తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Poha Medu Gare Recipe : టేస్టీ టేస్టీ పోహ గారెలు.. ఒక్కసారి తింటే అస్సలు వదలరు..

Poha Medu Gare Recipe : టేస్టీ టేస్టీ పోహ గారెలు.. ఒక్కసారి తింటే అస్సలు వదలరు..

05 January 2023, 7:30 IST

    • Poha Medu Gare Recipe : గారెలు తయారు చేసుకోవాలంటే మినపప్పు ఎప్పుడో నానబెట్టాలి. దానిని రుబ్బి మనం గారెలు చేసుకునే సరికి టైం అంతా గడిచిపోతుంది. అయితే మీరు త్వరగా, టేస్టీగా గారెలు తయారు చేసుకోవాలంటే.. పోహ వడను ట్రై చేయవచ్చు.
పోహ గారెలు
పోహ గారెలు

పోహ గారెలు

Poha Medu Gare Recipe : పోహాతో దోశలు చేసుకుంటాము. వివిధ రకాలైన పోహాలు తయారు చేసుకుంటాము. అయితే ఈ పోహాతో వడలు కూడా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? దీనికోసం మీరు గంటల కొద్ది కిచెన్​లో కష్టపడిపోనాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని పదార్థాలతో.. తక్కువ సమయంలో ఈ వడలు తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి ఎందుకు తినకూడదో అసలైన కారణాలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

కావాల్సిన పదార్థాలు

* పోహ - 1 కప్పు

* పెరుగు - 1 కప్పు

* పచ్చిమిర్చి - 2 (తరిగినవి)

* కొత్తిమీర - పిడికెడు (తరిగినది)

* కరివేపాకు - ఓ రెబ్బ

* జీలకర్ర - చిటికెడు

* అల్లం - 1/2 టీస్పూన్

* ఉప్పు - రుచికి తగినంత

* బియ్యం పిండి - 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం

ఒక గిన్నెలో పోహా తీసుకొని కడిగి.. నీళ్లు వడకడ్డి అలాగే ఉంచాలి. ఓ గంట ఉంచిన తర్వాత దానిలో పెరుగు వేయండి. కొద్ది కొద్దిగా పెరుగు వేస్తూ.. మెత్తని పిండి వచ్చేలా కలుపుతూ ఉండండి. పిండి నీరుగా అనిపిస్తే.. దానిలో కొద్దిగా బియ్యం పిండిని వేయవచ్చు.

ఇప్పుడు ఈ మిశ్రమంలో కట్ చేసి పెట్టుకున్న, మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపండి. ఒక మంచి మిక్స్ వచ్చిన తర్వాత.. మీడియం సైజ్​లలో గారెలు తయారు చేయండి. కాగుతున్న నూనెలో ఈ గారెలు వేసి.. డీప్ ఫ్రై చేయండి. బంగారు రంగు వచ్చేవరకు వేయించి వేడి వేడిగా సర్వ్ చేసేయండి. దీనిని గ్రీన్ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. అయితే చల్లగా అయ్యేవరకు కాకుండా.. వేడిగా ఉన్నప్పుడే తినేయండి.

తదుపరి వ్యాసం