తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Under Eye Dark Circles: కళ్ల చుట్టూ నల్లటి వలయాలా.. ఈ ఆహారాలతో చెక్‌..

Under Eye Dark Circles: కళ్ల చుట్టూ నల్లటి వలయాలా.. ఈ ఆహారాలతో చెక్‌..

28 November 2023, 18:00 IST

  • Under Eye Dark Circles: కళ్ల కింద ఉన్నట్లుండి వచ్చిన నల్లటి వలయాలు అస్సలు తగ్గట్లేదా. అయితే ముందు ఆహారంలో కొన్ని సులభమైన మార్పులు చేసుకుని చూడండి. ఫలితం ఉంటుంది. 

కళ్లకింద నల్లటి వలయాలు
కళ్లకింద నల్లటి వలయాలు (pexels)

కళ్లకింద నల్లటి వలయాలు

కొంత మంది ముఖాన్ని చూడగానే కళ్ల చుట్టూ డార్క్‌ సర్కిల్స్‌ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. ఈ నల్లటి వలయాలు వారి ముఖ సౌందర్యాన్ని చెడగొడతాయి. సరిగ్గా నిద్ర లేకపోవడం, అలర్జీలు, జ్వరాలు వచ్చి తగ్గడం, హైపర్‌ పిగ్మంటేషన్‌, కళ్ల చుట్టూ చర్మం పల్చగా మారడం, ఐరన్‌ లోపం, ఎక్కువగా ఎండలో ఉండటం, ధూమపానం, థైరాయిడ్‌, సరిపడా నీరు తాగకపోవడం, జన్యుపరమైన కారణాల వల్ల ఇవి చాలా మందికి వస్తుంటాయి. అయితే ఆహారంలో కొన్ని మార్పుచేర్పులు చేసుకోవడం ద్వారా వీటిని తగ్గించుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

ట్రెండింగ్ వార్తలు

Brinjal in Pregnancy: గర్భిణులు వంకాయలు తినకూడదని ఆయుర్వేదం ఎందుకు చెబుతోంది?

National Dengue day 2024: డెంగ్యూను ‘ఎముకలు విరిచే జ్వరం’ అని ఎందుకు పిలుస్తారు? డెంగ్యూ వస్తే వెంటనే ఏం చేయాలి?

Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

నిమ్మ జాతి పండ్లు తినాలి :

కళ్ల చుట్టూరా నల్లటి వలయాలతో ఇబ్బందులు పడేవారు ఎక్కువగా సీ విటమిన్‌ ఉండే ఆహార పదార్థాలను తినాలి. విటమిన్‌ సీ అనేది ఫ్రీ రాడికల్స్‌ నుంచి కణాలను రక్షించి ఇలాంటి వాటి నుంచి కాపాడుతుంది. అందుకు నిమ్మ, ఉసిరి, క్యాప్సికం, కివి, బెర్రీలు, కమలాపండ్లు, జామకాయలు లాంటి వాటిని రోజూ తీసుకుంటూ ఉండాలి. అలాగే లైకోపీన్‌ అనేది మన చర్మాన్ని పిగ్మంటేషన్‌ నుంచి కాపాడుతుంది. ఇది టమోటాలు, పుచ్చ కాయలు, క్యాప్సికం, క్యారెట్లు, జామ కాయలు తదితరాల ద్వారా పుష్కలంగా లభిస్తుంది.

ఆకు కూరలు ఎంతో అవసరం :

శరీరంలోని కణ జాలాలు అన్నింటికీ పుష్కలంగా ఆక్సిజన్‌ సరఫరా కావాలంటే ఐరన్‌ సరిపడనంతగా ఉండాలి. ఇది పాల కూర, బచ్చలి, గుమ్మడి గింజలు, ఎండు ద్రాక్ష, పప్పు ధాన్యాలు, ఆకు కూరల్లో పుష్కలంగా లభిస్తుంది.

అలాగే కళ్ల కింద నలుపుల్ని తగ్గించడంలో విటమిన్‌ ఈ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొద్దు తిరుగుడు గింజలు, బాదాం, అవకాడో, వేరు శెనగ గింజలు, బంగాళ దుంప లాంటి వాటిని తినడం వల్ల ఇది సమృద్ధిగా మనకు లభిస్తుంది.

ప్రశాంతమైన నిద్ర కావాలి :

పాడైపోయిన కణజాలాలను బాగు చేయడంలో విటమిన్‌ కే అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆకు కూరలు, బ్రోకలీ, క్యాబేజ్‌, లెట్యుస్‌ లాంటి వాటిని రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చర్మం బాగవుతుంది. ఇలాంటి ఆహారాలను తీసుకుంటూ ముఖాన్ని మంచి క్లెన్సర్‌తో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తినే ప్రయత్నం చేయాలి. రోజుకు కనీసం మూడు లీటర్ల వరకు నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే సాయంత్రం ఆరు, ఏడింటికి రాత్రి భోజనాన్ని పూర్తి చేసేయాలి. ఎనిమిది గంటల పాటు ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఆహారాల్లో అలవాట్లలో ఈ మార్పులు చేసుకోవడం వల్ల కళ్లకింద వలయాలు చెప్పుకోదగ్గ రీతిలో తగ్గుముఖం పడతాయి.

తదుపరి వ్యాసం