తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Self Care Day | మీరు అందరి గురించి ఆలోచిస్తారు సరే.. మరి మీ గురించి?

Self Care Day | మీరు అందరి గురించి ఆలోచిస్తారు సరే.. మరి మీ గురించి?

Manda Vikas HT Telugu

24 July 2022, 15:58 IST

    • International Self Care Day | బాధ్యతలు ఎప్పుడూ ఉండేవే. మీ కోసం మీరు ఎంత బాధ్యతగా ఉంటున్నారు. మీ కోసం మీరు ఏం చేసుకుంటున్నారు? మీ సంరక్షణ, మీ ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా.
International Self Care Day
International Self Care Day (Unsplash)

International Self Care Day

ఇల్లు, పని, కుటుంబ బాధ్యతలు చూసుకోవడం, ఇంట్లోని వారి అవసరాలు తీర్చటం. స్నేహితులు, శ్రేయోభిలాషులకు సహాయపడటం ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే. ప్రతిరోజు తీరిక లేకుండా గడుపుతున్నారు సరే. మీ కోసం మీరెప్పుడైనా కేటాయించుకున్నారా? మీ గురించి మీరు సంరక్షణ చర్యలు తీసుకున్నారా? ఇతరుల అవసరాలు తీర్చుతున్నప్పుడు మీ స్వంత అవసరాల కోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారు? మీ ఆరోగ్యానికి సంబంధించి, మీ శ్రేయస్సుకు సంబంధించి ఇది ఎంతో కీలకమైన విషయం. అందుకే స్వీయ సంరక్షణ అవసరాన్ని తెలియజేస్తూ ప్రతి ఏడాది జూలై 24న స్వీయ-సంరక్షణ దినోత్సవం (International Self Care Day)గా నిర్వహిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, అధ్యాత్మికంగా అన్ని విధాల తన కోసం తాను కేటాయించుకొని, తన సంరక్షణ తాను చేసుకోవడానికి ఉన్న ప్రాముఖ్యతను ఈరోజు ఎత్తి చూపిస్తుంది.

మీ శ్రేయస్సును కోరి మీ కోసం మీరు అన్ని విధాలుగా ఎలాంటి కేర్ తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఉదాహారణలు పేర్కొన్నాం. ఇలా ఒకరోజు గడపండి.

శారీరక సంరక్షణ

మీ ఆరోగ్యం కోసం అవసరమైన చర్యలు తీసుకోవడం. మంచి భోజనం చేయడం. వ్యాయామం చేయడం. మీకేమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అందుకు తగినట్లు వైద్య సహాయం పొందటం. మంచిగా నిద్రపోవటం. ఆరోగ్యమైన, దృఢమైన శరీరం కోసం చర్యలు తీసుకోవడం ఉంటాయి.

మానసిక సంరక్షణ

ఈరోజుల్లో ఒత్తిడి, ఆందోళనలు మనిషిని జీవితంలో కుంగదీస్తున్నాయి. మీకు ఒత్తిడి ఉండే ఉంటుంది. కాబట్టి మీ మానసిక ఆరోగ్యం కోసం మీరు ఆలోచించండి. మీకు ఆనందాన్ని కలిగించే పని, మీకు నచ్చిన పని చేయండి. మంచి మ్యూజిక్ వినండి, డాన్స్ చేయండి, హార్స్ రైడింగ్, బైక్ రైడింగ్, పుస్తక పఠనం ఇలా మీ మానసికోల్లాసాన్ని పెంచే పనులు చేయండి.

సామాజిక సంరక్షణ

మనకు ఇష్టమైన వారిని కలిసి, వారితో సమయం గడిపితే సమాజంలో మన బంధాలు, అనుబంధాలు మెరుగుపడతాయి. మీ స్నేహితులని కలవండి, లేదా మీ గురువును కలిసి మీ భావాలు పంచుకోండి.

ఆధ్యాత్మిక సంరక్షణ

దేవుడిని నమ్మినా, నమ్మకపోయినా ఒక సిద్ధాంతాన్ని కలిగి ఉండటం. మీరు నమ్మిన ధర్మాన్ని ఆచరించేందుకు కొంత సమయం కేటాయించడం చేయాలి. దేవుడిని నమ్మితే ఆలయానికి వెళ్లి మీకోసం మీరు ప్రార్థించుకోండి.

భావోద్వేగపూరితమైన సంరక్షణ

మన జీవితం భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. బాధ, కోపం, సంతోషం, నిరాశ ఇలా ఎలాంటి భావోద్వేగమైనా మీ నియంత్రణలో ఉండాలి. మిమ్మల్ని సరైన దిశలో నడిపించాలి. యోగా, ధ్యానం లాంటివి ప్రాక్టీస్ చేయండి. లేక మీ భావోద్వేగాల సంరక్షణ కోసం మిమ్మల్ని ఎల్లవేళలా ప్రోత్సహించేవారితో పంచుకోండి.

తదుపరి వ్యాసం