తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Job Tips For Freshers | ఇలా చేస్తే.. మెుదటి ప్రయత్నంలోనే ఉద్యోగం !

Job Tips for Freshers | ఇలా చేస్తే.. మెుదటి ప్రయత్నంలోనే ఉద్యోగం !

23 December 2021, 23:50 IST

    • ఏదైనా ఉద్యోగం పొందలేకపోతున్నారంటే ముందుగా ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు, నైపుణ్యాలు మీలో ఉన్నాయా, లేవా? అనేది తెలుసుకోవాలి. ఏయే విషయాల్లో వెనకబడి ఉన్నారో గ్రహించి అందుకు తగినట్లుగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. 
jobs for freshers
jobs for freshers

jobs for freshers

చాలా మంది విద్యార్థులు తమ చదువు పూర్తైన వెంటనే చేసే పని ఉద్యోగాన్వేషణ! ఫ్రెషర్స్‌‌గా ఉద్యోగ ప్రయత్నాలు మెుదలుపెట్టాము.. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తామా? మంచి సంస్థలో ఉద్యోగం వస్తుందా? లాంటి భయాలు అభ్యర్థుల్లో ఉంటాయి. ఇదే సమయంలో తోటి స్నేహితులెవరికైనా ఉద్యోగం లభిస్తే, ఆ ఉద్యోగం మాకెందుకు రాలేదని మదనపడటం కూడా సహజమే. నిజానికి ఇది ఏ ఒక్కరి సమస్యనో కాదు. మెుదటిసారి ఉద్యోగాన్వేషణలో ఉన్న చాలా మంది పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది.  

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti Telugu : మీకు ఈ అలవాట్లు ఉంటే పేదరికంలోనే ఉండిపోతారు

Chicken vs Eggs: చికెన్ vs గుడ్లు... ఈ రెండింటిలో వేటిని తింటే ప్రోటీన్ లోపం రాకుండా ఉంటుంది?

Cucumber Egg fried Rice: కీరాదోస ఎగ్ ఫ్రైడ్ రైస్... బ్రేక్ ఫాస్ట్ లో అదిరిపోయే వంటకం, ఎవరికైనా నచ్చుతుంది

Saturday Motivation: ప్రశాంతమైన జీవితానికి గౌతమ బుద్ధుడు చెప్పే బోధనలు ఇవే

ఏదైనా ఉద్యోగం పొందలేకపోతున్నారంటే ముందుగా ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు, నైపుణ్యాలు మీలో ఉన్నాయా, లేవా? అనేది తెలుసుకోవాలి. ఏయే విషయాల్లో వెనకబడి ఉన్నారో గ్రహించి అందుకు తగినట్లుగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. 

ఉద్యోగాణ్వేషణలో ఉన్న ఫ్రెషర్స్ మొదటి ప్రయత్నంలోనే జాబ్ సంపాదించడానికి ఇక్కడ కొన్ని టిప్స్ (Job Tips for Freshers) అందిస్తున్నాం. వీటిని అనుసరించి, ఇబ్బందులను అధిగమిస్తే మీకు ఉద్యోగం గ్యారెంటీ.

ప్రజెంటేషన్‌ స్కిల్స్

సరైన ప్రజెంటేషన్‌ నైపుణ్యాలు లేకపోవడం వల్ల ఉద్యోగం పోందడంలో అభ్యర్థులు వెనకబడుతుంటారు. తమ శక్తి సామర్థ్యాలను సమర్థవంతంగా ప్రజెంట్‌ చేసుకోగలిగినవారే విజేతలవుతారు. దీని కోసం కాలేజీ స్థాయి నుంచే ప్రజెంటేషన్‌ స్కిల్స్ మీద దృష్టి పెట్టాలి. మాక్ ఇంటర్వ్యూలలో పాల్గొనాలి.  విషయాన్ని స్పష్టంగా, ఎలాంటి బెరుకు లేకుండా వివరించగలగాలి.

ఇంటర్న్‌షిప్

మీరు ఫ్రెషర్‌గా ఉద్యోగం పోందడంలో ఇబ్బంది పడుతుంటే, ముందుగా మంచి కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పని సంస్కృతిని అర్థం చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. పరిశ్రమలో సంబంధాలను ఏర్పరచడంలో కూడా సహాయపడుతుంది.  ఇంటర్న్‌షిప్ పొందిన ఫ్రెషర్స్, నిర్ణీత సమయంలో వీలైనంత వరకు నేర్చుకుని సంస్థ వృద్ది కోసం మీ వంతు తోడ్పాటు అందించండి.

అనుభవజ్ఞులైన వ్యక్తుల మార్గదర్శకత్వం

మొదటి సారి ఉద్యోగం సంపాదించడం అంత సులభమేమి కాదు. మీరు ఎంచుకున్న రంగంలోని అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సలహాలు, సూచనలు తీసుకొని.  డిమాండ్ ఉన్న సాకేంతిక అంశాలపై దృష్టి సారించాలి. మిమ్మల్ని మీరు గైడ్ చేసుకోండి. సోషల్ మీడియాలో మంచి నెట్‌వర్క్, మీ స్కూల్, కాలేజీ సీనియర్లతో సత్సంబంధాలను కలిగి ఉండండి.

ఆకర్షణీయమైన ప్రొఫైల్‌

మీకు ఇంటర్వ్యూ కాల్ రావాలంటే ముందుగా మీ ప్రొఫైల్ రిక్రూటర్లకు ఆకర్షణీయంగా కనిపించాలి. మీ రెజ్యూమెలో ఉద్యోగార్హతలకు సంబంధించిన స్కిల్స్‌ కొన్నింటిని పొందుపరచండి. ఆన్ లైన్ కెరీర్ కౌన్సలర్ సలహాలతో ప్రొఫెషనల్‌గా రెజ్యూమెను తయారు చేసుకోండి. సమయం ఉంటే, మీ ఉద్యోగ నైపుణ్యాలకు సంబంధించి తగిన డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సులను (ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులు) పూర్తిచేయండి . ఇది మీ CVని ప్రభావవంతంగా మారుస్తుంది.

డిమాండ్ ఉన్న కోర్స్

కేవలం కాలేజీలో చెప్పిన పాఠ్యాంశాలపై అవగాహన ఉంటేనే సరిపోదు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మరింత సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడం నేటికాలంలో చాలా అవసరం. డిమాండ్ ఉన్న కోర్సులను నేర్చుకుంటూ, కొత్త విషయాలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండండి.

టాపిక్

తదుపరి వ్యాసం