తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beauty Soap Diy: సులభంగా దొరికే పదార్థాలతో.. ఇంట్లోనే బీట్‌రూట్ సబ్బు సిద్దం..

Beauty Soap DIY: సులభంగా దొరికే పదార్థాలతో.. ఇంట్లోనే బీట్‌రూట్ సబ్బు సిద్దం..

27 November 2023, 16:15 IST

  • Beauty Soap DIY: అందం కోసం సబ్బును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా బీట్‌రూట్ ఉపయోగించి ఎన్నో గుణాలున్న సబ్బును సులువుగానే చేసేయొచ్చు. దాని తయారీ ఎలాగో చూసేయండి.

బీట్‌రూట్ సబ్బు
బీట్‌రూట్ సబ్బు (pexels)

బీట్‌రూట్ సబ్బు

ఎవ్వరైనా సరే తమ ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా యువతులు తమ ముఖాన్ని మరింత నిగారింపుతో ఉంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఫేస్‌ వాష్‌లను, ఫేస్‌ ప్యాక్‌లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే బీట్‌ రూట్‌తో ఓ సౌందర్య సబ్బును తేలికగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దాని ద్వారా ముఖాన్ని మరింత కాంతివంతంగా మెరిసిపోయేలా చేసుకోవచ్చు. మరి దాని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటో, దాని తయారీ విధానం ఏమిటో చూసేద్దాం పదండి.

ట్రెండింగ్ వార్తలు

Mango Fruit Bobbatlu: మామిడిపండు బొబ్బట్లు చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి ఎందుకు తినకూడదో అసలైన కారణాలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

బీట్‌రూట్‌ సబ్బు తయారీకి కావాల్సిన పదార్థాలు :

బీట్‌రూట్‌ పొడి : రెండు టేబుల్‌ స్పూన్లు,

అలోవెరా గుజ్జు : మూడు టేబుల్‌ స్పూన్లు,

స్వీట్‌ ఆల్మండ్‌ ఆయిల్‌ : ఒక టీ స్పూను,

ఆర్గానిక్ పసుపు పొడి : ఒక టీ స్పూను,

టీ ట్రీ ఆయిల్‌ : నాలుగు చుక్కలు,

సోప్‌ బేస్‌ : 400 గ్రాములు.

సోప్‌ బేస్‌కి బదులుగా ఫ్లేవర్ లేని మామూలు సోప్ కూడా వాడుకోవచ్చు.

బీట్‌రూట్‌ సబ్బు తయారీ విధానం :

ఈ సబ్సు తయారు చేసుకోవడానికి ముందుగా బీట్‌ రూట్‌ పొడిని తయారు చేసుకోవాలి. అందుకు ఒక బీట్‌ రూట్‌ని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత దాన్ని గ్రేటర్‌తో తురిమి ప్లేట్‌లో పల్చగా చేసి ఎండబెట్టుకోవాలి. రెండు మూడు రోజులకు అది పూర్తిగా ఆరిపోయి గలగల్లాడుతుంది. అప్పుడు దాన్ని మిక్సీలో వేసుకుంటే పొడి అవుతుంది. దాన్ని చేసి పక్కనుంచుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించి పెద్ద గిన్నెలో గ్లాసు నీళ్లు పోసి పెట్టాలి. అందులో మరో గిన్నె పెట్టుకుని తురుముకున్న సోప్ బేస్‌ని అందులో వేసుకోవాలి. డబుల్‌ బాయిలింగ్ మెథడ్‌లో దాన్ని కరగనివ్వాలి. సబ్బు అంతా కరిగిన తర్వాత అందులోకి బీట్‌ రూట్‌ పొడి, కలబంద గుజ్జు, ఆల్మండ్‌ అయిల్‌, పసుపు పొడి, టీట్రీ ఆయిల్‌ అన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని సోప్ మౌల్డ్‌లోకి తీసుకోవాలి. దాన్ని ఒక రోజంతా అలా వదిలేయాలి. తొందరగా గట్టిబడాలనుకుంటే ఫ్రిజ్‌లో అయినా పెట్టుకోవచ్చు. మరుసటి రోజు డీ మౌల్డ్‌ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా బీట్‌ రూట్‌ సబ్బు తయారయిపోతుంది.

రోజూ దీన్ని ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మం మరింత రంగు వస్తుంది. ఆరు వారాల పాటు దీన్ని వరుసగా వాడేసరికి ఫలితం స్పష్టంగా తెలుస్తుంది. ట్యానింగ్‌ తగ్గుతుంది. చర్మం రంధ్రాలు ఎక్కువగా కనిపించే వారికి ఆ సమస్యా తగ్గుతుంది. ముఖం మరింత కాంతివంతంగా తయారవుతుంది.

తదుపరి వ్యాసం