తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Soups: వేడివేడిగా క్రీమీ మష్రూమ్ సూప్, ఓట్స్ సూప్.. చలికాలంలో కడుపునిండే అల్పాహారాలు..

Breakfast Soups: వేడివేడిగా క్రీమీ మష్రూమ్ సూప్, ఓట్స్ సూప్.. చలికాలంలో కడుపునిండే అల్పాహారాలు..

29 November 2023, 6:30 IST

  • Breakfast Soups: శీతాకాలంలో అల్పాహారంలోకి చేసుకోలిగేవి ఓట్స్ సూప్, క్రీమీ మష్రూమ్ సూప్. వీటిని రుచిగా, వేడిగా ఎలా చేసుకుని సర్వ్ చేసుకోవాలో పక్కా కొలతలతో చూసేయండి. 

బ్రేక్‌ఫాస్ట్ సూప్స్
బ్రేక్‌ఫాస్ట్ సూప్స్ (pexels)

బ్రేక్‌ఫాస్ట్ సూప్స్

చలికాలంలో ఉదయాన్నే అల్పాహారంలోకి ఏదైనా వేడివేడిగా కారంగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ వేడి వేడి సూప్స్ చేసుకోండి. ఇంటిల్లీపాదీ లాగించేయొచ్చు. వీటితో కడుపు కూడా నిండిపోతుంది. ఇప్పుడు చాలా సింపుల్ గా సిద్ధమయ్యే ఆరోగ్యకరమైన రెండు రకాల సూపులు ఎలా చేసుకోవాలో చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

1. ఓట్స్ సూప్:

కావాల్సిన పదార్థాలు:

2 చెంచాల ఆలివ్ నూనె

1 కప్పు ఓట్స్

4 పెద్ద టమాటాలు

సగం కప్పు ఉల్లిపాయ ముక్కలు

2 వెల్లుల్లి రెబ్బలు, తరుగు

4 కప్పుల నీళ్లు

సగం కప్పు కొత్తిమీర

గుప్పెడు టోస్ట్ ముక్కలు

తగినంత ఉప్పు

తయారీ విధానం:

  1. ముందుగా మందపాటి కడాయి పెట్టుకుని వేడి చేసుకోవాలి. వేడెక్కాక అందులో ఆలివ్ నూనె వేసుకోవాలి.
  2. అందులో ఓట్స్ వేసుకుని సన్నం మంట మీద వేయించుకోవాలి.
  3. ఇప్పుడు బ్లెండర్లో టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొత్తిమీర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి.
  4. ఈ మిశ్రమాన్ని ఓట్స్ లో వేసుకోవాలి. దాంతోపాటే రెండు నుంచి మూడు కప్పుల నీళ్లు కూడా పోసుకోవాలి.
  5. ఒక ఉడుకు వచ్చేదాక మరగనివ్వాలి. అందులో చివరగా తగినంత ఉప్పు, టోస్ట్ ముక్కలు వేసుకుని దించేసుకుంటే సరి. కాస్త వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి.

2. మష్రూమ్ సూప్:

కావాల్సిన పదార్థాలు:

2 చెంచాల బటర్

సగం కప్పు ఉల్లిపాయ ముక్కలు

2 వెల్లుల్లి రెబ్బలు, తరుగు

పావు కప్పు మైదా

2 కప్పుల పుట్టగొడుగులు, ముక్కలు

3 కప్పుల కూరగాయలు ఉడికించిన నీళ్లు (వెజిటేబుల్ స్టాక్)

సగం చెంచా మిరియాల పొడి

తగినంత ఉప్పు

పావు కప్పు ఫ్రెష్ క్రీం

సగం చెంచా మిక్స్డ్ హెర్బ్స్

తయారీ విధానం:

  1. ఒక పెద్ద ప్యాన్‌లో బటర్ వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలి.
  2. వెల్లుల్లి, మైదా వేసుకుని నిమిషం పాటూ సన్నం మంట మీద కలుపుకోవాలి. ఇప్పుడు పుట్టగొడుగు ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, వెజిటేబుల్ స్టాక్ కూడా వేసుకొని కలుపుకోవాలి.
  3. పుట్టగొడుగులు మెత్తబడి ఒక రెండు ఉడుకులు వచ్చేదాకా ఉడకనివ్వాలి.
  4. ఇప్పుడు ఈ సూప్ నుంచి రెండు గరిటెలు పుట్టగొడుగుల ముక్కలతో సహా తీసి పక్కన పెట్టుకోవాలి.
  5. మిగతా మిశ్రమాన్నంతా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో బటర్ వేసుకుని మిక్సీ పట్టుకున్న సూప్, మిక్స్డ్ హెర్బ్స్, పక్కన పెట్టుకున్న పుట్టగొడుగుల మిశ్రమం, ఫ్రెష్ క్రీం వేసుకుని కలుపుకోవాలి. కాసేపు ఉడకనిచ్చి దింపేసుకుంటే క్రీమీ మష్రూమ్ సూప్ రెడీ.

తదుపరి వ్యాసం