తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Apple Self-driving Car । ఐఫోన్ కంపెనీ నుంచి స్మార్ట్ కార్ రాబోతుందా?

Apple Self-driving Car । ఐఫోన్ కంపెనీ నుంచి స్మార్ట్ కార్ రాబోతుందా?

HT Telugu Desk HT Telugu

26 July 2022, 22:44 IST

    • ఐఫోన్లను తయారు చేసే ఆపిల్ కంపెనీ ఇప్పుడు కార్లను కూడా తయారు చేస్తుందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
Apple Car
Apple Car

Apple Car

ఐఫోన్ తయారీదారు ఆపిల్ కంపెనీ ఆటోమోటివ్ వ్యాపారంలోకి ప్రవేశిస్తుందా? టోక్యో అనలిటిక్స్ కంపెనీ, జపనీస్ ఆర్థిక ప్రచురణ సంస్థ నిక్కీ సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలో ఇది నిజమేనని తేలింది. సెల్ఫ్ డ్రైవింగ్ కారును అభివృద్ధి చేయడానికి ఆపిల్ కంపెనీ పేటెంట్‌లను దాఖలు చేసినట్లు వెల్లడైంది. సుమారు 248 రకాల పేటేంట్ హక్కుల కోసం ఆపిల్ దరఖాస్తు చేసుకుంది. ఇందులో సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ, సీట్లు, నావిగేషన్, బ్యాటరీ మేనేజ్‌మెంట్ మొదలైన అంశాలు ఉన్నాయి. మొత్తంగా ఇది ఒక స్మార్ట్ కారుగా ఉండవచ్చునని భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

Weight Loss Tips : బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనం ఎంత ముఖ్యమో తెలుసుకోండి..

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

ఐఫోన్ తయారీదారు వెహికల్-టు-ఎవ్రీథింగ్ (V2X) సాంకేతికతపై కూడా పని చేస్తోంది. ఈ టెక్నాలజీతో కార్లు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోగలవు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)కి కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది.

2000 నుంచి 2022 జూన్ 1 వరకు కూడా, ఆపిల్ బ్రాండ్ ఆటోమొబైల్ సంబంధిత పేటెంట్ల కోసం దరఖాస్తు చేసిందని Nikkei Asia నివేదిక వెల్లడించింది. గత జనవరి 2021లో సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీకి సంబంధించి హ్యుందాయ్ మోటార్- Apple మధ్య చర్చలు జరిగినట్లు నివేదికలో ఉంది. అయితే అప్పట్లోనే హ్యుందాయ్ కంపెనీ దీనిని ఖండించింది.

Apple కంపెనీ కూడా ఇప్పటివరకు తమ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఆశయాల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే 2024లో ఆపిల్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించాలనే లక్ష్యంతో ఫోర్డ్ కార్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ గా ఉజ్కాషెవిక్‌ను ఆపిల్ కంపెనీ నియమించుకున్నట్లు వార్తలు బయటకు పొక్కాయి.

ఫోర్డ్ కంపెనీ గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇంజినీరింగ్ గా వ్యవహరించిన ఉజ్కాషెవిక్ ఇప్పుడు యాపిల్ కోసం పూర్తి ఎలక్ట్రిక్ అటానమస్ కారును అభివృద్ధి చేయడంలో సహాయపడుతున్నారు.

సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఇతర డ్రైవర్‌లకు తెలియజేయడానికి ఆపిల్ కార్ వాహనం అంతటా LED స్క్రీన్‌లను ఉపయోగించాలని కూడా భావిస్తున్నారు. బ్రేకింగ్ సమాచారం, కారు వేగం, ఇతర సందేశాలను గ్రాఫిక్స్, వీడియో రూపంలో చూపుతుంది.

రాబోయే Apple కార్‌లో A12 బయోనిక్ ప్రాసెసర్‌పై ఆధారపడిన `C1` చిప్‌ని, ఐ-ట్రాకింగ్ వంటి ఇన్-క్యాబిన్ AI కెపాసిటర్లను కూడా ఉపయోగించనున్నట్లు సమాచారం.

టాపిక్

తదుపరి వ్యాసం