care Drinks : మెరిసే చర్మం కావాలంటే రోజూ ఉదయం వీటిలో ఏదో ఒకటి తాగండి

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

మెడిటేరియన్‌ డైట్‌ :

2023 సంవత్సరంలో ఎక్కువగా వినిపించిన డైట్‌ పేర్లలో మెడిటేరియన్‌ డైట్‌ ఒకటి. ఎక్కువ మొక్కల ఆధారిత ఆహారాలు, ఆరోగ్యకరమైన కొవ్వుల్ని ప్రధానంగా చేసుకుని ఈ డైటింగ్‌ చేస్తుంటారు. ప్రధానంగా నట్స్‌, ఆలివ్‌ ఆయిల్‌, చేపలు, చీజ్‌, రెడ్‌ మీట్‌ లాంటివి ఇందులో తరచుగా తినే ఆహారాలు. ఈ డైటింగ్‌ పేరు ఈ ఏడాదంతా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతూనే ఉంది. అనేక మంది డైటీషియన్లు దీనిపై వీడియోలు చేశారు. రెసిపీలను షేర్‌ చేశారు.

ఇంటర్మిటెన్‌ పాస్టింగ్‌ డైట్‌ :

ఇక ఈ ఏడాది ఎక్కువగా ప్రచారంలోకి వచ్చిన డైటింగ్‌ల్లో ఇంటర్మిటెన్‌ పాస్టింగ్‌ కూడా ఒకటి. ఇది ఎప్పటి నుంచో ఆచరణలో ఉన్నప్పటికీ ఈ ఏడాది దీనిపై ఎక్కువగా చర్చలు నడిచాయి. ఆచరించే వారూ ఎక్కువ అయ్యారు. విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ లాంటి ప్రముఖులు కూడా దీన్ని పాటిస్తున్నట్లు చెప్పేసరికి.. దీని మీద క్రేజ్‌ చాలా మందిలో పెరిగిపోయింది. ఈ డైట్‌లో ఉన్న వారు దాదాపుగా పది గంటల పాటు మాత్రమే తినడానికి వీలు ఉంటుంది. రోజులో మిగిలిన 14 గంటల సమయం ఏమీ తినకుండా ఉండాలి.

కీటో డైట్‌ :

పరిశోధకులు, వైద్యులు ఎక్కువగా సిఫార్సు చేసే డైట్లలో కీటో డైట్‌ ఒకటి. 1920ల నుంచీ దీన్ని అనుసరించే వారు ఉన్నారు. అయితే మరీ ముఖ్యంగా ఈ డైట్‌ పేరు ఈ ఏడాదంతా వినిపిస్తూనే ఉంది. ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా, పిండి పదార్థాలు తక్కువగా ఉండే డైట్‌ ఇది. బరువు తగ్గాలనుకునే వారు, దీర్ఘ కాలిక వ్యాధుల బారిన పడిన వారు దీన్ని పాటిస్తూ వస్తున్నారు.

వేగన్ డైట్‌ :

జంతువులు, పర్యావరణానికి తమ వల్ల ఎక్కువ దుష్ప్రభావాలు కలగకూడదనే శాంతియుతమైన ఆలోచనలను కల వారు ఎక్కువగా వేగన్‌లుగా మారడాన్ని మనం చూస్తూ ఉంటాం. వీరు మాంసాలు, జంతు సంబంధమైన పదార్థాలు వేటినీ ముట్టరు. కేవలం మొక్కల ఆధారంగా వచ్చే వాటిని మాత్రమే తింటారు. ఈ ఏడాది ఇలాంటి డైట్‌ చేసే వారి సంఖ్య కూడా పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి.

తదుపరి వ్యాసం