తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rosemary Water: ఈ మ్యాజికల్ నీళ్లు వాడితే చాలు.. జుట్టు సమస్యలన్నీ తగ్గిపోతాయి..

Rosemary water: ఈ మ్యాజికల్ నీళ్లు వాడితే చాలు.. జుట్టు సమస్యలన్నీ తగ్గిపోతాయి..

07 November 2023, 17:30 IST

  • Rosemary water: రోజ్‌మేరీ నీళ్లతో జుట్టు సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు. ఈ నీటిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలి? ఎలా వాడాలనే విషయాలు తెలుసుకుందాం. 

రోజ్‌మెరీ వాటర్
రోజ్‌మెరీ వాటర్ (freepik)

రోజ్‌మెరీ వాటర్

జుట్టును సంరక్షించుకోవడానికి మనం ఎన్నో చిట్కాలను అవలంబిస్తూ ఉంటాం. మార్కెట్లో దొరికే రకరకాల షాంపూలు కండిషనర్లను ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే ఇలాంటి వాటిలో ఉండే రసాయనాల వల్ల ఒక్కోసారి మన జుట్టుపై చెడు ప్రభావం పడుతూ ఉంటుంది. కొన్ని మనకు పడక జుట్టు మరింత రాలిపోతూ ఉంటుంది. మీరు మీ జుట్టును మరింత కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా చేసుకోవాలనుకుంటే ఇంట్లో తయారు చేసుకునే రోజ్‌ మేరీ వాటర్‌ని ఓ సారి ప్రయత్నించి చూడండి. దీని వల్ల కేశాలు మరింత వేగంగా పొడవు పెరుగుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

రోజ్‌ మేరీ వాటర్‌ తయారీ :

సాధారణంగా మన దగ్గర రోజ్‌ మేరీ ఎక్కువగా దొరకదు. అది ఇక్కడ వాతావరణంలో పెరిగే మొక్క కాదు. అందుకనే తాజా ఆకులు మనకు దొరకడం కష్టం. బదులుగా మార్కెట్లో రోజ్‌మేరీ డ్రైడ్‌ లీవ్స్‌ ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి. వాటిని తెచ్చుకుని మనం ఈ నీటిని తయారు చేసుకోవచ్చు. మరుగుతున్న నీటిలో కొన్ని ఈ ఆకుల్ని వేసి మరగనివ్వాలి. తర్వాత ఆ ఆకుల్ని వడగట్టి నీటిని చల్లారనివ్వాలి. దాన్ని ఓ స్ప్రే డబ్బాలో పెట్టుకుని పక్కనుంచుకోవాలి. తర్వాత తలస్నానం చేయాలి. జుట్టంతా శుభ్ర పడిన తర్వాత ఈ స్ప్రే డబ్బాతో రోజ్‌మేరీ నీటిని స్ప్రే చేసుకోవాలి.

అయితే ఈ నీటిని తయారు చేసుకునేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. మరీ ఎక్కువగా ఈ ఆకుల్ని వేసుకోకూడదు. అంటే గాఢత ఎక్కువగా ఉండకూడదు. కొద్ది మొత్తంలో వేసుకుని రోజ్‌ మేరీ నీటిని తయారు చేసుకుంటే సరిపోతుంది.

జట్టుకు రోజ్‌ మేరీ నీటితో ఉపయోగాలు :

  • రోజ్‌మేరీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ వల్ల జరిగే జుట్టు దెబ్బతినడాన్ని నిరోధిస్తాయి. దీంతో జుట్టు రఫ్‌గా మారడం, చివర్లు చిట్లడం లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
  • జుట్టు రాలడానికి సంబంధించిన ఎంజైముల్ని ఇది నియంత్రిస్తుంది.
  • అలాగే మాడుని శుభ్రం చేస్తుంది. దీనిలో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల కారణంగా జుట్టు కుదుళ్ల దగ్గర వాపుల్లాంటివి ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. అందువల్ల కేశాలు ఆరోగ్యంగా ఎదుగుతాయి.
  • దీనిలో యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు ఉంటాయి. అందువల్ల స్కాల్ప్‌ పైన ఏమైనా బ్యాక్టీరియల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు ఉన్నట్లయితే అవి తగ్గుతాయి. చుండ్రు నియంత్రణలోకి వస్తుంది. తద్వారా జుట్టు మరింత బలోపేతం అవుతుంది.
  • జుట్టు కుదుళ్లలోకి రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తుంది. అందువల్ల జుట్టు ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.

తదుపరి వ్యాసం