తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Relationship: మీ భాగస్వామిలో ఈ మార్పులు కనిపిస్తే.. వాళ్లిక మీవారు కాదనే అర్థం..

Relationship: మీ భాగస్వామిలో ఈ మార్పులు కనిపిస్తే.. వాళ్లిక మీవారు కాదనే అర్థం..

HT Telugu Desk HT Telugu

29 October 2023, 18:04 IST

  • Relationship: భాగస్వామిలో కనిపించే మార్పుల వల్ల వాళ్లు మన నుంచి దూరం కావాలనుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. ఆ సూచనలేంటో తెలుసుకోండి.

భాగస్వామిలో మార్పులు
భాగస్వామిలో మార్పులు (pexels)

భాగస్వామిలో మార్పులు

సంసారిక బంధమైనా, ప్రేమ బంధమైనా బలంగా ఉండాలంటే స్త్రీ పురుషుల మధ్య సరైన అవగాహన ఉండాలి. ప్రేమతో నిండిన కేరింగ్‌ ఉండాలి. ఇలా కాకుండా నువ్వు చెప్తే నేను వినేదేంటి? అన్నట్లు ఉంటే ఆ బంధం బలహీనం కావడం ప్రారంభం అవుతుంది. క్రమంగా ఆ బంధంలోకి మూడో వ్యక్తి వచ్చే అవకాశాలు ఏర్పడతాయి. మన భాగస్వామి మనతో కాకుండా ఇంకొకరికి దగ్గరవుతున్నారు అనే విషయాన్ని వారు చేసే కొన్ని పనుల ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ఈ వ్యక్తి మన వారు కాదు అని సూచించే ఆ ఐదు సూచనలివే.

ట్రెండింగ్ వార్తలు

Tired After Sleeping : రాత్రి బాగా నిద్రపోయినా.. ఉదయం అలసిపోవడానికి కారణాలు

Foxtail Millet Benefits : మీకు ఉన్న అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు కొర్రలు చాలు

Egg potato Fry: పిల్లలకు నచ్చేలా కోడిగుడ్డు ఆలూ ఫ్రై రెసిపీ, చిటికెలో వండేయచ్చు

Mango eating: ఆయుర్వేదం ప్రకారం మామిడిపండ్లను తినాల్సిన పద్ధతి ఇది, ఇలా అయితేనే ఆరోగ్యానికి ఎంతో మంచిది

1. ఏదోలా మీతో గొడవ పెట్టుకోవడం :

రోజూ ఏదో ఒక విషయంలో మీతో గొడవ పెట్టుకుని మీకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లయితే ఆ వ్యక్తి ఇక మీ వారు కాకపోవచ్చు. మీ తప్పు ఉన్నా లేకపోయినా, ప్రతి చిన్న విషయానికీ మిమ్మల్నే ఎత్తి చూపిస్తారు. అసలు ఇది గొడవ పడేంత విషయమా? అని మీకు కొన్ని సార్లు అనిపిస్తుంటుంది. వారు పక్కనుంటే మీకు నిమిషాలు గంటల్లా గడవడం మొదలవుతుంది.

2. ఎక్కువగా ఫోన్‌లో ఉండటం :

మన భాగస్వామి ఇదువరకటితో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువగా ఫోన్‌లో గడుపుతున్నట్లు కనిపిస్తుంటారు. ఎక్కువగా ఛాటింగ్‌లు చేసుకుంటూ బిజీ బిజీగా ఉంటారు. వీలైతే గది తలుపులు పెట్టుకుని ఈ పనులు చేస్తుంటారు. బాత్రూమ్‌లోకి ఫోన్‌ని పట్టుకెళ్లి గంటల తరబడి అందులోనే ఉంటారు. ఫోన్‌ని మనకు అందకుండా చూసుకుంటారు. పాస్‌వర్డ్‌లు పెట్టుకుని లాక్‌ చేసుకుంటారు. ఈ అన్ని మీ పార్టనర్‌ చేస్తున్నట్లయితే ఏదో విషయం ఉన్నట్లుగానే అర్థం చేసుకోవచ్చు.

3. మీ ఇష్టా ఇష్టాల గురించి పట్టించుకోకపోవడం :

మీరు ఏమి ఆలోచిస్తున్నారు? మీ ఇష్టానుసారం ఏమైనా చేయాల్సి ఉందా? అనే విషయాన్ని అస్సలు లెక్కలోకి తీసుకోరు. వారు చేయాలనుకున్న దాన్ని చేసుకుంటూ పోతారు. మిమ్మల్ని అడగడం గాని, చెప్పడం గాని చెయ్యరు. నీతో నాకు లెక్కేంటి అన్నట్లుగా మసలుకోవడం ప్రారంభిస్తారు.

4. శారీరకంగా దూరం కావడం :

మీతో శారీరకంగా దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ దగ్గరగా మసలుకున్నా అక్కడ కూడా మీలో లోపాల్ని ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తారు. నువ్వు ఇలా లేవు. అలా లేవు. అంటూ బాడీ షేమింగ్‌ చేసేందుకు చూస్తారు. వేరొకరిని ఉదహరిస్తూ అలా ఉండాలంటూ హేళన చేస్తుంటారు.

5. హింసకు దిగడం :

మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని హింసించేందుకు ప్రయత్నిస్తారు. ఏం చేస్తే మీరు వారి నుంచి దూరంగా వెళ్లిపోతారో ఆ పనులన్నింటినీ చేసేందుకు చూస్తారు. ఈ ఐదు సూచనలు కనిపిస్తుంటే మాత్రం ఆ వ్యక్తి ఇక మీ వారు కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.

అపార్థాలకు తావు లేకుండా స్పష్టమైన ఆలోచనతో ఈ విషయాలను ఆలోచించి బేరీజు వేసుకోవాలి.

తదుపరి వ్యాసం