తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  బేఫికర్ రైడ్ కోసం Ivoomi Jeet, S1 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

బేఫికర్ రైడ్ కోసం iVOOMi Jeet, S1 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

HT Telugu Desk HT Telugu

22 March 2022, 21:42 IST

    • iVOOMi ఎనర్జీ తమ బ్రాండ్ నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇవి ప్రత్యేకంగా అమ్మాయిలకు బాగా సరిపోతాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ల ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 82,999 నుండి ప్రారంభమవుతున్నాయి.
iVOOMi Jeet e- scooter
iVOOMi Jeet e- scooter (iVOOMi Energy)

iVOOMi Jeet e- scooter

పుణెకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీదారు iVOOMi ఎనర్జీ తమ బ్రాండ్ నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. iVOOMi S1, Jeet పేర్లతో విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ల ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 82,999 నుండి ప్రారంభమవుతున్నాయి. తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌ చేస్తే గరిష్టంగా 130 కి.మీల రేంజ్‌ను అందించగలవని కంపెనీ పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

Weight Loss Tips : బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనం ఎంత ముఖ్యమో తెలుసుకోండి..

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

iVOOMi S1 గురించి చెప్పాలంటే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటే వేరియంట్‌లో లభిస్తుంది. ఇందులో 2kW ఎలక్ట్రిక్ మోటార్ అమర్చారు. ఇది 60V, 2kWh Li-ion బ్యాటరీ ప్యాక్‌తో శక్తిని పొందుతుంది. ఈ బ్యాటరీని మార్చుకోవచ్చు కూడా. ఇక ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఈ స్కూటర్ 115 కి.మీల రైడింగ్ రేంజ్‌ని అందిస్తుంది, అలాగే గంటకు 65 km గరిష్ట వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్‌) గా నిర్ణయించారు.

మరొక స్కూటర్ iVOOMi జీత్ రెండు (స్టాండర్డ్/ ప్రో) వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ. 82,999 అలాగే రూ. 92,999 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే జీత్ ప్రో స్కూటర్ కెపాసిటీ కొద్దిగా మెరుగ్గా ఉంటుంది.

iVOOMi జీత్ స్టాండర్డ్ వేరియంట్‌లో 1.5kWh బ్యాటరీ ప్యాక్‌ అమర్చగా, ప్రో వేరియంట్‌లో 2kWh బ్యాటరీ ఇచ్చారు. అయితే ఈ రెండు వేరియంట్లు కూడా ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 130 కిమీల రేంజ్‌ను అందజేస్తాయని పేర్కొన్నారు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు రెడ్, బ్లూ, గ్రే అనే మూడు రంగుల షేడ్స్‌లలో అందుబాటులో ఉన్నాయి.

తదుపరి వ్యాసం