తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spices For Heart Health: రోజూ వంటలో ఈ వంటింటి మసాలాలు వాడితే.. గుండె ఆరోగ్యం భద్రం..

Spices For Heart Health: రోజూ వంటలో ఈ వంటింటి మసాలాలు వాడితే.. గుండె ఆరోగ్యం భద్రం..

03 December 2023, 16:30 IST

  • Spices For Heart Health: రోజూవారీ వంటల్లో వాడే కొన్ని మసాలాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అవేంటో తెల్సుకుని రోజూ కొద్దిమొత్తంలో అయినా వాడే ప్రయత్నం చేస్తే ఆరోగ్యం మనసొంతం.

గుండె ఆరోగ్యానికి సుగంధ ద్రవ్యాలు
గుండె ఆరోగ్యానికి సుగంధ ద్రవ్యాలు (pexels)

గుండె ఆరోగ్యానికి సుగంధ ద్రవ్యాలు

గుండె జబ్బుల వల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. మారుతున్న జీవన శైలి, శారీరక శ్రమ ఎక్కువగా లేని పనులు, కొవ్వులు ఉప్పులాంటివి ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం.. తదితరాల వల్ల గుండె ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. అందుకనే మనం మన గుండెను తప్పకుండా భద్రంగా చూసుకోవాల్సిందే. అందుకోసం కొన్ని వంటింటి సుగంధ ద్రవ్యాలను రోజు వారీ ఆహారంలో వేసుకుని తినాలని కార్డియాలజీ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

1. దాల్చిన చెక్క:

మన వంటిళ్లల్లో తేలికగా దొరికే దినుసుల్లో దాల్చిన చెక్క ఒకటి. దీనిలో సిన్నామలడెహైడ్‌, సినమిక్‌ యాసిడ్‌ అనే రెండూ కూడా గుండెను రక్షించే లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిలో వాపుల్ని తగ్గించే గుణాలూ ఎక్కువగా ఉంటాయి.

2. ధనియాలు:

గుండె సక్రమంగా పని చేయడానికి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉండటం అనేది ఎంతగానో సహాయపడుతుంది. ధనియాలను ఆహారంలో భాగంగా క్రమం తప్పకుండా లోపలికి తీసుకుంటూ ఉండటం వల్ల అవి మనలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ముఖ్యంగా ట్రై గ్లిజరైడ్స్‌ని తగ్గిస్తాయి. అందువల్ల గుండె మరింత ఆరోగ్యంగా పని చేస్తుంది. ఫలితంగా హృదయ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

3. అల్లం:

మనం వంటల్లో అల్లాన్ని ఎక్కువగానే ఉపయోగిస్తూ ఉంటాం. దీనిలో జింజరాల్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్త నాళాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అందువల్ల రక్త ప్రసారం సజావుగా జరుగుతుంది. ఈ అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా ఉండటానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది.

4. పసుపు:

భారతీయులు చాలా మంది ఏ కూర వండినా అంత పసుపు వేయకుండా అది పూర్తికాదు. అంతగా పూర్వ కాలం నుంచి దీన్ని వాడటం పెద్దలు మనకు అలవాటు చేశారు. దీన్ని కచ్చితంగా ఆహారంలో తగినంతగా వేసుకుంటూ ఉండాలి. దీనిలో ఉండే కుర్య్కుమిన్‌ శరీరంలోని వాపులు, ఆక్సిడేషన్‌ని తగ్గిస్తుంది. ఇవి గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా ఉంటాయి.

5. నల్ల మిరియాలు:

మిరియాలను మనం అంతా వాడుతుంటాం. కాకపోతే ప్రతి రోజూ వాడం. ఎక్కువగా జలుబు, దగ్గుల్లాంటివి ఉన్నప్పుడు మాత్రమే వాడేందుకు చూస్తుంటాం. అయితే వీటిని అన్ని మసాలా కూరల్లో చక్కగా కొద్ది మొత్తంలో వేసుకుంటూ ఉండాలి. ఇవి గుండె పనితీరును మెరుగుపరచడంలో ఎంతగానో సహకరిస్తాయి. దీంతో నరాలపై అధిక ఒత్తిడి పడకుండా ఉంటుంది.

తదుపరి వ్యాసం