తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  5 Essential Tips For A Healthy Heart: సీజన్ మారింది.. మీ గుండె పదిలం చేయండిలా

5 essential tips for a healthy heart: సీజన్ మారింది.. మీ గుండె పదిలం చేయండిలా

HT Telugu Desk HT Telugu

22 February 2023, 11:48 IST

    • 5 essential tips for a healthy heart: సీజన్‌కు అనుగుణంగా మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారిచ్చే టిప్స్, జాగ్రత్తలు పాటిస్తూ గుండె జబ్బుల ముప్పు నుంచి కాపాడుకోండి.
సీజన్ మారినప్పుడు మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణుల సూచనలు
సీజన్ మారినప్పుడు మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణుల సూచనలు (Image by InspiredImages from Pixabay )

సీజన్ మారినప్పుడు మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణుల సూచనలు

వసంత కాలం అన్ని కాలాల్లో కంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. సున్నితంగా తాకే గాలి, రంగురంగుల పువ్వులు, పచ్చని చెట్లు, వెచ్చని సూర్యరశ్మి మీ మనస్సును ఉల్లాసంగా ఉంచుతాయి. ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. చలికాలంలో కదలిక లేకుండా జీవితం గడిపిన వారు కాస్త నడకకు, ఆరు బయట తిరిగేందుకు ఈ వసంత రుతువులో ఇష్టపడతారు. తేలికపాటి వ్యాయామాలు ప్రారంభించడానికి కూడా ఇది అనువైన సమయం. ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఉండే ఈ వాతావరణం సుదీర్ఘ నడకకు అనువైనది. వ్యాయామం, పౌష్టికాహారం, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడం కూడా మీ గుండెకు మేలు చేస్తుంది. అయితే చాలాకాలం తరువాత ఒక్కసారిగా వ్యాయామాన్ని పెంచడం మీ గుండెపై భారం పెంచుతుంది. అందువల్ల వ్యాయామాన్ని నెమ్మదిగా పెంచాలి. అప్పుడే గుండె జబ్బుల నుంచి ముప్పు తగ్గుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Bad Food Combinations: ఆయుర్వేదం ప్రకారం తినకూడని ఫుడ్ కాంబినేషన్లు ఇవే

Fatty liver in diabetics: ఫ్యాటీ లివర్.. డయాబెటిస్, ఊబకాయం ఉన్న వారిలో ఇది కామన్

Mutton Curry: పచ్చిమామిడి మటన్ కర్రీ స్పైసీగా వండుకుంటే అదిరిపోతుంది

Ayurvedam Tips: నానబెట్టిన కిస్‌మిస్‌లు, కుంకుమ పువ్వును కలిపి తినమని చెబుతున్న ఆయుర్వేదం, అలా తింటే ఏం జరుగుతుందంటే

‘వసంత కాలం సమీపించగానే హార్ట్ అటాక్ రేటు 15 శాతం పెరగడం చాలా అధ్యయనాల్లో చూశాం. కదలిక లేని చలికాలం జీవితం నుంచి చురుకైన జీవితానికి మారడం వల్ల ఇలా జరగొచ్చు. దీనిని నివారించేందుకు వ్యాయామాన్ని క్రమపద్ధతిలో పెంచుతూ పోవాలి. అలాగే పోషకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి..’ అని నవీ ముంబై అపోలో హాస్పిటల్ ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజీ కన్సల్టెంట్ డాక్టర్ చరణ్ రెడ్డి వివరించారు. ఈ సమయంలో వార్షిక లిపిడ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె జబ్బుల ముప్పును తెలుసుకోవచ్చని వివరించారు.

వసంత కాలంలో చురుగ్గా, మీ గుండె ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన టిప్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ చరణ్ రెడ్డి సూచించారు.

1. Stay hydrated: తగినంత నీరు తీసుకోండి

తగినంత నీటిని తాగడం ద్వారా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో నుంచి మలినాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేందుకు నీరు అవసరం. తగినంత నీరు తాగడం వల్ల మీ గుండె తన విధులను సక్రమంగా నిర్వర్తించగలుగుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తప్పక తీసుకోవాలి.

2. Exercise regularly: క్రమం తప్పకుండా వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. మీ గుండె పటిష్టంగా ఉంటుంది. మీ సంపూర్ణ ఆరోగ్యానికి భరోసా ఉంటుంది. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి.

3. Eat healthy: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

మీ గుండె చక్కగా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన, సమతులమైన ఆహారం తీసుకోవాలి. యాంటిఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజలవణాలు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఫ్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్, సోడియం వంటివి మీ గుండెకు ముప్పు తెచ్చిపెడతాయి.

4. Manage stress: ఒత్తిడి తగ్గించుకోండి

ఒత్తిడి మీ గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మీ ఒత్తిడిస్థాయిలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీకు ఉల్లాసాన్ని ఇచ్చే కార్యకలాపాల్లో పాలుపంచుకోండి. యోగా, ధ్యానం వంటివి అలవరుచుకోండి.

5. Quit smoking: పొగ తాగడం మానేయండి

గుండె జబ్బులకు ప్రధాన కారణం పొగ తాగడం. స్మోకింగ్ ఆపేస్తే మీ గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం